Saturday, June 29, 2019

విశ్వమే నా శ్వాసలో జీవమై జీవించునా

విశ్వమే నా శ్వాసలో జీవమై జీవించునా
జగమే నా ధ్యాసలో స్వరమై గమనించునా

వేదమే నా భాషలో జ్ఞానమై స్మరించునా
నాదమే నా వ్యాసలో గ్రంధమై పఠించునా

భావమే నా మేధస్సులో లీనమై ఆలోచించునా
తత్వమే నా దేహస్సులో లయమై అధిరోహించునా

సూర్యోదయమే నా శ్వాసను సజీవంతో విశ్వమంతా సాగిస్తున్నది
మహోదయమే నా ధ్యాసను సుజీవంతో జగమంతా సాగిస్తున్నది  || విశ్వమే ||

విశ్వమునే నా శ్వాసగా ధ్యానిస్తూ జీవిస్తున్నానుగా
జగమునే నా ధ్యాసగా స్మరిస్తూ గమనిస్తున్నానుగా

వేదమే నా భాషగా స్మరిస్తూ జ్ఞానిస్తున్నానుగా
నాదమే నా వ్యాసగా స్వరిస్తూ పఠిస్తున్నానుగా

భావమే నా ఆలోచనగా అర్థిస్తూ సంభాషిస్తున్నానుగా
తత్వమే నా యోచనగా అర్పిస్తూ సంబోధిస్తున్నానుగా  || విశ్వమే ||

విశ్వమే నాలో శ్వాసగా ప్రకృతితో ఉచ్చ్వాసించునుగా 
జగమే నాలో ధ్యాసగా ఆకృతితో ప్రశాంతించునుగా

వేదమే నాలో భాషగా జ్ఞానిస్తూ సంబోధించునుగా
నాదమే నాలో వ్యాసగా పఠిస్తూ పరిశోధించునుగా

భావమే నాలో వీక్షిస్తూ సంపూర్ణంగా సుఖించునుగా
తత్వమే నాలో దీక్షిస్తూ పరిపూర్ణంగా విశ్వాసించునుగా  || విశ్వమే ||  

ఎవరికి తెలియని భావన ఎవరి మేధస్సులో ఉందో

ఎవరికి తెలియని భావన ఎవరి మేధస్సులో ఉందో
ఎవరికి తెలియని తత్వన ఎవరి దేహస్సులో ఉందో

ఎవరికి తోచని తపన ఎవరి ఆలోచనలో ఉందో
ఎవరికి కలగని స్పందన ఎవరి సులోచనలో ఉందో

ప్రతి జీవి మేధస్సులో ఎదో తెలియని వేదన దేహస్సులో పరిశోధనమై ఉందో  || ఎవరికి ||

ఆలోచనగా తెలియని అర్థం భావనగానే మేధస్సులో మిగిలిందా
యోచనగా తెలియని అర్థం తత్వనగానే దేహస్సులో తపించిందా

సంభాషణగా తెలియని అర్థం వేదనగానే మనస్సులో వేచిందా
వివరణగా తెలియని అర్థం స్పందనగానే వయస్సులో తోచిందా  || ఎవరికి ||

గమనముగా తెలియని అర్థం ప్రకృతిగానే ఉషస్సులో కలిగిందా
స్మరణముగా తెలియని అర్థం ఆకృతిగానే ఆయుస్సులో రగిలిందా

ప్రయాణముగా తెలియని అర్థం దృశ్యంగానే తేజస్సులో ప్రకాశించిందా
ప్రవాహముగా తెలియని అర్థం చిత్రంగానే వచస్సులో ప్రజ్వలించిందా  || ఎవరికి || 

Friday, June 28, 2019

విశ్వ భావాల దైవంతో ఉదయమై అవతరిస్తాను

విశ్వ భావాల దైవంతో ఉదయమై అవతరిస్తాను
విశ్వ తత్వాల దేహంతో మరణమై అస్తమిస్తాను

సర్వ భావాల వేదంతో గమనమై జీవిస్తాను
సర్వ తత్వాల జ్ఞానంతో చలనమై జన్మిస్తాను

నిత్య భావాల కాలంతో నిలయమై ప్రయాణిస్తాను
నిత్య తత్వాల కార్యంతో నిశ్చలమై ప్రసాదిస్తాను

