జన్మించుటలో సహజత్వం లేదు జీవించుటలో సహజత్వం లేదు మరణించుటలో సహజత్వం లేదు
జన్మించుటలో వైద్యశాలయందు కృత్రిమంగా జన్మిస్తావు
శ్వాసను కృత్రిమ శ్వాసనాళంతో ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు సాగిస్తావు
ఆహారాన్ని కృత్రిమంగా అందుకుంటావు [ఆహార తయారి విధానం కృత్రిమమైన విజ్ఞానమే]
సూర్యరశ్మి లేక చికిత్స పొందుతావు లేదా సూర్యరశ్మి లేని చోట ఎదుగుతావు
శరీరంలో భాగాలను కృత్రిమమైన వాటిని ఉపయోగిస్తారు
సహజమైన నడక లేక కృత్రిమంగా వాహనాలతో ప్రయాణిస్తావు
కృత్రిమమైన యంత్ర పరికరాలతో జోలపాడెదరు
ఇంటి బయట ఆవరణం లేక రక్షణ లేక ఇంటిలోనే ఆడుకునెదవు
మిత్రులు బంధువులు లేక యంత్ర పరికరాలతోనే కాలాన్ని గడిపెదవు
చదువుటలో ఎన్నో యంత్ర పరికరాలను ఉపయోగించుకునెదవు
సహజమైన జ్ఞాన గ్రహణశక్తి లేక యంత్ర బోధన విజ్ఞానాన్ని అలవాటుచేసుకునెదవు
సహజమైన ఆటలు లేక కృత్రిమమైన యంత్రాలతో ఆటలు సాగించెదవు
సజహమైన ప్రకృతి వాతావరణం లేక కాలుష్యమైన వాతావరణంలో ఎదిగెదవు
సహజ జీవన విధానం లేక కృత్రిమ జీవన విధానాలతో జీవితాన్ని సాగించెదవు
సహజమైన వృత్తులు లేక యంత్ర పరికరాలతో సాంకేతిక విజ్ఞానంతో శ్రమించెదవు
వ్యవసాయం లేక వ్యాయామం లేక జీవన విధాన పరిస్థితిని కృత్రిమంగా మార్చుకుంటూ సాగెదవు
సహజత్వం లేని జీవితం శతాబ్దం నుండి అర శతాబ్ధమౌతున్నది
సహజత్వం ఉన్నంతవరకు జీవితం దివ్యంగా దీర్గాయుస్సుతో సాగుతుంది
No comments:
Post a Comment