Sunday, December 8, 2024

వ్యాపారంలో కల్తీ లేకపోయినా వివిధ విభాగాల అధికారులు ఏం చేస్తున్నారో తెలుసా

వ్యాపారంలో కల్తీ లేకపోయినా వివిధ విభాగాల అధికారులుగా ఉండేవారు సరికొత్త నిబంధనలతో క్రింది స్థాయి కార్మికులకు జీతాలను తగ్గించే విధంగా ఆలోచిస్తూ ఎన్నో విధాలుగా మోసం ద్రోహం వంచన చేస్తున్నారు 

వ్యాపార సంస్థ ప్రపంచానికే పేరు తెచ్చినా కార్మికులకు మాత్రం జీతం తగ్గించే విధానాలను నియమ నిబంధనాలను ఎందుకు సృష్టిస్తారో వారి విభాగాల ఆలోచనలను ఎవరికీ [సంచాలక పీఠము / నిర్దేశక మండలి] తెలియకుండా అమలుచేస్తున్నారు  

విభాగాల అధికారులకు ఉన్నతమైన భోగ భాగ్యాలను అనుభవించే జీతాలు వివిధ బహుమానాలు పదోన్నతి స్థానాలను కల్పించుకునే అవిధమైన నియమాలు 

కాలం సాగే కొద్దీ జీతాలు పెరగాలి కానీ కొందరి విభాగాల అధికారుల ఆలోచనల వల్ల జీతాలు తగ్గిపోతున్నాయి 
జీవితంలో ఎన్నో కోల్పోతున్నా సరైన జీతాలు లేక సరైన కుటుంబ సంబంధాలు స్నేహితులు లేక సాధారణంగానైనా జీవించలేక కనీస అవసరాలు తీరకుండానే ఆనారోగ్యంతో అందరికి భారమై కుటుంబ గౌరవం లేక మరణిస్తున్నారు 

ఏ అధికారి ఐనా క్రింద ఉన్నవారు ఎలా పనిచేస్తున్నారో తెలుసుకోవడం కంటే ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవడం ఉన్నతం ప్రదానం అవసరం ఆలోచనం సద్గుణం సాంప్రదాయం 

కార్మికులు ఎటువంటి ఇబ్బందులు తెలిపినా విభాగాల అధికారులు పదోన్నతి స్థానాల నిర్దేశక మండలికి తెలుపలేక వాటిని అలాగే కొనసాగిస్తున్నారు 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment