Monday, September 30, 2024

జరిగిపోయిన కార్యాలన్నీ శూన్యం జరగబోయే కార్యాలే అనంతం

జరిగిపోయిన కార్యాలన్నీ శూన్యం జరగబోయే కార్యాలే అనంతం 

జరిగిపోయిన కార్యాలను మార్చలేము జరగబోయే కార్యాలను ఎలా చేయాలో ఆలోచిస్తూ సాగగలం 
రాబోయే సమస్యలు కార్యాలు ఎలా ఉంటాయో తెలియకపోయినా విజ్ఞానంగా ఆలోచిస్తూ చేయగలం 

ప్రజ్ఞానంతో విజ్ఞాన ప్రణాళికతో పరిశుద్ధమైన భావాలతో ప్రకృతి తత్త్వాలతో కార్యాలను సాగించగలం 
 

Sunday, September 29, 2024

రేపటి కోసం జీవించాలి మరో క్షణం కోసం జీవిస్తూ సాగాలి

రేపటి కోసం జీవించాలి మరో క్షణం కోసం జీవిస్తూ సాగాలి 
మన వారంతా రేపటి కోసం విజ్ఞానంతో జీవిస్తూ  ముందుకు సాగాలి 

రేపటి తరం ప్రకృతి పరిశుద్ధతతో అభివృద్ధితో ప్రతి జీవికి మార్గదర్శంగా ముందుకు సాగాలి 

సుదీర్ఘంగా జీవించే విజ్ఞాన మేధాశక్తి ప్రతి మానవునికి ప్రతి జీవికి అవసరం

సుదీర్ఘంగా జీవించే విజ్ఞాన మేధాశక్తి ప్రతి మానవునికి ప్రతి జీవికి అవసరం  

విజ్ఞాన మేధాశక్తితో ఆరోగ్యముగా జీవిస్తూ ఎంతో కాలంగా ఎందరితో సాగిపోవచ్చు 
ఆరోగ్యవంతమైన మేధాశక్తితో ఎంతో అనుభవంతో ఎంతో అభివృద్ధిని సాధించవచ్చు 

జీవించడానికి నలుగురు ఉండాలి ఆ నాలుగు నాలుగు దిక్కులా ఉండాలి

జీవించడానికి నలుగురు ఉండాలి ఆ నాలుగు నాలుగు దిక్కులా ఉండాలి  
నలుగురు నాలుగు దిక్కులా నాలుగు పూటలు పలకరిస్తూ ఉండిపోవాలి 

నలుగురు నాలుగు వైపులా అటువైపు ఇటువైపు ముందు వైపు వెనుక వైపు కనిపిస్తూ పలకరిస్తూ ఎల్లప్పుడూ ఉండాలి 

నలుగురు కలిసిపోతే చైతన్యం నలుగురు పలకరిస్తే సంతోషం నలుగురు ఉంటే అనుబంధం 
నలుగురు నాలుగు వైపులా ఉంటే ఎంత దూరమైనా ఎక్కడైనా ప్రయాణిస్తూ జీవిస్తూ సాగిపోగలం 

నలుగురే నీ బాధ్యత ఆ నలుగురికి బాధ్యతగా నీవే ఉంటావు 
ఒకరికి ఒకరు బాధ్యతగా జీవిస్తే ఒకరి బాధ్యత నలుగురికైతే బాధ్యత సులువుగా ఉంటుంది 

ఏ కార్యమైనా నలుగురు కలిస్తే ఉత్సవం నలుగురు పలకరిస్తే మహోత్సవం నలుగురు జీవిస్తే  మహోదయం 




Saturday, September 28, 2024

మనిషిని మార్చేది సమయమా శ్రమయమా మనిషిని మార్చేది సందర్భమా సంకల్పమా

మనిషిని మార్చేది సమయమా శ్రమయమా మనిషిని మార్చేది సందర్భమా సంకల్పమా 

మరణాన్ని మార్చే భావాలేవి మరణాన్ని మార్చే తత్త్వాలేవి

మరణాన్ని మార్చే భావాలేవి మరణాన్ని మార్చే తత్త్వాలేవి 

మరణం లేని భావాలు మనిషిని సుఖంగా సుధీర్ఘంగా సాగించలేవా 
మరణం లేని తత్త్వాలు మనిషిని సౌఖ్యంగా సుకాలంగా సాగించలేవా 
 

మరణాన్ని ఆపేదెవరు మనిషిని మార్చేదెవరు మరణాన్ని నిలిపేదెవరు మనిషిని తీర్చేదెవరు

మరణాన్ని ఆపేదెవరు మనిషిని మార్చేదెవరు మరణాన్ని నిలిపేదెవరు మనిషిని తీర్చేదెవరు 

ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చి ఎంత వరకు జీవిస్తూ ఎక్కడ నుండి ఎక్కడికి ఎప్పుడు వెళ్తామో కాలానికే తెలుసు

ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చి ఎంత వరకు జీవిస్తూ ఎక్కడ నుండి ఎక్కడికి ఎప్పుడు వెళ్తామో కాలానికే తెలుసు 

పూజించుటలో ఏమి భావమో ప్రార్థించుటలో ఏమి తత్త్వమో జీవించుటలో ఆలోచనకే మహా భాగ్యమో

పూజించుటలో ఏమి భావమో ప్రార్థించుటలో ఏమి తత్త్వమో జీవించుటలో ఆలోచనకే మహా భాగ్యమో 
శ్వాసించుటలో ఏమి భావమో ధ్యానించుటలో ఏమి తత్త్వమో స్మరించుటలో సులోచనకే మహా యోగ్యమో  

ఏ రూపం ఎంత వరకు ఏ జీవం ఎంత కాలం ఉంటుందో

ఏ రూపం ఎంత వరకు ఏ జీవం ఎంత కాలం ఉంటుందో  

ప్రతి క్షణం తెలుపుతున్నది మరో క్షణంకై జీవించు రేపటిని తిలకించు విజ్ఞానంతో అందరిని సాగించు

ప్రతి క్షణం తెలుపుతున్నది మరో క్షణంకై జీవించు రేపటిని తిలకించు విజ్ఞానంతో అందరిని సాగించు 
ప్రతి క్షణం మరో క్షణాన్ని ఉదయింపజేస్తూ తెలుపుతున్నది సంతోషంగా రేపటి కోసం ఉన్నతంగా జీవించు   

ప్రతి క్షణం తెలుపుతున్నది మరో క్షణంకై ఆది కాలం నుండి జన్మిస్తూ జన్మనిస్తూ ఉదయిస్తూ సాగుతూనే ఉన్నా 
తొలి క్షణమై ఒక క్షణమై మరో క్షణంమై క్షణాలుగా సాగుతూనే సమయంతో కాలమై విశ్వంతో ప్రయాణిస్తూనే ఉన్నా 

ఒక క్షణంలోనే ఆలోచించా మరో క్షణం కావాలని ఆ క్షణం మరో క్షణాన్ని సృష్టించాలని అలాగే క్షణాలతో సాగిపోవాలని 
తొలి క్షణంతోనే ఎన్నో ఆలోచించా ఎంతో సమయంతో ఎంతో కాలాన్ని సాగిస్తూ ఎన్నింటినో సృష్టిస్తూ అలాగే సాగిపోవాలని 

Friday, September 27, 2024

చూర్ణంలో ఎన్ని అణువులు ఉన్నా ప్రతి పరమాణువులో పరమార్థం పరమాత్మం ఉంటుంది

 చూర్ణంలో ఎన్ని అణువులు ఉన్నా ప్రతి పరమాణువులో పరమార్థం పరమాత్మం ఉంటుంది 

ప్రతి అణువులో ప్రతి బిందువులో ప్రతి ఖాళీలో పరమార్థం పరమాత్మం ఉంటుంది

ప్రతి అణువులో ప్రతి బిందువులో ప్రతి ఖాళీలో పరమార్థం పరమాత్మం ఉంటుంది  

ప్రతి కార్య ప్రక్రియ విజ్ఞాన ఫలితంగా ఉండాలి లేదంటే జీవనం అస్తవ్యస్తంగా సాగుతుంది

ప్రతి కార్య ప్రక్రియ విజ్ఞాన ఫలితంగా ఉండాలి లేదంటే జీవనం అస్తవ్యస్తంగా సాగుతుంది  

మానవుడు పరిచయాలతో సంభాషణలతో విజ్ఞాన కార్యాలతో జీవించాలి లేదంటే జీవితం జీవనం విషాదకరం

మానవుడు పరిచయాలతో సంభాషణలతో విజ్ఞాన కార్యాలతో జీవించాలి లేదంటే జీవితం జీవనం విషాదకరం 

ఆహారం ఆరోగ్యంతో పాటు ప్రతి జీవికి విజ్ఞానం క్రమశిక్షణ చాలా అవసరం ప్రధానం పరమార్థం

ఆహారం ఆరోగ్యంతో పాటు ప్రతి జీవికి విజ్ఞానం క్రమశిక్షణ చాలా అవసరం ప్రధానం పరమార్థం  

అజ్ఞానం నుండే విజ్ఞానం కలుగుతుంది విజ్ఞానమే అజ్ఞానాన్ని తెలుపుతుంది

అజ్ఞానం నుండే విజ్ఞానం కలుగుతుంది విజ్ఞానమే అజ్ఞానాన్ని తెలుపుతుంది 
ఆటంకం లేకుండా సాగే కార్యమే లాభమే సుఖమే విజ్ఞానాన్ని తెలుపుతుంది 
ఆటంకంతో కలిగే దుఃఖమే నష్టమే విచారమే అజ్ఞానమని తెలుపుతుంది  

Wednesday, September 25, 2024

Don't waste anything, nature created only one time - Everything gives by nature only

Don't waste anything, nature created only one time - Everything gives by nature only

Every artificial things comes with nature only. Man will make/creates artificial things from nature/natural resources.

Man is having knowledge on creating artificial things and destroy more natural resources.
Whatever man thinks he will understand and found the solution to create.

Don't waste valuable things. Example: Minerals, Granite, Furniture, Gold, Diamond, etc.
Everything is valuable and need to take care and use it more than one crore years.

If we waste more or we can use it in wrong direction, the things/products cost will increase very high.
Waste is more means, demand will be high and manufacturing/production will be high [cost will be increase].

Poor people can't be able to purchase/use it because of high cost.

Protect the nature, grow the nature of green. It will survive uncountable (infinity) years with healthy environment.

Nature is not only of human beings, it is for all living beings and living creatures.

More explanation is required to understand nature of life and its purpose and goal.

Tuesday, September 24, 2024

సమాజంలో జీవిస్తే సరిపోదు మనం జీవించే విధానం సమాజానికి ముఖ్య అవసరంగా విజ్ఞానంగా పరిశుద్ధంగా ప్రణాళికంగా క్రమబద్ధంగా ధీర్ఘ భవిష్యత్కు ప్రయోజనంగా ఉండాలి

సమాజంలో జీవిస్తే సరిపోదు మనం జీవించే విధానం సమాజానికి ముఖ్య అవసరంగా విజ్ఞానంగా పరిశుద్ధంగా ప్రణాళికంగా క్రమబద్ధంగా ధీర్ఘ భవిష్యత్కు  ప్రయోజనంగా ఉండాలి 

మనం లేకున్నా మన వాళ్ళు ఎటువంటి సమస్యలు లేకుండా జీవనోపాధికై అభివృద్ధితో శ్రమించే విధంగా ఉండాలి 

రేపటి తరానికి కాలానికీ  ఎటువంటి సమస్యలు వచ్చినా అందరికి అనుగుణమైన సమాధానం పరిష్కారం ఇవ్వగలగాలి ఎంతో కాలానికి ప్రయోజనంగా దృఢంగా ఉండాలి 

సమస్యలు [కలుషితం, అజ్ఞానం, అపరిశుభ్రం, వృధా ఆహారం, అనర్థం, అనారోగ్యం, మోసగించడం, వ్యసనం,  అరాచకం, అక్రమం, అసమానత్వం, అనవసరం, దౌర్జన్యం, కాల వైపరీత్యాలు మొదలైనవి] 

సమస్యలు:
మురుగు నీరు కాలువలు పారే విధానం సరిగా లేకపోవడం 
వర్షపు నీరు రహదారులపై నిలవడం మరియు ఇంట్లోకి రావడం 
ఇండ్లను సరైన విధంగా నాణ్యతగా సరైన చోట కట్టుకోక పోవడం  
రహదారులను సరైన వెడల్పుతో నిటారుగా నిర్మించలేకపోవడం  
వాగులు వంకలు వంతెనలు సరిగా లేకపోవడం 
చెరువులు, వర్షం నీరు పారే కాలువలు సరిగా లేకపోవడం 
వరదలకు జీవన స్థితి సరిలేకపోవడం ప్రయాణానికి ఆటంకాలు ఇబ్బందులు ఏర్పడటం 
ప్రాణ నష్టాలు జీవ నష్టాలు కలగడం 
శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం 
జీతభత్యాలు సరిగా లేకపోవడం 
వస్తువుల ఖరీదులను సామాన్యులు కొనలేని విధంగా పెంచడం 
ఇంట్లో సంపాదించేవారు లేకపోవడం, సంపాదించినా సరిపోక పోవడం, వృధా చేయడం 
రక్షణ లేకపోవడం 
సహాయం చేసేవారు లేకపోవడం 
సలహాలు ఇచ్చేవారు లేకపోవడం 
జాగ్రత్తలు వహించలేక పోవడం 
వృధాగా వస్తువులను నాశనం చేయడం 
సరైన వస్తువులను సరైన చోట సరైన విధంగా ఉంచలేకపోవడం వాడుకోలేకపోవడం 
సమస్యలకు పరిష్కారాన్ని సంబాషించలేక పోవడం అన్వేషించలేక పోవడం 
ఆర్థిక లోటు సమస్య విజ్ఞానం లేని సమస్యలు కలగటం 
చెట్లు లేక పోవడం, సరైన ప్రకృతి, వృక్ష సంపద లేక పోవడం సహజమైన ప్రాణవాయువు లేకపోవడం 
సరైన భూమిలో పంటలు పండించకపోవడం, భూములను పంటలకు వాడకుండా ఖాళీగా ఉంచడం   
సారవంతమైన భూములకు గృహాల నిర్మాణంగా మార్చడం ఎత్తైన భవనాలను కట్టడం 
విలాసవంతమైన వస్తువులను తయారుచేయడం 
వ్యవసాయం సరైనరీతిలో సహజమైన పద్ధతిలో చేయక పంటలను సరైన విధంగా పండించకపోవడం 
కృత్రిమమైన వాటికి అలవాటు పడటం ఆహార తయారీ విధానాలు మారడం 
సాంకేతిక పరికరాలకు విజ్ఞానానికి అలవాటుపడటం బానిసగా మారడం 
-- ఇంకా ఎన్నో మొదలైనవి ఎన్నో ఉన్నాయి 

ఏ వస్తువును సృష్టించినా తయారుచేసినా కొన్ని వేల సంవత్సరాలకు ఉపయోగపడటం జాగ్రత్తగా వాడుకోవడం 




Sunday, September 22, 2024

శ్రమించడంలోనే భగవంతునిపై జ్ఞాపకం కలుగుతుంది

శ్రమించడంలోనే భగవంతునిపై [ఎక్కువగా] జ్ఞాపకం కలుగుతుంది 
సుఖించడంలో భగవంతునిపై [తక్కువగా] జ్ఞాపకం కలుగకపోవచ్చు 

Saturday, September 21, 2024

Don't waste Granite, nature created once

Don't waste Granite, nature created once with more years of energy and its more valuable in all directions.
People don't know the value and how it will use it and where it needs to use it.

Explanation is more and understanding of nature is not in the human brain (Universal Spiritual Brain or Mind thinking power is required) ...

స్వర్గానికి దారి ఏది మాధవా తెలుపవా ఒక సారి ఎలా వెళ్ళాలో

స్వర్గానికి దారి ఏది మాధవా తెలుపవా ఒక సారి ఎలా వెళ్ళాలో 
స్వర్గానికి దారి ఏది మహాత్మా చూపవా ఒక సారి ఎలా వెళ్ళాలో

నీవు వచ్చిన మార్గమున తిరిగి ప్రయాణిస్తే నీవు పొందే అనుభవాలను పూర్తిగా అనుభవిస్తే స్వర్గమే నీవెంట చేరును 
తెలిసిందిలే మహాదేవా నా జీవిత కాలం సంపూర్ణమైతేనే నా కర్తవ్యములను నేరవేరిస్తే ప్రశాంతతో సర్గాన్ని చూసేదను  

Friday, September 20, 2024

మిత్రమా బంధమా మానవా అందరికి తల్లితండ్రులకు నా కృతజ్ఞతలు

మిత్రమా బంధమా మానవా అందరికి తల్లితండ్రులకు నా కృతజ్ఞతలు 
మీరు చేసిన సహాయానికి నా ఎదుగుదలకు నా మార్గ ప్రయాణానికి సహకరించిన వారికి నా కృతఙ్ఞతలు 
ప్రకృతి ప్రభావాల పరిస్థితులకు నా కృతఙ్ఞతలు 

ఆకారం ఉంటే సరిపోదు కాస్త సహకారం మమకారం ఉండాలి

 ఆకారం ఉంటే సరిపోదు కాస్త సహకారం మమకారం ఉండాలి 

భక్తి ఎక్కడున్నది దేవా ముక్తి లేనిచో తెలుస్తున్నదిగా మానవా

భక్తి ఎక్కడున్నది దేవా ముక్తి లేనిచో తెలుస్తున్నదిగా మానవా 

కాలం అనంతమైన సమయమే నీ జీవిత వ్యవధి పరిధి పరిమితి

కాలం అనంతమైన సమయమే నీ జీవిత వ్యవధి పరిధి పరిమితి 
నీ జీవిత కాలంలో నీవు ఎలా జీవించాలో నీ పరిస్థితులే తెలుపుతాయి 
నీ పరిస్థితులను మార్చుకుంటూ సమస్యలను పరిష్కారించుకుంటూ అభివృద్ధి చెందాలి 
ఆరోగ్యాంగా జీవిస్తూ జాగ్రత వహిస్తూ విజ్ఞానంతో సాధన స్వయంకృషితో ఎన్నో విజయాలను సాధించాలి 
నీ కోసం జీవిస్తూ అందరికోసం ప్రకృతి క్షేమం కోసం సర్వజీవుల విజ్ఞాన ఆరోగ్య అభివృధ్ధి కోసం  జీవించాలి 

ఆభరణాలను అందంగా అలంకరించుకోవచ్చు ఆహారాన్ని ఆరోగ్యాంగా అలవర్చుకోవచ్చు

ఆభరణాలను అందంగా అలంకరించుకోవచ్చు ఆహారాన్ని ఆరోగ్యాంగా అలవర్చుకోవచ్చు 
ఆభరణాల ద్వారా ఆరోగ్యం తగ్గకూడదు ఆహారం కన్నా ఆభరణాలను అధికంగా పెంచుకోకూడదు 

ఆరోగ్యాంగా ఆనందంగా ఉంటే ఆభరణాలు అవసరం లేదు 
ఆభరణాలతో అందం కన్నా సమస్యలే ఎక్కువ 

ఆభరణం శరీరానికి అవసరంగా ఉండాలి సాధారణంగా సామాన్యంగా కనిపించాలి 
ఆభరణం రక్షణ కోరే విధంగా ఉండకూడదు మరొకరి సహాయం కోరే విధంగా ఉండకూడదు 

ఆభరణాలను రూపానికి ఆకారానికి కనిపిస్తూ కనిపించనట్లు ధరించాలి 
ఆభరణాలు ఎక్కువ విలువైనవిగా మెరిసేలా ఉండకూడదు 

అవతారానికి ఆకార రూపానికి తగ్గట్టుగా వస్త్రాభరణాన్ని అలంకరించుకోవాలి 
ఆహార నియమ విధానంతో కూడా ఆకార రూపాన్ని మహానందంగా మార్చుకోవచ్చు 

విత్తనం వజ్రం కన్నా గొప్పది - చెట్టు సువర్ణం కన్నా విలువైనది

విత్తనం వజ్రం కన్నా గొప్పది  - చెట్టు సువర్ణం కన్నా విలువైనది 

విత్తనాన్ని నాటి పెంచితే మరెన్నో విత్తనాలు ఉద్భవిస్తాయి 
ఒక్కొక్క చెట్టు ఎన్నో పూలను గాని ఎన్నో పండ్లను గాని ఎన్నో కాయలను గాని ఎన్నో ఔషధాలను గాని తరతరాలుగా ఇస్తూనే వస్తాయి జీవిస్తాయి జీవులను ప్రాణవాయువుతో జీవింపజేస్తాయి అధిక పోషణాల ఆహారాన్ని అందిస్తాయి 

చెట్ల నుండి వచ్చే వాటివల్ల జీవుల మేధస్సులను ఉత్తేజం చేస్తూ జీవన విధానాల కార్యాలకు ఉపయోగపడుతాయి 
జీవుల శక్తి సామర్థ్యాలను పెంచుతాయి 

నాణ్యతగల ప్రతి విత్తనాన్ని పెంచుకుంటూ పోతే ప్రతి పండు ఉచితంగా లభిస్తుంది ఆరోగ్యాంగా శతాబ్దాలుగా జీవించవచ్చు 

Thursday, September 19, 2024

జన్మించుటలో సహజత్వం లేదు జీవించుటలో సహజత్వం లేదు మరణించుటలో సహజత్వం లేదు

జన్మించుటలో సహజత్వం లేదు జీవించుటలో సహజత్వం లేదు మరణించుటలో సహజత్వం లేదు 

జన్మించుటలో వైద్యశాలయందు కృత్రిమంగా జన్మిస్తావు 
శ్వాసను కృత్రిమ శ్వాసనాళంతో ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు సాగిస్తావు 
ఆహారాన్ని కృత్రిమంగా అందుకుంటావు [ఆహార తయారి విధానం కృత్రిమమైన విజ్ఞానమే]
సూర్యరశ్మి లేక చికిత్స పొందుతావు లేదా సూర్యరశ్మి లేని చోట ఎదుగుతావు 
శరీరంలో భాగాలను కృత్రిమమైన వాటిని ఉపయోగిస్తారు 
సహజమైన నడక లేక కృత్రిమంగా వాహనాలతో ప్రయాణిస్తావు 
కృత్రిమమైన యంత్ర పరికరాలతో జోలపాడెదరు 
ఇంటి బయట ఆవరణం లేక రక్షణ లేక ఇంటిలోనే ఆడుకునెదవు 
మిత్రులు బంధువులు లేక యంత్ర పరికరాలతోనే కాలాన్ని గడిపెదవు 
చదువుటలో ఎన్నో యంత్ర పరికరాలను ఉపయోగించుకునెదవు 
సహజమైన జ్ఞాన గ్రహణశక్తి లేక యంత్ర బోధన విజ్ఞానాన్ని అలవాటుచేసుకునెదవు 
సహజమైన ఆటలు లేక కృత్రిమమైన యంత్రాలతో ఆటలు సాగించెదవు 
సజహమైన ప్రకృతి వాతావరణం లేక కాలుష్యమైన వాతావరణంలో ఎదిగెదవు 
సహజ జీవన విధానం లేక కృత్రిమ జీవన విధానాలతో జీవితాన్ని సాగించెదవు 
సహజమైన వృత్తులు లేక యంత్ర పరికరాలతో సాంకేతిక విజ్ఞానంతో శ్రమించెదవు 
వ్యవసాయం లేక వ్యాయామం లేక జీవన విధాన పరిస్థితిని కృత్రిమంగా మార్చుకుంటూ సాగెదవు 
సహజత్వం లేని జీవితం శతాబ్దం నుండి అర శతాబ్ధమౌతున్నది 

సహజత్వం ఉన్నంతవరకు జీవితం దివ్యంగా దీర్గాయుస్సుతో సాగుతుంది 

జన్మించినప్పుడు సంతోషించెదరు మరణించినప్పుడు దుఃఖ్ఖించెదరు

జన్మించినప్పుడు సంతోషించెదరు మరణించినప్పుడు దుఃఖ్ఖించెదరు 

జన్మించిన నాటి నుండి మరణించు వరకు సుఖదుఃఖాలు వస్తూ పోతూ ఉంటాయి 
సుఖాలను అనుభవించాలి దుఃఖాలను ఓర్చుకోవాలి 
విజయాలను సాధన ఫలితంగా సుఖించాలి అపజయాలను మరో ప్రయత్నంతో పరిష్కారించుకోవాలి 

దుఃఖ్ఖాలను తగ్గించుకుంటూ విజయాలను (సంతోషాలను) పెంచుకుంటూ పోవడమే జీవిత లక్ష్యం 

Wednesday, September 18, 2024

శాస్త్రాన్ని చదువుకున్నవాళ్ళే శాస్త్రజ్ఞులా శాస్త్రాన్ని తెలుసుకున్నవారు కూడా శాస్త్రజ్ఞులు కాగలరా

శాస్త్రాన్ని చదువుకున్నవాళ్ళే శాస్త్రజ్ఞులా శాస్త్రాన్ని తెలుసుకున్నవారు కూడా శాస్త్రజ్ఞులు కాగలరా 

శాస్త్రాన్ని నేర్చుకున్నవారే శాస్త్రజ్ఞులా 

శాస్త్రాన్ని శాస్త్రీయంగా అవలంబిస్తూ ఉపయోగిస్తున్నవారు కూడా శాస్త్రజ్ఞులుగా సాగెదరు 
చదువు లేని పూర్వకాలంలో శాస్త్రాన్ని తెలిసినవారే శాస్త్రజ్ఞులై ఎన్నో వివిధ కార్యాలను చేపట్టారు 

ప్రకృతి ధర్మాన్ని గ్రహించడమే శాస్త్రీయం 
ప్రకృతి సహజ ప్రక్రియలు కార్యాల కారణ ఫలితాలు 

కార్య ఫలితం ఉపయోగకరమైతే కార్యాచరణ విధానమే శాస్త్రీయం 

ప్రకృతిపై అవగాహన ఉంటే శాస్త్రాన్ని తెలుసుకోవచ్చు సిద్ధాంతాన్ని గ్రహించవచ్చు సూత్రాన్ని కనుగొనవచ్చు సమస్యను పరిష్కారించవచ్చు 

సూత్రము సంక్షిప్తమైనది 
సిద్ధాంతము వివరణమైనది 
శాస్త్రము కారణమైనది రహస్యమైనది 

శాస్త్రాన్ని సూత్రంగా తెలుసుకుంటే [జ్ఞాపకంగా ఉంచుకుంటే] సిద్ధాంతంగా విశదీకరించవచ్చు రహస్య కారణ విధానాన్ని క్రమంగా గ్రహిస్తూ అర్థం చేసుకోవచ్చు సమస్యలను పరిష్కారించుకోవచ్చు 

ఒక్కొక్క వర్గానికి చెందిన సమస్యలకు ఒక్కొక్క సూత్రం దాగివుంటుంది 

Tuesday, September 17, 2024

శక్తి సామర్త్యాలు మేధస్సులో ఉండడం కాదు వాటిని ఉపయోగిస్తూ ప్రయోజనం పొందుతూ ప్రకృతి విశ్వం అభివృద్ధి చెందాలి

శక్తి సామర్త్యాలు మేధస్సులో ఉండడం కాదు వాటిని ఉపయోగిస్తూ ప్రయోజనం పొందుతూ ప్రకృతి విశ్వం అభివృద్ధి చెందాలి 
శక్తి సామర్థ్యాల విశ్వ విజ్ఞానాన్ని సమాజ స్వచ్ఛతకు ప్రకృతి పరిశుద్ధతకు సహజ కార్యాలకు ఆరోగ్యానికి ఉపయోగిస్తూ ఉండాలి 

భవిష్య విధానాల వల్ల ఎటువంటి ఆటంకములు కలుగుతున్నా వాటిని సులువుగా తక్కువ ఖర్చుతో లేదు సహాయ కార్యాలతో తొలిగించుకుంటూ ఆరోగ్యాన్ని ప్రకృతి పరిసరాలను రక్షించుకోగలగాలి 

సాంకేతిక విజ్ఞానం వల్ల మేధాశక్తి ఎదిగే వయస్సుకు తగ్గుతూ ఎన్నో ఆటంకాలు కలగవచ్చు కృత్రిమ జీవితాలను సాగించవచ్చు ఆరోగ్య సమస్యలు అధికంగా ఏర్పడవచ్చు విపరీతమైన మనోరహతమైన విధానాలు సాగవచ్చు 

శక్తి సామర్త్యాలు భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉండాలి 

సాంకేతిగా విజ్ఞానాన్ని వాడే విధానం తెలియకపోతే ఆటంకాలను అడ్డుకోలేకపోతే జీవన విధానానికి బీభత్సం సృష్టిస్తుంది 

ప్రకృతి విజ్ఞానం సహజమైనది ఆరోగ్యమైనది ప్రశాంతమైనది విశ్వానికి సహకారమైనది 
సహజమైన వృత్తి వ్యాపారాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి గౌరవాన్ని పెంచే బంధాలు కలిగివుంటాయి 

Monday, September 16, 2024

మనుషులతో మాటలు లేక పరికరాలతో పరిచయాలు ఏర్పడి మాట్లాడటాలు వ్యవహారాలు సాగుతూపోతున్నాయి

మనుషులతో మాటలు లేక పరికరాలతో పరిచయాలు ఏర్పడి మాట్లాడటాలు వ్యవహారాలు సాగుతూపోతున్నాయి 

వ్యవసాయం లేదుగా వ్యాయామం లేదుగా

వ్యవసాయం లేదుగా వ్యాయామం లేదుగా 
ఆహారం లేదుగా ఆరోగ్యం లేదుగా 

జీవించుటలో జీవితం లేదే 
జ్ఞానించుటలో జ్ఞాపకం లేదే 

శ్వాసించుటలో సహనం లేదే  
శ్రమించుటలో సామర్థ్యం లేదే 

ప్రయాణించుటలో ప్రశాంతం లేదే 
ప్రస్తావించుటలో ప్రత్యాగతం లేదే 

Friday, September 13, 2024

మలినం లేని మానవుడు మాధవుడు

మలినం లేని మానవుడు మాధవుడు 
మరుపం లేని మానవుడు మహాత్ముడు 
మరణం లేని మానవుడు మాణిక్యుడు 

 

సూర్యోదయంతో ప్రతి గృహం ఉదయిస్తున్నా మానవుల మేధస్సులలో మెలకువ కలుగట లేదే

సూర్యోదయంతో ప్రతి గృహం ఉదయిస్తున్నా మానవుల మేధస్సులలో మెలకువ కలుగట లేదే 
గృహం ఉదయిస్తున్నట్లు కిటికీలు తెలుపుతున్నా మేధస్సుల ఆలోచనలలో ఉత్తేజం కలుగుట లేదే 

మెలకువ లేని సూర్యోదయం కార్యాచరణకు మేధస్సులోని విజ్ఞానం సరిపోకపోవడం ఆలోచనకు సహకరించకపోవడం 
సూర్యోదయాన మెలకువ లేక ఉత్తేజమైన ఆలోచన మేధస్సులో కలగక విజ్ఞాన ప్రణాళిక ఏర్పాటుతో కూడిన ఆచరణ లేక అజ్ఞానంతో నిద్రించడం  

సూర్యోదయం తేజస్సుతో ప్రకాశించడం మేధస్సులో ఉత్తేజమైన మెలకువ ఆలోచనలను కలిగిస్తూ దినచర్యలను సాగించడమే 

సూర్యోదయం ఉన్నంతవరకు జీవుల మేధస్సులలో మెలకువ ఆలోచన భావ తత్త్వాలు ఉత్తేజవంతాన్ని దేహస్సుకు కలిగిస్తుంటాయి 

ప్రకృతి లేనిదే జీవం లేదు భూప్రదేశం లేదు జన్మ తత్త్వం లేదు

ప్రకృతి లేనిదే జీవం లేదు భూప్రదేశం లేదు జన్మ జనన తత్త్వం ఉత్పాదం లేదు 

ప్రకృతి పరమాత్మ పరమార్థ మాతా పితా ద్వితత్త్వ దైవాతృత భావ తత్త్వాల కాలాచర్య పరిమాణం 

ప్రకృతి విజ్ఞానానికి పరిశోధన కేంద్రం పర్యావరణ పర్యవేక్షణ శిభిరం పర్యాటక కుటీరం 

ప్రకృతి ఎదుగుదలకు అభివృద్ధికి ఉత్పాదనానికి నిలయం సోపానం 
ప్రకృతి తనకుతానుగా అభివృద్ధితో ఎదుగుతూ తరుగుతూ సమపాలలో సమయోస్థితితో సాగుతుంటుంది  

ప్రకృతి పరిశుద్ధమైన ప్రాణవాయువుతో జీవిస్తుంది ఎదుగుతుంది ప్రాణవాయువునే అభివృద్ధి చేస్తుంది 

మానవుడే సాంకేతిక విజ్ఞాన శాస్త్రం ద్వారా ప్రాణవాయువును విషవాయువుగా కలుషితం చేసుకుంటున్నాడు 

ప్రకృతి మాన్యం పరమ ఔషధం దేహానికి ఆహార ఆరోగ్యం శ్రమయ సంపద సాధనం

ప్రకృతి మాన్యం పరమ ఔషధం దేహానికి ఆహార ఆరోగ్యం శ్రమయ సంపద సాధనం 

విశ్వమంతా అవతరించిన ప్రకృతి భూ ప్రదేశమందే సర్వ జీవులకు విజ్ఞానం వైభోగం అందిస్తుంది 

మేధస్సు ఎప్పుడైతే సుమేధస్సుతో ఆలోచిస్తుందో అప్పుడే విశ్వ విఖ్యాత ప్రకృతి పరిశుద్ధ విజ్ఞానం [నీ] మేధస్సులో చేరుతుంది

మేధస్సు ఎప్పుడైతే సుమేధస్సుతో ఆలోచిస్తుందో అప్పుడే విశ్వ విఖ్యాత ప్రకృతి పరిశుద్ధ విజ్ఞానం [నీ] మేధస్సులో చేరుతుంది 

సుమేధస్సులో చేరే విజ్ఞానం అనంత భావాల విశ్వ తత్త్వాల ప్రకృతి సిద్ధాంతాల శాస్త్రీయ ప్రభావాల మహా ప్రజ్ఞాన మర్మ రహస్య విధానం 

దేహస్సును మేధస్సును ప్రకృతిలో లీనం చేస్తేనే ఏకాగ్రత గ్రహణతో విశ్వ విజ్ఞాన ప్రజ్ఞాన స్వభావ తత్త్వాలు అపూర్వమై మేధస్సులో చేరుతాయి 

ప్రకృతిని తిలకించుటలో అపారమైన విజ్ఞానం పుష్కలమైన ప్రజ్ఞానం అనంతమైన ప్రభావం మేధస్సులో దేహస్సులో చేరుతాయి 

ప్రకృతి ఆకృతిగల పరమార్థం పరమాత్మం పరమాన్యత్వం 

Thursday, September 12, 2024

జీవించుటలో ఏది అధికమైన అభివృద్ధితో సమయస్ఫూర్తితో సమపాలలో సమకూర్చాలి

జీవించుటలో ఏది అధికమైన అభివృద్ధితో సమయస్ఫూర్తితో సమపాలలో సమకూర్చాలి 

వైభోగం కన్నా శ్రమించడం గొప్పతనం 
ఉత్సవం కన్నా ఉన్నతం గొప్పతనం 
మహోత్సవం కన్నా ప్రవర్తనం గొప్పతనం 
బ్రంహూత్సవం కన్నా పరిశుద్ధం గొప్పతనం 

ప్రకృతి ఎటువంటి జీవ [సజీవ నిర్జీవ] పదార్థాన్నైనా ఆవహిస్తూ ఉంటుంది

ప్రకృతి ఎటువంటి జీవ [సజీవ నిర్జీవ] పదార్థాన్నైనా ఆవహిస్తూ ఉంటుంది 

విశ్వంలో జీవించే జీవరాసులను కూడా ప్రకృతి ఆవహిస్తూ ఉంటుంది 

జీవిలో జీవించే శక్తి సామర్థ్యం ఉన్నంతవరకే ప్రకృతి జీవన కార్యాలకు సహకరిస్తుంది 
జీవిలో జీవించే శక్తి సామర్థ్యాలు లేకపోతే ప్రకృతియే సజీవ పదార్థాన్ని నిర్జీవంగా మార్చేస్తూ తనలో కలుపుకుంటూ శూన్యం చేస్తూ ఆవహిస్తూ ఉంటుంది 

ప్రకృతి నిరంతరం పంచభూతాలుగా జీవ పదార్థాలను ఆవహిస్తూ ఉంటుంది 

ప్రకృతికి ప్రకృతియే ఆహారం 
ప్రకృతి ప్రకృతినే ఆవహిస్తూ పరిశుద్ధమవుతూ ఎదుగుతూ తరుగుతూ ఉంటుంది 
ప్రకృతిలో కలుషితమైన ప్రదేశాన్ని ప్రాంతాన్ని పదార్థాన్ని ప్రకృతియే పరిశుద్ధం చేసుకుంటుంది 

జీవిలో జీవంతం ఉన్నంతవరకే శరీరానికి ప్రకృతి పరిశుద్ధమైన ప్రాణవాయువును అందిస్తుంది 

ప్రకృతి జీవులకు ఒక వైపు శక్తి సామర్థ్యాలను అందిస్తుంది మరోవైపు ఆవహిస్తుంటుంది 

ప్రకృతి కూడా పంచభూతాల పదార్థమే 
ప్రకృతిలో నిరంతరమైన ఎదుగుదలగల అభివృద్ధి ఎల్లప్పుడూ పుష్కలంగా సాగుతూనే ఉంటుంది 

ప్రకృతిలో కలిగే జీవక్రియల ప్రక్రియలు [సజీవ నిర్జీవ పదార్థాలు] అనంతమైన మర్మంతో కూడిన రహస్యమైన శాస్త్రీయ సహజ సిద్ధాంతాలు  



Wednesday, September 11, 2024

సమాజంలో స్మశానం కూడా (వి)భాగమే

సమాజంలో స్మశానం కూడా (వి)భాగమే 
స్మశానంలో [కూడా] విజ్ఞాన అధ్యాయనం సాగుతుంది అనుభవమైన అభ్యాసం కలుగుతుంది 
స్మశానంలో [కూడా] ఎన్నో అనుభవాలు జీవిత పరిణామాలు వివిధ కార్యక్రమాలు సాగుతుంటాయి 

ప్రకృతిలో ప్రతి ప్రదేశం విజ్ఞాన పరిశోధన కేంద్రమే 
మానవులు జీవించే ప్రదేశం ఏదైనా ఏనాటికైనా నిర్బంధమే 

శరీరం శ్రమించడం కోసమే జన్మిస్తుంది

శరీరం శ్రమించడం కోసమే జన్మిస్తుంది 
శ్రమించడం ఆగిపోతే మరణమే సంభవిస్తుంది 

శారీరక ప్రక్రియలు నిలిచిపోతే శరీరం నిష్ప్రయోజనం 

ఏ జీవియైనా జన్మించినప్పటి నుండి శ్రమించాలి 

శక్తి సామర్థ్యం కోసం ఆహారం ఆరోగ్యం కోసం గమనం చలనం కోసం ఆలోచన అభివృద్ధి కోసం ప్రయాణం ప్రభావం కోసం ప్రతి జీవి శ్రమిస్తూనే ఉండాలి 

సూర్యోదయాన విశ్వమంతా ఆకాశం ఉదయించుటలో అనంత జీవులు మేల్కొంటాయి

సూర్యోదయాన విశ్వమంతా ఆకాశం ఉదయించుటలో అనంత జీవులు మేల్కొంటాయి 
జీవుల దినచర్య కార్యక్రమాలు మొదలవుతూ సూర్యాస్తమయం వరకు సాగుతుంటాయి 

సూర్యోదయం లేనిదే మేధస్సులో ఆలోచనల ఉత్తేజం కార్యక్రమాల సాధన పట్టుదల దృఢంగా సాగవు  
ఆకాశ తేజస్సు లేనిదే దేహస్సులో ప్రక్రియల ఉత్తేజం కార్యక్రమాల సాధన సహన ప్రయాణం ధైర్యంగా సాగవు 

పరిచయాలు గౌరవాన్ని పెంచుతాయి ఆనందాన్ని ఇస్తాయి

పరిచయాలు గౌరవాన్ని పెంచుతాయి ఆనందాన్ని ఇస్తాయి [పంచుకుంటాయి]
పరిచయాలతో మనలోని భావాల ఆలోచనల వివిధ విషయాలను పంచుకోగలుగుతాం 
మనిషి మనిషికి స్నేహ సంబంధాలు అధికమై సహాయ కార్యాలు సాగుతుంటాయి 

మనిషి దగ్గర ఏది ఎక్కువగా ఉంటే అది వృధా అవుతుంది

మనిషి దగ్గర ఏది ఎక్కువగా ఉంటే అది వృధా అవుతుంది  

విజ్ఞానం కాని ఐశ్వర్యం కాని వస్త్రం కాని ఆహారం కాని ఆరోగ్యం కాని ఆనందం కాని శ్రమించడం కాని ప్రదేశం కాని - ఏది ఎక్కువగా ఉన్నా అది వృధా అవుతుంది 

మనిషికి దేనినైనా సమపాలలో ఉపయోగించే విధానం అవకాశం ప్రదేశం సమయస్ఫూర్తి ఉండాలి కలగాలి 
సమపాలలో ఏది లేకున్నా అది వృధా అవుతుంది 


Tuesday, September 10, 2024

తెలియకుండా జన్మించడమే జననం తెలిసికూడా మరణించడమే మరణం

తెలియకుండా జన్మించడమే జననం తెలిసికూడా మరణించడమే మరణం  

Monday, September 9, 2024

శుభోదయ శుభంకర

శుభోదయ శుభంకర 
శుభోదైవ శుభంయువు 

శుభాంధవ శుభాచార 
శుభాత్రయ శుభప్రియ 

శుభకర్మ శుభఫల 
శుభక్రియ శుభకార్య 

శుభాకాల శుభాక్షణ 
శుభాకార్య శుభాక్రమ

శుభగుణ శుభతృటి 
శుభాశయ శుభాజయ 

శుభాలయ శుభానయ 
శుభాదయ శుభామయ 

శుభాచర శుభాచల
శుభాగమ శుభాదశ 

శుభావర్ణ శుభాపర్ణ 
శుభాచూర్ణ శుభాతూర్ణ 

శుభారూప శుభానాద 
శుభాశ్వాస శుభాధ్యాస 

శుభాభావ శుభాతత్త్వ 
శుభాస్పర్శ శుభాదర్శ 

శుభాదీక్ష శుభాదక్ష 
శుభారక్ష శుభాలక్ష్య 

శుభాశ్రమ శుభాశ్రయ 
శుభాశ్రత శుభాసత్య 

శుభాశ్రేయ శుభాశ్రావ్య 
శుభాకావ్య శుభానవ్య  

శుభాపత్ర శుభాపుష్ప 
శుభాపాణి శుభాపాళి 

శుభాగీత శుభాగాత్ర 
శుభాగాన శుభాగోప 

శుభాజిత శుభాజీత 
శుభాజాత శుభాజాణ

శుభాసాత్వి శుభాసాహి 





Sunday, September 8, 2024

నేటి తరం కోసం శ్రమిస్తే నీ కోసం రేపటి తరం కోసం శ్రమిస్తే మన కోసం

నేటి తరం కోసం శ్రమిస్తే నీ కోసం రేపటి తరం కోసం శ్రమిస్తే మన కోసం 
భవిష్య తరం కోసం శ్రమిస్తే అందరి కోసం భూత భవిష్య తరం కోసం శ్రమిస్తే ప్రపంచం కోసం 

నడిచే ప్రయాణం నడిపించే హృదయం సాగించే సుమేధం సాధించే సాహసం

నడిచే ప్రయాణం నడిపించే హృదయం సాగించే సుమేధం సాధించే సాహసం 
శ్రమించే శరీరం సహించే సహనం సమయానికి సామర్థ్యం సమిష్టి సహకారం 

వ్యవసాయ వ్యాయామ వ్యవస్థ వైజ్ఞానిక వ్యవహార వైశిష్ట్య వైద్యక్రియములు

వ్యవసాయ వ్యాయామ వ్యవస్థ వైజ్ఞానిక వ్యవహార వైశిష్ట్య వైద్యక్రియములు 

Thursday, September 5, 2024

మన లోని భావ తత్త్వాలను ఎవరు ఎంతవరకు ఎందరికి ఎప్పటివరకు ఎందుకోసం అందిస్తారో తెలుసుకోండి

మన లోని భావ తత్త్వాలను ఎవరు ఎంతవరకు ఎందరికి ఎప్పటివరకు ఎందుకోసం అందిస్తారో తెలుసుకోండి 

మన స్వభావ తత్వముల ఆలోచనలు బహు జీవుల బంధములు అనంత కార్యముల విజ్ఞాన విధానములు 

ఏ జీవికి ఎటువంటి మేధస్సు ఎటువంటి దేహా ఆకృతి ఉండాలో ప్రకృతియే నిర్ణయించును

ఏ జీవికి ఎటువంటి మేధస్సు ఎటువంటి దేహా ఆకృతి ఉండాలో ప్రకృతియే నిర్ణయించును 

ఏ జీవి రూపమైన ఆ జీవికి సరిపోయే మేధస్సు జీవించుటకు సహకరించేలా ఉత్పాదన కలిగేలా ప్రకృతియే సృష్టింపబడును 

సకల జీవరాసుల జననం ఆకార రూపాల మేధస్సు దేహస్సుల విధానం ప్రకృతి సృష్టించే పరిణామమే 

ప్రకృతికి తెలియని ఆకృతి లేదు 

దేహ రూపాల మేధస్సు విధానం [విచక్షణం విజ్ఞానం] ప్రకృతిని అనుభవిస్తూ అభివృద్ధి పరుస్తూ వినాశనం లేకుండా 
జీవుల ఉత్పాదనతో సమయ జ్ఞానంతో సూర్య చంద్రుల నవగ్రహాల పంచభూతాలతో కాలచరణతో కార్యాచరణతో ప్రకృతి సిద్ధాంతాల శాస్త్రీయములతో సూత్రములతో ఏకాగ్రత గ్రహణ శక్తితో అనేక కార్యములతో కారణ ధర్మములతో జీవితాలు సాగేలా అవతరించి సాగుతున్నది 

ప్రతి ఉదయం సూర్యోదయంతో ప్రకృతి పరిశుద్ధంగా అనేక కార్యములతో సకల జీవరాసులకై స్వచ్ఛమైన ప్రాణవాయువుతో పత్రహరితంతో పర్యావరణంతో ఉదయిస్తున్నది 

మానవులే కృత్రిమమైన జీవన విధానాలతో ప్రకృతి పరిశుద్ధతను అపరిశుభ్రం చేస్తూ స్వచ్ఛమైన ప్రాణవాయువు అందకుండా అంతరించేలా కృత్రిమ జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకుంటూ శ్రమిస్తూ మనుగడ సాగిస్తున్నాడు 

రేపటి తరానికి స్వచ్ఛమైన ప్రాణవాయువు ఎలా అందించాలో తెలుసుకోండి 
ప్రకృతిని పెంచండి అభివృద్ధి చేయండి ప్రాణవాయువును సకల జీవరాసులకు అందించండి ఆనందంగా శతాబ్దాలుగా ఆయుస్సును ఆరోగ్యవంతంగా మార్చుకోండి 

ప్రకృతి ఇచ్చిన మేధస్సును ప్రకృతి కోసమే ఉపయోగించాలి [ప్రకృతి కార్యాలతోనే సాగిపోవాలి - వ్యవసాయం]



ప్రకృతియే స్వభావ తత్త్వాలను మేధస్సు గ్రహించేలా గమనంతో అందించును

ప్రకృతియే స్వభావ తత్త్వాలను మేధస్సు గ్రహించేలా గమనంతో అందించును 
ఆకృతియే స్వభావ తత్త్వాలను దేహస్సు స్పర్శించేలా చలనంతో సహకరించును 

విశ్వతియే రూప నాదాలను మేధస్సు గ్రహించేలా గమనంతో అందించును
జగతియే శ్వాస ధ్యాసలను దేహస్సు స్పర్శించేలా చలనంతో సహకరించును

జన్మించు దారి ఒక్కటే మరణించు మార్గములే అనేకం

జన్మించు దారి ఒక్కటే మరణించు మార్గములే అనేకం 

ఏ జీవికైనా జన్మించు దారి ఒక్కటే మరణించు విధానములే అనేకం అనంతం 

జన్మనిచ్చు విధానం ఒక్కటే మరణించు విధానాలే అనేకం  

జన్మనిచ్చే మాతృత్వం ఒకే విధానం మరణించే కాలతత్త్వం అనేక విధాలుగా ఉంటుంది 

ఏ జీవికి ఏ విధంగా మరణం వస్తుందో ఎవరూ గ్రహించలేరు 

ఒక్కో (ఒక) జీవికి ఒక్కో (ఒక) విధమైన మరణం కాల సమయం సంభవిస్తుంది 

ఒక్కో జీవికి ఒక్కొక్క వయసుకు మరణం వస్తుంది 

జన్మించే వయస్సు శూన్యంతో ఆరంభం 
మరణించే వయస్సు కాల సమయంలో ఒక స్థానం [ఊహించలేని గ్రహించలేని కాల నిర్ణయం]
జన్మించు కాల సమయం శూన్యం [ఆరంభం] మరణం వయస్సుకు తెలియని నిర్ణయం 

జననం మేధస్సుకు తెలియని నిర్ణయం మరణం వయస్సుకు [విజ్ఞానానికి] తెలియని నిర్ణయం 

జన్మించే సమయం నీకు తెలియదు మరణించే సమయం నీకు తెలియదు 
మరణాన్ని సహజంగా కలిగించుకునే విధాన విజ్ఞానం నీ మేధస్సులో ఆరోగ్యవంతంగా ఏర్పాటు చేసుకో 

జీవించుటలో అతిశయ ఆర్భాటం ఆధిక్యత ఆవేశం దేహంలో ఉంచుకోవద్దు 

ప్రశాంతమైన ప్రధానమైన ఆరోగ్యమైన జీవన విధాన విజ్ఞానాన్ని స్వయంకృషితో సమన్వయంతో అభివృద్ధి చేసుకో 



Wednesday, September 4, 2024

కాలం [సమయం] ప్రదేశం [ధరణి] గాలి [వాయువు] అగ్ని [తేజస్సు] నీరు [జలం] ఆకాశం [రక్షణం] సామర్థ్యం [చలనం - కదలిక]

కాలం [సమయం] ప్రదేశం [ధరణి] గాలి [వాయువు] అగ్ని [తేజస్సు] నీరు [జలం] ఆకాశం [రక్షణం] సామర్థ్యం [చలనం - కదలిక]

పంచభూతాలు అవతరించాలంటే కాలంతో పాటు సామర్థ్యం [శక్తి] కలగాలి 

కాలం నిశ్శబ్దమైనది ప్రశాంతమైనది నిశ్చలమైనది [సామర్థ్యం లేని కాలం - శూన్యం]

సామర్థ్యం ఉంటేనే కాలం క్షణాలుగా సమయంగా సాగుతూ ఎన్నో కార్యాలతో ఎన్నో విధానాలతో ఎన్నింటినో సృష్టిస్తూ సాగుతూనే ఉంటుంది 

జ్ఞాన విజ్ఞాన ధ్యాన విధాన యోగ ప్రయోగ ఆరోగ్య ప్రయోజనాల శరీర కదలికల ఆసనాలు (నా) మేధస్సులో అనంతమై నిక్షిప్తమైనాయి

జ్ఞాన విజ్ఞాన ధ్యాన విధాన యోగ ప్రయోగ ఆరోగ్య ప్రయోజనాల శరీర కదలికల ఆసనాలు (నా) మేధస్సులో అనంతమై నిక్షిప్తమైనాయి 

ఉచ్చ్వాస నిచ్ఛ్వాస శ్వాస ధ్యాస గమన ఆసన విధానములు ఆరోగ్య సూత్రముల శాస్త్రీయ సిద్ధాంతాల అఖండ గ్రంథములే 

ఉచ్చ్వాస - శ్వాస 
నిచ్ఛ్వాస - ధ్యాస

నిచ్చవాసపై గమనం ఉన్నంతవరకు ఉచ్చ్వాస కలుగుతూనే ఉంటుంది శ్వాస సాగుతూనే ఉంటుంది 

ఉచ్చ్వాస నిచ్ఛ్వాసములు ఎటువంటి క్రియలోనైనా సమపాలలో ఉంటే ఆరోగ్యం పుష్కలంగా శ్వాసకు లభిస్తుంది 

శ్వాస ప్రశాంతంగా ఉన్నంతవరకు దేహం అపార ప్రక్రియలతో సుదీర్ఘంగా ఆరోగ్యవంతంగా జీవిస్తూనే ఉంటుంది  

ప్రకృతిలో ప్రతి అణువు మాణిక్యమే

ప్రకృతిలో ప్రతి అణువు మాణిక్యమే 
ఆకృతిలో ప్రతి అణువు మాధుర్యమే 

విశ్వతిలో ప్రతి అణువు అపరంజితమే 
జగతిలో ప్రతి అణువు అమృతకలశమే 

జీవుల పరిశుద్ధత ఆకలికి తెలియదు

జీవుల పరిశుద్ధత ఆకలికి తెలియదు 

జీవులు జీవించే విధానం వ్యవస్థ దిన చర్య ప్రయాణం అన్వేషణ భావ తత్త్వాలు ఆకలికి తెలియవు 
జీవుల శాఖాహార జీవన విధాన పవిత్రత పరిశుభ్రత ప్రశాంత ప్రదేశ స్వచ్ఛత విధానం ఆకలికి తెలియవు 
జీవుల వినయం విజ్ఞానం శ్రామికం ప్రవర్తన పరిశోధన పరిశీలన పరిశుద్ధత పర్యాలోచన ఆకలికి తెలియవు 

జీవుల నివాస నిర్మాణ సిద్ధాంతం ప్రదేశ పరిణామం కాల ప్రమేయం జీవన ఋతువుల పరిస్థితి ఆకలికి తెలియవు 
జీవుల భవిష్య ప్రణాళిక ఉత్పాదనం జ్ఞాన విజ్ఞాన ఎదుగుదల గమనం ఆటంకాల జాగరిత నాగరికత ఆకలికి తెలియవు 

జీవుల సంభాషణ సమన్వయం అవగాహనం స్నేహ సంబంధం విచక్షణ స్వభావం మేధాశక్తి ఆకలికి తెలియవు 
జీవుల కార్యాచరణ కార్యాలోచన కార్యాగమన కార్యాతపన కార్యాలీనత కార్యాక్రమణ ఆకలికి తెలియవు 

జీవుల సున్నితత్త్వం సౌందర్యం సుగుణం పరిమళత్వం సుగంధనం మధురత్వం మనోహరం ఆకలికి తెలియవు 


Tuesday, September 3, 2024

మరణం లేని మహాత్మా ప్రజ్ఞానమైన మేధస్సుగల దేహంతోనే సాగిపోలేవా

మరణం లేని మహాత్మా విజ్ఞానమైన మేధస్సుగల దేహంతోనే సాగిపోలేవా  
మరణం లేని పరమాత్మా ప్రజ్ఞానమైన మేధస్సుగల దేహంలోనే సాగిపోలేవా

నిరంతరం ప్రకృతిని పరిశుద్ధం చేసే సిద్ధాంత కార్యాలను సాగిస్తున్నావుగా 
ఆవిరతం ఆకృతిని ప్రశోధనం చేసే శాస్త్రీయ కార్యాలను సాగిస్తున్నావుగా  

విశ్వమంతా సాగే ప్రకృతి ఉద్భవించు కార్యాలను అనుభవిస్తున్నావుగా 
జగమంతా సాగే ఆకృతి ప్రభవించు కార్యాలను ఆస్వాదిస్తున్నావుగా 

ఆత్మగా జీవించే పరిశుద్ధమైన దేహాన్ని పరమాత్మ తత్త్వంతో నిత్యం సాగించలేవా 
ఆత్మగా ధ్యానించే ప్రశోధమైన మేధస్సును పరధాత్మ సత్వంతో నిత్యం సాగించలేవా

Monday, September 2, 2024

విశ్వమంతా ప్రకృతి పరిశుద్ధతతో ప్రతి ఉదయం సూర్యోదయంతో ఉదయిస్తుంది

విశ్వమంతా ప్రకృతి పరిశుద్ధతతో ప్రతి ఉదయం సూర్యోదయంతో ఉదయిస్తుంది 
జగమంతా ఆకృతి పరిమలత్వంతో ప్రతి ఉదయం సూర్యోదయంతో పులకరిస్తుంది 

మేధస్సులోనే సర్వ కార్యములు దాగి ఉన్నాయి

మేధస్సులోనే సర్వ కార్యములు దాగి ఉన్నాయి 
దేహస్సులోనే సర్వ జీవములు దాగి ఉన్నాయి  

విశ్వతిలోనే సర్వ భావములు దాగి ఉన్నాయి 
జగతిలోనే సర్వ తత్త్వములు దాగి ఉన్నాయి 

ప్రకృతిలోని సర్వ రూపములు ఉదయిస్తాయి 
ఆకృతిలోనే సర్వ నాదములు ఉద్భవిస్తాయి