అమర గుణాలతో ఆకర్షితమై అనుబంధాలనే ఆచరిస్తాను  || విశ్వ ||

ఉదయించుటకే జన్మించానని కార్యాలన్నీ అద్భుతమై అధిరోహిస్తున్నాను
మరణించుటకే జీవించానని స్వరాలన్నీ అఖండమై అతిశయిస్తున్నాను

అవతరించుటకే జన్మించానని సర్వం అసాధ్యమై ఆశ్రయిస్తున్నాను
అస్తమించుటకే జీవించానని నిత్యం అసామాన్యమై ఆర్భాటిస్తున్నాను 

విశ్వంలోనే ఉదయిస్తున్నా దైవ మేధస్సులోనే ఆదేశమౌతున్నా  || విశ్వ ||

గమనించుటకే జన్మించానని భావాలే పరిశోధనమై పరిశుద్ధమౌతున్నాను
స్మరించుటకే జీవించానని తత్వాలే ప్రశాంతమై ప్రబోధమౌతున్నాను

ప్రయాణించుటకే జన్మించానని వేదాలతో ప్రతేజమై ప్రజ్వలిస్తున్నాను
విహారించుటకే జీవించానని నాదాలతో ప్రభంజనమై ప్రచారిస్తున్నాను 

విశ్వంలోనే అస్తమిస్తున్నా దేహ తేజస్సులోనే ఆచరణమౌతున్నా  || విశ్వ ||

ఎవరూ గ్రహించలేరా నా భావాల వేదాలను

ఎవరూ గ్రహించలేరా నా భావాల వేదాలను
ఎవరూ స్మరించలేరా నా తత్వాల నాదాలను

ఎవరూ పలికించలేరా నా గమన గీతాలను
ఎవరూ లిఖించలేరా నా చలన స్వరాలను

శృతించుటలో నా భావ వేద తత్వ నాదాలు సరిగమల సాహిత్యాన్ని శుద్దిస్తున్నాయి  || ఎవరూ ||

నా భావాలు పరిశోధనలోనే సాగుతూ పరిభ్రమిస్తున్నాయి
నా తత్వాలు పర్యవేక్షణలోనే సాగుతూ పరిశ్రమిస్తున్నాయి

నా గమనాలు పరిశుద్ధంలోనే ఆడుతూ పరిమితమౌతున్నాయి
నా చలనాలు పరిపూర్ణంలోనే ఆడుతూ పవిత్రమౌతున్నాయి   || ఎవరూ ||

నా వేదాలు పర్యావరణంలోనే సాగుతూ ప్రశాంతమౌతున్నాయి
నా నాదాలు ప్రపంచంలోనే సాగుతూ ప్రాచుర్యమౌతున్నాయి

నా గీతాలు పల్లవించుటలోనే ఆడుతూ ప్రౌఢత్వమౌతున్నాయి
నా రాగాలు పరితపించుటలోనే ఆడుతూ ప్రభాతమౌతున్నాయి  || ఎవరూ || 

తెలిసినా తెలియని విజ్ఞానం అజ్ఞానమై సాగేనా

తెలిసినా తెలియని విజ్ఞానం అజ్ఞానమై సాగేనా
తలచినా తెలియని వేదాంతం అనర్థమై సాగేనా

తెలిసిన దారిలో తెలియని మార్గం అపార్థమై సాగేనా
తలచిన రీతిలో తెలియని వైనం అశుభమై సాగేనా   || తెలిసినా ||

ప్రావీణ్యంతో సాగినా అజ్ఞత ప్రచండమై సాగించును
ప్రాముఖ్యంతో సాగినా అవిద్య ప్రఘాతమై ఆవహించును

విశ్వాసంతో సాగినా ఆసక్తి అఘాతమై విజృంభించును
సౌరత్యంతో సాగినా అపేక్ష అరాజకమై ఆర్భాటించును  || తెలిసినా ||

విజ్ఞానంతో సాగినా ఆనాటి విభిన్నమే స్వాగతించును
వినయంతో సాగినా ఈనాటి విచ్చికమే ఆస్వాదించును

వేదాంతంతో సాగినా ఎంతటి అనుభవమైన ప్రతిఘటించును 
విధేయతతో సాగినా ముందటి అఘోరమైన ప్రబలించును      || తెలిసినా || 

Thursday, June 20, 2019

ప్రతి జీవి తమ భాషలోని భావాలను గమనించాలి

ప్రతి జీవి తమ భాషలోని భావాలను గమనించాలి
ప్రతి జీవి తమ భాషలోని తత్వాలను తెలుసుకోవాలి

ప్రతి భాషలో తమ భావాలను సంభాషణతో వివరించాలి
ప్రతి భాషలో తమ తత్వాలను అన్వేషణతో పరిశీలించాలి

ప్రతి భాషలో ప్రతి భావాన్ని ప్రతి తత్వాన్ని అర్థంగా తెలుపుకోవాలి  || ప్రతి జీవి ||

ప్రతి భాషలో ప్రతి భావాన్ని తమ వారికి వ్యక్తపఱచాలి
ప్రతి భాషలో ప్రతి తత్వాన్ని తమ వారికి అనువదించాలి

ప్రతి భాషను సంపూర్ణంగా అర్థంగా అలవరచుకోవాలి
ప్రతి భాషను సభ్యతగా సమర్థంగా అభివృద్ధిచేసుకోవాలి  || ప్రతి జీవి ||

ప్రతి భాషలో తమ భాష ఔన్నత్యమును చాటుకోవాలి 
ప్రతి భాషలో తమ భాష అన్యోన్యతను అవలంబించుకోవాలి

ప్రతి భాషలో తమ పదాల వాక్యాల ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి
ప్రతి భాషలో తమ వాక్య సముదాయ విభాగం సంక్లిష్టంగా ఉండాలి  || ప్రతి జీవి ||

ప్రతి భాషలో సమాచార సాహిత్య విధానాన్ని సమన్వయంగా వ్యక్తపఱచాలి
ప్రతి భాషలో శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానాన్ని నిండుగా ఉపయోగించుకోవాలి 

ప్రతి భాషలో స్నేహితులను ప్రేమికులను అనుభవం చేసుకోవాలి
ప్రతి భాషలో ప్రయాణికులను యాత్రికులను అవగాహన చేసుకోవాలి  || ప్రతి జీవి || 

ప్రతి జీవి గమనంతోనే జీవిస్తుంది

ప్రతి జీవి గమనంతోనే జీవిస్తుంది
ప్రతి జీవి చలనంతోనే జీవిస్తుంది

ప్రతి జీవి సహనంతోనే జీవిస్తుంది
ప్రతి జీవి ప్రయాణంతోనే జీవిస్తుంది

ప్రతి జీవి మేధస్సులో ఆహార నియమం నిరంతరం సాగుతుంది
ప్రతి జీవి మేధస్సులో జీవన నియమం నిరంతరం సాగుతుంది   || ప్రతి జీవి ||

ఏ జీవికైనా తమ జీవన విధానం మేధస్సులోనే నిర్మితమై సాగుతుంది
ఏ జీవికైనా తమ జీవిత ధర్మం మేధస్సులోనే ఆద్యంతమై సాగుతుంది

ఏ జీవికైనా తమ ఆచార వ్యవహారం మేధస్సులోనే అన్వేషణగా సాగుతుంది
ఏ జీవికైనా తమ విహార వ్యవహారం మేధస్సులోనే పర్యవేక్షణగా సాగుతుంది   || ప్రతి జీవి ||

ఏ జీవికైనా తమ జీవ కార్యం రూపంతోనే సాగుతుంది
ఏ జీవికైనా తమ జీవ లోపం ఆకారంతోనే సాగుతుంది

ఏ జీవికైనా తమ జీవ గమనం శ్వాసతోనే సహనమై సాగుతుంది
ఏ జీవికైనా తమ జీవ చలనం ధ్యాసతోనే ప్రయాణమై సాగుతుంది   || ప్రతి జీవి || 

Tuesday, June 18, 2019

మేధస్సులోనే సర్వం వీక్షించావా మేధస్సులోనే నిత్యం వలచావా

మేధస్సులోనే సర్వం వీక్షించావా మేధస్సులోనే నిత్యం వలచావా
మేధస్సులోనే శాంతం కొలిచావా మేధస్సులోనే కాంతం ధరించావా
మేధస్సులోనే మోహం సహించావా మేధస్సులోనే లోపం తలచావా  || మేధస్సులోనే ||

మరచిపోయే మేధస్సు జీవులకే మననమై సాగేనా
అలసిపోయే మేధస్సు జీవులకే నిలయమై సాగేనా

నిష్ఫలమైపోయే మేధస్సు జీవులకే చలనమై సాగేనా
చులకనైపోయే మేధస్సు జీవులకే ప్రయాణమై సాగేనా  || మేధస్సులోనే ||

