ప్రతి క్షణం తెలుపుతున్నది మరో క్షణంకై జీవించు రేపటిని తిలకించు విజ్ఞానంతో అందరిని సాగించు
ప్రతి క్షణం మరో క్షణాన్ని ఉదయింపజేస్తూ తెలుపుతున్నది సంతోషంగా రేపటి కోసం ఉన్నతంగా జీవించు
ప్రతి క్షణం తెలుపుతున్నది మరో క్షణంకై ఆది కాలం నుండి జన్మిస్తూ జన్మనిస్తూ ఉదయిస్తూ సాగుతూనే ఉన్నా
తొలి క్షణమై ఒక క్షణమై మరో క్షణంమై క్షణాలుగా సాగుతూనే సమయంతో కాలమై విశ్వంతో ప్రయాణిస్తూనే ఉన్నా
ఒక క్షణంలోనే ఆలోచించా మరో క్షణం కావాలని ఆ క్షణం మరో క్షణాన్ని సృష్టించాలని అలాగే క్షణాలతో సాగిపోవాలని
తొలి క్షణంతోనే ఎన్నో ఆలోచించా ఎంతో సమయంతో ఎంతో కాలాన్ని సాగిస్తూ ఎన్నింటినో సృష్టిస్తూ అలాగే సాగిపోవాలని
No comments:
Post a Comment