Sunday, December 8, 2024

ఓ మహాదేవా! నీ విశ్వ స్వరూపాన్ని దర్శించుటకు ఇక నేను ప్రయాణించలేను

ఓ మహాదేవా! నీ విశ్వ స్వరూపాన్ని దర్శించుటకు ఇక నేను ప్రయాణించలేను 
మనలోని విజ్ఞాన తేజస్సుతోనే నీ దివ్య స్వరూపంతో విశ్వమంతా దర్శనమిస్తున్నది 

పరిశుద్ధమైన ప్రకృతి స్వచ్ఛమైన మానవత్వం నిర్మలమైన వాతావరణం కల్మషంలేని జీవితం అందరిలో సాగిపోతుంటే విశ్వమంతా మీ దివ్య స్వరూపంతోపరమార్థ పరమాత్మమై దర్శనమిస్తున్నది 

నాలోని విజ్ఞానాన్ని నీవే నిరంతరం సాగించేలా ప్రకృతిలో భావ తత్త్వాలను ఉద్భవించేలా సూర్యోదయ ప్రభాతమై కార్యాలను క్రమక్రమంగా సాగించవా 

అంతులేని పూర్వపర విజ్ఞానం అవధులు లేని సహృదయ అనుభవం అన్వేషించలేని ఆలోచన గమనం అందుకోలేని భావ తత్త్వాల పరమార్థం అంతం లేని అనంత అద్భుత ప్రయాణం సమయానికే తెలియని కాలాతీత ప్రభావితములు 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment