Monday, December 30, 2024

ఎంత కాలం జీవిస్తావు ఎంత సమయం ఆలోచిస్తావు

ఎంత కాలం జీవిస్తావు ఎంత సమయం ఆలోచిస్తావు 
ఎంత కాలం నిద్రిస్తావు ఎంత సమయం శ్రమిస్తావు 

ఎంత కాలం ప్రయాణిస్తావు ఎంత సమయం సంభాషిస్తావు  
ఎంత కాలం ఉదయిస్తావు ఎంత సమయం అస్తమిస్తావు 

ఎంత కాలం సాధిస్తావు ఎంత సమయం సహిస్తావు   
ఎంత కాలం అందిస్తావు ఎంత సమయం వహిస్తావు 
 

-- వివరణ ఇంకా ఉంది!

Saturday, December 28, 2024

న్యాయ విచారణ అవసరం లేని న్యాయం అన్ని రంగాలలో ఉంటే నాణ్యత పరిశుద్ధత పరిమాణం సమానత్వంతో అందరికి ఎల్లప్పుడూ లభిస్తాయి

న్యాయ విచారణ అవసరం లేని న్యాయం అన్ని రంగాలలో ఉంటే నాణ్యత పరిశుద్ధత పరిమాణం సమానత్వంతో అందరికి ఎల్లప్పుడూ లభిస్తాయి  

ఎవరికీ వారు సక్రమంగా విజ్ఞానంతో ప్రకృతి పరిశుద్ధత అభివృద్ధితో పనిచేస్తే అన్ని సఫలంగా సమకూరుతాయి 


-- వివరణ ఇంకా ఉంది!

చదువుటలో జ్ఞాపకం లేదా అర్థాన్ని గ్రహించకపోతే [అర్థం తెలియకపోతే] విజ్ఞానం కలగదు

చదువుటలో జ్ఞాపకం లేదా అర్థాన్ని గ్రహించకపోతే [అర్థం తెలియకపోతే] విజ్ఞానం కలగదు 

చదువుటలో అర్థాన్ని గ్రహించడంతో పాటు జ్ఞాపకం కలిగివుండాలి 
అర్థవంతమైన సమాచారం మేధస్సులో జ్ఞాపకంగా ఉన్నప్పుడే విజ్ఞానవంతులుగా ఎదుగుతాము 

విశ్వంలో గల ఎన్నో విధాల సమాచారాన్ని సంభాషించుటలో చదువుటలో వ్రాయుటలో అర్థాన్ని తెలుపుటలో నూతన అర్థాలను గ్రహించుటలో అపార జ్ఞాపక శక్తిని పెంచుకుంటేనే విజ్ఞానవంతులుగా మేధావులుగా జీవించగలుగుతాము అభివృద్ధి చెందగలము  



-- వివరణ ఇంకా ఉంది!

Thursday, December 26, 2024

విజ్ఞానంతో జీవించుటకు విద్యాభ్యాసం [చదువుకోవటం] అవసరం లేదు

విజ్ఞానంతో జీవించుటకు విద్యాభ్యాసం [చదువుకోవటం] అవసరం లేదు  


విశ్వ కాల సర్వ కార్యాలను హితముగా ఎవరికి [వస్తువులకైనను] ఇబ్బంది [నష్టం] లేనట్లుగా సాగించే గమన శక్తి మేధస్సులో ఆలోచన స్వభావం అర్థ పరమార్థంగా ఉంటే చాలు  


-- వివరణ ఇంకా ఉంది!

