సూర్యోదయంతో ప్రతి గృహం ఉదయిస్తున్నా మానవుల మేధస్సులలో మెలకువ కలుగట లేదే
గృహం ఉదయిస్తున్నట్లు కిటికీలు తెలుపుతున్నా మేధస్సుల ఆలోచనలలో ఉత్తేజం కలుగుట లేదే
మెలకువ లేని సూర్యోదయం కార్యాచరణకు మేధస్సులోని విజ్ఞానం సరిపోకపోవడం ఆలోచనకు సహకరించకపోవడం
సూర్యోదయాన మెలకువ లేక ఉత్తేజమైన ఆలోచన మేధస్సులో కలగక విజ్ఞాన ప్రణాళిక ఏర్పాటుతో కూడిన ఆచరణ లేక అజ్ఞానంతో నిద్రించడం
సూర్యోదయం తేజస్సుతో ప్రకాశించడం మేధస్సులో ఉత్తేజమైన మెలకువ ఆలోచనలను కలిగిస్తూ దినచర్యలను సాగించడమే
సూర్యోదయం ఉన్నంతవరకు జీవుల మేధస్సులలో మెలకువ ఆలోచన భావ తత్త్వాలు ఉత్తేజవంతాన్ని దేహస్సుకు కలిగిస్తుంటాయి
No comments:
Post a Comment