Thursday, September 12, 2024

ప్రకృతి ఎటువంటి జీవ [సజీవ నిర్జీవ] పదార్థాన్నైనా ఆవహిస్తూ ఉంటుంది

ప్రకృతి ఎటువంటి జీవ [సజీవ నిర్జీవ] పదార్థాన్నైనా ఆవహిస్తూ ఉంటుంది 

విశ్వంలో జీవించే జీవరాసులను కూడా ప్రకృతి ఆవహిస్తూ ఉంటుంది 

జీవిలో జీవించే శక్తి సామర్థ్యం ఉన్నంతవరకే ప్రకృతి జీవన కార్యాలకు సహకరిస్తుంది 
జీవిలో జీవించే శక్తి సామర్థ్యాలు లేకపోతే ప్రకృతియే సజీవ పదార్థాన్ని నిర్జీవంగా మార్చేస్తూ తనలో కలుపుకుంటూ శూన్యం చేస్తూ ఆవహిస్తూ ఉంటుంది 

ప్రకృతి నిరంతరం పంచభూతాలుగా జీవ పదార్థాలను ఆవహిస్తూ ఉంటుంది 

ప్రకృతికి ప్రకృతియే ఆహారం 
ప్రకృతి ప్రకృతినే ఆవహిస్తూ పరిశుద్ధమవుతూ ఎదుగుతూ తరుగుతూ ఉంటుంది 
ప్రకృతిలో కలుషితమైన ప్రదేశాన్ని ప్రాంతాన్ని పదార్థాన్ని ప్రకృతియే పరిశుద్ధం చేసుకుంటుంది 

జీవిలో జీవంతం ఉన్నంతవరకే శరీరానికి ప్రకృతి పరిశుద్ధమైన ప్రాణవాయువును అందిస్తుంది 

ప్రకృతి జీవులకు ఒక వైపు శక్తి సామర్థ్యాలను అందిస్తుంది మరోవైపు ఆవహిస్తుంటుంది 

ప్రకృతి కూడా పంచభూతాల పదార్థమే 
ప్రకృతిలో నిరంతరమైన ఎదుగుదలగల అభివృద్ధి ఎల్లప్పుడూ పుష్కలంగా సాగుతూనే ఉంటుంది 

ప్రకృతిలో కలిగే జీవక్రియల ప్రక్రియలు [సజీవ నిర్జీవ పదార్థాలు] అనంతమైన మర్మంతో కూడిన రహస్యమైన శాస్త్రీయ సహజ సిద్ధాంతాలు  



No comments:

Post a Comment