ఇల్లు ఉంటే సరిపోదు ఇంటిని పరిశుద్ధమైన కార్యాలతో నడిపించే మానవులు ఉండాలి

ఇల్లు ఉంటే సరిపోదు ఇంటిని పరిశుద్ధమైన కార్యాలతో నడిపించే మానవుల కుటుంబం ఉండాలి 
 
దేవాలయం ఉంటే సరిపోదు దేవాలయంలోని దేవుళ్ళను పరిశుద్ధమైన న్యాయమైన నాణ్యతమైన కార్యాలతో నడిపించే భక్తులు ప్రజలు ఉండాలి 

పరిశుద్ధమైన - దేవాలయ ప్రాంగణం ఆవరణం స్వచ్ఛమైన ప్రకృతి ప్రాణవాయువుతో సూర్య కిరణాల కాంతితో నిర్మలమైన ప్రశాంతతతో దైవ భక్తి సంగీత స్మరణ నాదాలతో ఆరోగ్యవంతమైన ఉత్తేజవంతమైన ఆనకరమైన  పూజా విధానాలతో ప్రధాన ఉత్సవాలతో రక్షణ సిబ్బందితో వివిధ జాగ్రత్తలతో నిరంతరం సర్వం సమకూర్చినట్లు సంతృప్తి కరంగా సంతోష భావ తత్త్వాలతో నిశ్శబ్దతతో యోగాభ్యాస సౌకర్యాలతో అతిశయం లేనట్లు సాగుతూ ఉండాలి [భక్తులకు ప్రజలకు సమానమైన దర్శన విధానం సులభమైన విధంగా ఒక గడియలో జరిగిపోవాలి]
[ఎటువంటి కృత్రిమమైన వస్తువులను వాడకూడదు కనిపించరాదు ఆలోచింపరాదు]

న్యాయమైన - దేవాలయ ఆర్ధిక వ్యవస్థ విధానాలు క్రమ శిక్షణగా భక్తులకు ప్రజలకు జీవనోపాధి [సహజమైన వృత్తులతో] కలిగేలా ఉండాలి 

నాణ్యతమైన - పరిశుభ్రతగల ఆహార పదార్థాలు ఐదు రకాలకు మించకుండా సంతృప్తికరంగా సమకూర్చుకోవాలి సహజమైన వంట పద్ధతులతోనే ఆహారం తయారు చేయాలి [కృతిమ యంత్రములు వాడకూడదు]



[భక్తులకు ప్రజలకు దేవుళ్ళకు మేధావులకు ఎటువంటి అలవాట్లు ఉండకూడదు కనిపించరాదు ఆలోచింపరాదు]


ప్రతి కార్యము క్రమ విధమైన ప్రణాళికతో ఎటువంటి కష్ట నష్టాలతో ఇబ్బందులు లేనట్లు సులభంగా సాగిపోవాలి 

దేవాలయ ఆవరణమందు ఆకాశం భూమి కలిసేటట్లు వ్యవసాయ పంటలు ప్రకృతి శోభితత్వంతో విరాజిల్లుతూ ఉండాలి 

భగవంతుని పూజకై ఎటువంటి ఆహార పదార్థాలు [అణువైనను] వృధా కాకూడదు [ఆహార పదార్థాలను ఎక్కువ సమయం ఉంచకుండా తాజాగా ఉన్నపుడే భుజించాలి సేవించాలి ఆరోగ్య అభివృద్ధిని పెంచాలి - అనారోగ్యం తుది వయస్సు వరకు కలగనట్లు చూసుకోవాలి ]

కుటుంబమే బంధువులు - బంధువులే స్నేహితులు - స్నేహితులే సమాజం - సమాజమే ప్రజలు - ప్రజలే భక్తులు - భక్తులే దేవుళ్ళు - దేవుళ్ళే ప్రజలు - ప్రజలే కుటుంబం 

కుటుంబమే క్రమశిక్షణ సిద్ధాంత జీవన విధానం - విజ్ఞాన ఆర్గిక అభివృద్ధి - ప్రకృతి వృద్ధి విధాన సమయ పరిశోధన కాలక్షేపం - విశ్వమంతా ఆరోగ్యవంతమైన సహజమైన జీవనోపాధి విధానం - జ్ఞానంతో సాగుటకు ఉచిత సేవిక బృందం 


-- వివరణ ఇంకా ఉంది!

సమయమా శ్వాసపై గమనమే ధ్యాసపై స్మరణమే నిత్య సాధనగా సాగించుమా

సమయమా శ్వాసపై గమనమే ధ్యాసపై స్మరణమే నిత్య సాధనగా సాగించుమా 
సమయమా ