జీవించుటలో నీవు ఏ శాస్త్రీయ ప్రకృతి సిద్ధాంత విజ్ఞానాన్ని తెలుసుకున్నావో నీ మేధస్సుకు తెలిసినదా
అనంత జీవులకు ఎటువంటి జీవన విధానం కలుగుతున్నదో ఏనాడైనా ఆలోచనకు ఆర్భాటమై తోచినదా
ఎందరో మానవుల మేధస్సులలో భవిష్య విజ్ఞానం ఎంతటి పరిశుద్ధమై సహజ ప్రకృతి జీవన విధానంతో సాగుతున్నది
కలుషితం లేని పంచభూతములను ఏనాడైనా భుజించావా
కలుషితం లేని పంచభూతములను ఏనాడైనా శ్వాసించావా
కలుషితం లేని పంచభూతములను ఏనాడైనా అభివృద్ధి చేయగలిగావా
కలుషితం లేని పంచభూతములను ఏనాడైనా ప్రశాంతంగా ఆశ్వాదించావా
తరతరాల వారికి నీవు కల్పించే పంచభూతాలు పరిశుద్ధమైనవిగా సాగుతున్నాయో ఆలోచించుకో నీ వారికి తెలుపుకో నీ జీవన విధానాన్ని సహజమైన వనరుల నాణ్యతగా మార్చుకో
సహజమైన ఆరోగ్యం ప్రశాంతమైన సంలయం [నిద్ర] పరిశుద్ధమైన అభివృద్ధి నాణ్యతమైన ఆహారం విశాలమైన ప్రకృతి వాతావరణం శతాబ్దాల ఆయుస్సుగల జీవన విధానం
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment