ఎక్కడ ఉన్నానో తెలుసుకో ఎలా ఉన్నానో తెలుపుకో
ఏం చేస్తున్నానో తలుచుకో ఏమై ఉన్నానో తపించుకో
ఎవరినో పరిశోధించుకో ఎక్కడి వాడినో పరీక్షించుకో
ఎంతటి వాడినో పలకరించుకో ఎలాంటి వాడినో ప్రయత్నించుకో
ఏనాటి వాడినో సంభాషించుకో ఎంత వరకో స్మరించుకో
ఎవరికై ఉంటానో పరామర్శించుకో ఎందరికై ఉంటానో ప్రస్తావించుకో
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment