నీలోనే లీనమయ్యాను ఏడు కొండల వాస
నీలోనే ఉన్నాను తిరుమల గిరి శ్రీ శ్రీనివాస
రాయిగా ఉన్నా నేను శిలనై నీ మహా రూపాన్నే దాల్చాను
ఆకారంగా లేని నన్ను మహా దేవ దైవ రూపంగా మలిచేను
ప్రకృతిలో ఇమిడిపోయి ఉన్న నన్ను ఏడు కొండలను ఎక్కించారు
ఒంటరిగా ఉన్న నా రూపానికి అనంత నిత్య దర్శనం కలిగించారు || నీలోనే ||
గాలి వానకు తడిసే నాకు మహోన్నతమైన సువర్ణ వస్త్రాభరణములను ప్రతి రోజు ధరించెదరు
మలినము లేకున్నను నిత్యం పంచామృత పసుపు కుంకుమ సుగంధాలతో పరిశుద్ధం చేసెదరు
దిక్కులేని నాకు సృష్టికి ఓ దిక్కున ముఖ ద్వార దర్శనం కలిగించి మహా ఆలయమే నిర్మించారు
ఏమిలేని నాకు పరిశుద్ధత పరిపూర్ణత పవిత్రత భక్తి నిబద్ధత కలిగించి ఐశ్వర్యాలనే కురిపించారు || నీలోనే ||
అంగరంగ వైభోవంగా శృంగారంగా అష్ట ఐశ్వర్యాలతో సువర్ణ పల్లకిలో ఊరేగించి రథోత్సవం జరిపెదరు
నిత్యం మహా గొప్ప పూజలతో సుప్రభాతాలతో ప్రార్థన కీర్తనలతో యజ్ఞములతో బ్రహ్మోత్సవం చేసెదరు
నవరాత్రులలో నవ విధ భావ తత్వాలతో నవ రూపాలుగా నన్ను అలంకరించి మహోత్సవమే జరిపించేరు
అనంత ప్రధాత దేవతలకు శత దశ కోటి జనులకు ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ దర్శనం కలిగించేరు || నీలోనే ||