జన్మించు దారి ఒక్కటే మరణించు మార్గములే అనేకం
ఏ జీవికైనా జన్మించు దారి ఒక్కటే మరణించు విధానములే అనేకం అనంతం
జన్మనిచ్చు విధానం ఒక్కటే మరణించు విధానాలే అనేకం
జన్మనిచ్చే మాతృత్వం ఒకే విధానం మరణించే కాలతత్త్వం అనేక విధాలుగా ఉంటుంది
ఏ జీవికి ఏ విధంగా మరణం వస్తుందో ఎవరూ గ్రహించలేరు
ఒక్కో (ఒక) జీవికి ఒక్కో (ఒక) విధమైన మరణం కాల సమయం సంభవిస్తుంది
ఒక్కో జీవికి ఒక్కొక్క వయసుకు మరణం వస్తుంది
జన్మించే వయస్సు శూన్యంతో ఆరంభం
మరణించే వయస్సు కాల సమయంలో ఒక స్థానం [ఊహించలేని గ్రహించలేని కాల నిర్ణయం]
జన్మించు కాల సమయం శూన్యం [ఆరంభం] మరణం వయస్సుకు తెలియని నిర్ణయం
జననం మేధస్సుకు తెలియని నిర్ణయం మరణం వయస్సుకు [విజ్ఞానానికి] తెలియని నిర్ణయం
జన్మించే సమయం నీకు తెలియదు మరణించే సమయం నీకు తెలియదు
మరణాన్ని సహజంగా కలిగించుకునే విధాన విజ్ఞానం నీ మేధస్సులో ఆరోగ్యవంతంగా ఏర్పాటు చేసుకో
జీవించుటలో అతిశయ ఆర్భాటం ఆధిక్యత ఆవేశం దేహంలో ఉంచుకోవద్దు
ప్రశాంతమైన ప్రధానమైన ఆరోగ్యమైన జీవన విధాన విజ్ఞానాన్ని స్వయంకృషితో సమన్వయంతో అభివృద్ధి చేసుకో
No comments:
Post a Comment