Sunday, September 29, 2024

జీవించడానికి నలుగురు ఉండాలి ఆ నాలుగు నాలుగు దిక్కులా ఉండాలి

జీవించడానికి నలుగురు ఉండాలి ఆ నాలుగు నాలుగు దిక్కులా ఉండాలి  
నలుగురు నాలుగు దిక్కులా నాలుగు పూటలు పలకరిస్తూ ఉండిపోవాలి 

నలుగురు నాలుగు వైపులా అటువైపు ఇటువైపు ముందు వైపు వెనుక వైపు కనిపిస్తూ పలకరిస్తూ ఎల్లప్పుడూ ఉండాలి 

నలుగురు కలిసిపోతే చైతన్యం నలుగురు పలకరిస్తే సంతోషం నలుగురు ఉంటే అనుబంధం 
నలుగురు నాలుగు వైపులా ఉంటే ఎంత దూరమైనా ఎక్కడైనా ప్రయాణిస్తూ జీవిస్తూ సాగిపోగలం 

నలుగురే నీ బాధ్యత ఆ నలుగురికి బాధ్యతగా నీవే ఉంటావు 
ఒకరికి ఒకరు బాధ్యతగా జీవిస్తే ఒకరి బాధ్యత నలుగురికైతే బాధ్యత సులువుగా ఉంటుంది 

ఏ కార్యమైనా నలుగురు కలిస్తే ఉత్సవం నలుగురు పలకరిస్తే మహోత్సవం నలుగురు జీవిస్తే  మహోదయం 




No comments:

Post a Comment