లీనమైపోయే మేధస్సు జీవులకే కారణమై సాగేనా
దీనమైపోయే మేధస్సు జీవులకే ధారణమై సాగేనా

సాగిపోయే మేధస్సు జీవులకే సహనమై సాగేనా
ఎదిగిపోయే మేధస్సు జీవులకే సహకారమై సాగేనా  || మేధస్సులోనే || 

మరిచావా మహా మంత్రాన్ని నీ మేధస్సులో

మరిచావా మహా మంత్రాన్ని నీ మేధస్సులో
తలిచావా మహా మంత్రాన్ని నీ ఆలోచనలో

గమనించావా మహా మంత్రాన్ని నీ దేహంలో
స్మరించావా మహా మంత్రాన్ని నీ యోగంలో

మంత్రమే మర్మమై చేరిందా నీ శ్వాసలో
మంత్రమే తంత్రమై మారిందా నీ ధ్యాసలో  || మరిచావా ||

దేహంలోనే దాగున్నదా మహా యంత్ర మంత్రం
రూపంలోనే దాగున్నదా మహా తంత్ర మంత్రం

జీవంలోనే దాగున్నదా మహా మేధస్సు మర్మం
జ్ఞానంలోనే దాగున్నదా మహా మనస్సు మర్మం  || మరిచావా ||

వేదంలోని దాగున్నదా మహా వయస్సు తంత్రం
నాదంలోనే దాగున్నదా మహా ఉషస్సు తంత్రం

నిత్యంలోనే దాగున్నదా మహా దేహస్సు యంత్రం
సర్వంలోనే దాగున్నదా మహా ఆయుస్సు యంత్రం  || మరిచావా || 

Monday, June 17, 2019

నీ ప్రయాణాలే ఒక యోగమని నీ దేహానికి తెలుపవా

నీ ప్రయాణాలే ఒక యోగమని నీ దేహానికి తెలుపవా
నీ ఉచ్చ్వాసాలే ఒక భోగమని నీ ఆలోచనకు తెలుపవా

నీ శ్వాస గమనమే మహా యోగమని నీ దేహానికి తెలుపవా
నీ ధ్యాస చలనమే మహా భోగమని నీ ఆలోచనకు తెలుపవా 

జీవితమే ఒక యోగ భోగ ప్రయాణమని ప్రతి జీవికి నీవే తెలుపవా  || నీ ప్రయాణమే ||

జీవించుటలో ప్రయాణం ఒక యోగ ధ్యాన సిద్ధియే
శ్వాసించుటలో చలనం ఒక భోగ ధ్యాస ప్రసిద్ధియే

ఆలోచించుటలో దేహం ఒక మహా యోగ సామర్థ్యమే
ధ్యానించుటలో జీవం ఒక మహా భోగ సంభూతయమే  || నీ ప్రయాణమే ||

ప్రయాణించుటలో నీ జీవం ఒక యోగ భావ ప్రశాంతమే
తిలకించుటలో నీ రూపం ఒక భోగ తత్వ పరివర్తనమే

దర్శించుటలో నీ దేహం ఒక మహా ధ్యాన దైవ పరిశుద్ధమే
ఆశ్రయించుటలో నీ వేదం ఒక మహా ధ్యాస దివ్య ప్రజ్ఞానమే  || నీ ప్రయాణమే ||  

ఏనాడు లిఖించెదరో నా భావాలను అనేక భాషలలో

ఏనాడు లిఖించెదరో నా భావాలను అనేక భాషలలో
ఏనాడు వర్ణించెదరో నా తత్వాలను అనేక వాక్యాలలో

ఎవరు లిఖించెదరో నా వేదములను అనేక ప్రాంతాలలో
ఎవరు వర్ణించెదరో నా జ్ఞానములను అనేక పాఠములలో   || ఏనాడు ||

భావనయే తెలియని నాడు తెలియును భాష ప్రభావ తేజము
తత్వనయే తోచని నాడు తెలియును భాష ప్రబోధ కాంతము

వేదమే తెలియని నేడు తెలిపేను భాషే ఖ్యాతి ప్రాధాన్యము
జ్ఞానమే తెలియని నేడు తెలిపేను భాషే కీర్తి ప్రాముఖ్యము  || ఏనాడు ||

జీవమే తెలియని నాడు తెలిపేను భాష బంధాల ప్రయోజనము
రూపమే తెలియని నాడు తెలిపేను భాష స్వరాల ప్రతియత్నము

సర్వమే తెలియని నాడు తెలిపేను భాషే విశ్వ అనంతము
నిత్యమే తెలియని నాడు తెలిపేను భాషే లోక ఆద్యంతము  || ఏనాడు || 

విశ్వమే నీవని వేదమే తెలిపెను

విశ్వమే నీవని వేదమే తెలిపెను
జగమే నీవని జ్ఞానమే తెలిపెను

వేదమే నీవని కాలమే తెలిపెను
జ్ఞానమే నీవని మోహమే తెలిపెను

సర్వం నీవని భావమే తెలిపెను
నిత్యం నీవని తత్వమే తెలిపెను

భావమే నీవని బంధమే తెలిపెను
తత్వమే నీవని జీవమే తెలిపెను

మనస్సే నీవని శ్వాసే తెలిపెను
వయస్సే నీవని ధ్యాసే తెలిపెను

శ్వాసే నీవని యోగమే తెలిపెను
ధ్యాసే నీవని భోగమే తెలిపెను

గమనమే నీవని దేహమే తెలిపెను
చలనమే నీవని దైవమే తెలిపెను

దేహమే నీవని ప్రకృతి తెలిపెను
దైవమే నీవని జాగృతి తెలిపెను 

విశ్వము చేసే ఆలోచనలో ప్రకృతి ప్రక్రియ పరమార్థము తెలిపేను

విశ్వము చేసే ఆలోచనలో ప్రకృతి ప్రక్రియ పరమార్థము తెలిపేను
జగము చేసే యోచనలో జీవతి ప్రక్రియ పరిశోద్దార్థనము తెలిపేను

ప్రకృతి ప్రక్రియ జీవ పదార్థముచే సాగే సూక్ష్మ క్రియ కార్యముల విశ్వ జ్ఞాన పరిశోధనమే
విశ్వతి ప్రక్రియ అణు పరమాణుచే సాగే అర్థ క్రియ కార్యముల వేద విజ్ఞాన పర్యవేక్షణమే  || విశ్వము ||

విశ్వములో రూపాలన్ని కాల ప్రభావముచే ఎదిగిన ప్రకృతి జీవములే
జగములో ఆకారాలన్నీ కాల సమయముచే మారిన ప్రకృతి జీవములే

ప్రకృతి విశ్వతి జగతికి రూపతినిచ్చిన ఆకృతి భావాల ఆవరణమే
జగతి జాగృతి ప్రకృతికి ఆకృతినిచ్చిన జీవతి తత్వాల పరిణామమే  || విశ్వము ||

విశ్వములో అనంతమై ఎదిగిన రూపాలన్నీ అణువుల ఆకారాల అర్థాంశమే
జగములో నిత్యమై ఒదిగిన ఆకారాలన్నీ పరమాణువుల రూపాల దివ్యాంశమే

ప్రకృతి ప్రక్రియ విశ్వ పదార్థముల జీవ పరిణామ పరమార్థమే
విశ్వతి ప్రక్రియ జీవ పదార్థముల జన్యు పర్యావరణ పరమాత్మమే  || విశ్వము ||

Sunday, June 9, 2019

ఆలోచనలో యోచన ఉందా మేధస్సులో మర్మం ఉందా

ఆలోచనలో యోచన ఉందా మేధస్సులో మర్మం ఉందా
యంత్రములో తంత్రం ఉందా దేహములో దైవం ఉందా

విజ్ఞానములో పరమార్థం ఉందా అణువులో పరమాణువు ఉందా
అనుభవములో అఖిలం ఉందా ఆత్మములో పరమాత్మం ఉందా

జీవించుటకు జీవనం ఉన్నట్లు ఉదయించుటకు ఉద్దేశం ఉందా
మరణించుటకు కారణం ఉన్నట్లు జన్మించుటకు జాప్యం ఉందా   || ఆలోచనలో || 

