Thursday, December 26, 2024

ఇల్లు ఉంటే సరిపోదు ఇంటిని పరిశుద్ధమైన కార్యాలతో నడిపించే మానవులు ఉండాలి

ఇల్లు ఉంటే సరిపోదు ఇంటిని పరిశుద్ధమైన కార్యాలతో నడిపించే మానవుల కుటుంబం ఉండాలి 
 
దేవాలయం ఉంటే సరిపోదు దేవాలయంలోని దేవుళ్ళను పరిశుద్ధమైన న్యాయమైన నాణ్యతమైన కార్యాలతో నడిపించే భక్తులు ప్రజలు ఉండాలి 

పరిశుద్ధమైన - దేవాలయ ప్రాంగణం ఆవరణం స్వచ్ఛమైన ప్రకృతి ప్రాణవాయువుతో సూర్య కిరణాల కాంతితో నిర్మలమైన ప్రశాంతతతో దైవ భక్తి సంగీత స్మరణ నాదాలతో ఆరోగ్యవంతమైన ఉత్తేజవంతమైన ఆనకరమైన  పూజా విధానాలతో ప్రధాన ఉత్సవాలతో రక్షణ సిబ్బందితో వివిధ జాగ్రత్తలతో నిరంతరం సర్వం సమకూర్చినట్లు సంతృప్తి కరంగా సంతోష భావ తత్త్వాలతో నిశ్శబ్దతతో యోగాభ్యాస సౌకర్యాలతో అతిశయం లేనట్లు సాగుతూ ఉండాలి [భక్తులకు ప్రజలకు సమానమైన దర్శన విధానం సులభమైన విధంగా ఒక గడియలో జరిగిపోవాలి]
[ఎటువంటి కృత్రిమమైన వస్తువులను వాడకూడదు కనిపించరాదు ఆలోచింపరాదు]

న్యాయమైన - దేవాలయ ఆర్ధిక వ్యవస్థ విధానాలు క్రమ శిక్షణగా భక్తులకు ప్రజలకు జీవనోపాధి [సహజమైన వృత్తులతో] కలిగేలా ఉండాలి 

నాణ్యతమైన - పరిశుభ్రతగల ఆహార పదార్థాలు ఐదు రకాలకు మించకుండా సంతృప్తికరంగా సమకూర్చుకోవాలి సహజమైన వంట పద్ధతులతోనే ఆహారం తయారు చేయాలి [కృతిమ యంత్రములు వాడకూడదు]



[భక్తులకు ప్రజలకు దేవుళ్ళకు మేధావులకు ఎటువంటి అలవాట్లు ఉండకూడదు కనిపించరాదు ఆలోచింపరాదు]


ప్రతి కార్యము క్రమ విధమైన ప్రణాళికతో ఎటువంటి కష్ట నష్టాలతో ఇబ్బందులు లేనట్లు సులభంగా సాగిపోవాలి 

దేవాలయ ఆవరణమందు ఆకాశం భూమి కలిసేటట్లు వ్యవసాయ పంటలు ప్రకృతి శోభితత్వంతో విరాజిల్లుతూ ఉండాలి 

భగవంతుని పూజకై ఎటువంటి ఆహార పదార్థాలు [అణువైనను] వృధా కాకూడదు [ఆహార పదార్థాలను ఎక్కువ సమయం ఉంచకుండా తాజాగా ఉన్నపుడే భుజించాలి సేవించాలి ఆరోగ్య అభివృద్ధిని పెంచాలి - అనారోగ్యం తుది వయస్సు వరకు కలగనట్లు చూసుకోవాలి ]

కుటుంబమే బంధువులు - బంధువులే స్నేహితులు - స్నేహితులే సమాజం - సమాజమే ప్రజలు - ప్రజలే భక్తులు - భక్తులే దేవుళ్ళు - దేవుళ్ళే ప్రజలు - ప్రజలే కుటుంబం 

కుటుంబమే క్రమశిక్షణ సిద్ధాంత జీవన విధానం - విజ్ఞాన ఆర్గిక అభివృద్ధి - ప్రకృతి వృద్ధి విధాన సమయ పరిశోధన కాలక్షేపం - విశ్వమంతా ఆరోగ్యవంతమైన సహజమైన జీవనోపాధి విధానం - జ్ఞానంతో సాగుటకు ఉచిత సేవిక బృందం 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment