ఆకాశమంతా ఇంద్రధనస్సు వర్ణాల మాయా జాలమే ఓ మేఘమా!
నీవు లేని ఆకాశం నీలి వర్ణమైనను సూర్య కిరణము మహా తేజము
మేఘముల యందు సూర్య బింభముల వర్ణాలు మహా చిత్రము
కిరణాలతో కూడిన నీ మేఘములు బహు రూప అతిషయోక్తము
ఓ వైపు సూర్య తేజము మరో వైపు ఇంద్రధనస్సు ఇంకో వైపు మేఘపు జల్లులు
అద్భుతాలకు అతిశయోక్తి ఐనా ఆకాశానికి మానవ నేత్ర దృష్టి అనిర్వచనియము
వర్ణాలు ఆకాశానికి తోరణమై విశ్వానికి స్వాగతం పలుకుతున్నాయి
సువర్ణాలు ఆకాశానికి బంధాలై మేఘాలతో సన్నాయిని మ్రోగిస్తున్నాయి
జల జల కురిసే వర్షానికి గల గల మ్రోగే మేఘాలకు విశ్వం సైతం ఒకటైనది
వర్ణాలన్నీ చీకటిగా మారినా మెరిసే మెరుపులు తల తలమని మెరుస్తున్నాయి
వర్ణ భావాలు ఎలా ఉంటాయో శబ్ధ తత్వాలు కూడా వివిధ రకాలుగా ఉంటాయి
విశ్వమున ఏదైనా ఎన్నో రకాలుగా వివిధ భావ తత్వాలతో ఇమిడి ఉంటాయి
వర్ణ భావాలలో కూడా ఉత్తేజమైన మేధస్సు విజ్ఞానం విరివిగా నిక్షిప్తమై ఉంటుంది
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!