విశ్వమా నీవు అజ్ఞానాన్ని కలిగిస్తున్నావు

విశ్వమా నీవు అజ్ఞానాన్ని కలిగిస్తున్నావు
కాలమా నీవు అనర్థాన్ని సాగిస్తున్నావు

మేధస్సును నీవే అజాగ్రత్త పరుస్తున్నావు
మనస్సును నీవే అప్రమత్తం చేస్తున్నావు

జీవితాలను అనారోగ్యంతో సాగిస్తూనే ఆయుస్సును తరిగిస్తున్నావు  || విశ్వమా ||

ఆలోచనలకు తీరిక లేక దేహాలకు విశ్రాంతి లేక
బంధాలకు స్వేచ్ఛ లేక రూపాలకు విలువ లేక

స్నేహాలకు విజ్ఞానం లేక ప్రేమాలకు అనుభవం లేక
జీవితాలకు విలాసము లేక జీవనాలకు అభివృద్ధి లేక

దినచర్య కార్యాలు దశ దిశల అపార్థమై సంకలనమగును  || విశ్వమా ||

వేదాలకు వచనం లేక జీవులకు నియంత్రణ లేక
భావాలకు నియమం లేక తత్వాలకు సహనం లేక

జ్ఞానులకు ఆధారం లేక మానవులకు నిజాయితి లేక
స్వరూపాలకు ఐక్యత లేక ఆకారాలకు అనుమతి లేక

దినచర్య కార్యాలు దశ దిశల అపార్థమై సంకలనమగును  || విశ్వమా || 

Friday, June 7, 2019

కవి బ్రంహ మేధస్సులో విశ్వ నాడుల కదలికల బ్రంహ జ్ఞానము

కవి బ్రంహ మేధస్సులో విశ్వ నాడుల కదలికల బ్రంహ జ్ఞానము
కవి బ్రంహ మేధస్సులో జీవ నాడుల పరంపరల వేద విజ్ఞానము
కవి బ్రంహ యోచనలో మర్మ త్రయముల కర్త కర్మ క్రియాంశము
కవి బ్రంహ యోచనలో త్రికరణముల దేహాంతర త్రిగుణాంశము

ఏనాటి కవి బ్రంహ ఏనాటి కవి రాజ ఏనాటి కవి కీర్తి భ్రమణము
ఏనాటి  కవి పూర్ణ ఏనాటి కవి చంద్ర ఏనాటి కవి కాంస్య చరణము 
ఏనాటి కవి చక్ర ఏనాటి కవి శర్మ ఏనాటి కవి స్ఫూర్తి స్పందనము 
ఏనాటి కవి బాహు ఏనాటి కవి జాణ ఏనాటి కవి దారి దర్పణము 

Sunday, June 2, 2019

ఓ మహా దేవా! నీవైనా అజ్ఞానాన్ని కలిగించవా

ఓ మహా దేవా! నీవైనా అజ్ఞానాన్ని కలిగించవా
ఓ ప్రభు దేవా! నీవైనా అనర్థాన్ని నడిపించవా
ఓ గురు దేవా! నీవైనా అనిష్టము చూపించవా
ఓ జయ దేవా! నీవైనా అర్ధాంతము చేకూర్చవా

విజయమే లేని నా విజ్ఞానము నాకు నిత్యం నిష్ప్రయోజనమే
సంతోషమే లేని నా వేదాంతము నాకు సర్వం నిరర్థకారణమే   || ఓ మహా దేవా! ||

అజ్ఞానం అఖండమై కార్యములన్నియు అపజయంతో సాగిపోతున్నాయి
అనర్థం అమోఘమై కార్యములన్నియు అపార్థంతో జరిగిపోతున్నాయి
అనిష్టం అభిన్నమై కార్యములన్నియు అస్వస్థతతో వెళ్ళిపోతున్నాయి
అర్ధాంతం అమరమై కార్యములన్నియు అజాగ్రతతో చెదిరిపోతున్నాయి

విజయం కలిగే వరకు నా కార్యములు సప్త సముద్రాలతో పోరాడుతుంటాయి  || ఓ మహా దేవా! ||

అజ్ఞానం అనివార్యమై కార్యములన్నియు అధ్యాయంతో సాగిపోతున్నాయి
అనర్థం అనంతమై కార్యములన్నియు అన్వేషణతో జరిగిపోతున్నాయి
అనిష్టం అపారమై కార్యములన్నియు అప్రమత్తతతో వెళ్ళిపోతున్నాయి 
అర్ధాంతం ఆద్యంతమై కార్యములన్నియు అవిశ్వాసంతో చెదిరిపోతున్నాయి 

మరణం కలిగే వరకు నా కార్యములు విశ్వ వేదాలతో లిఖింపబడుతుంటాయి  || ఓ మహా దేవా! ||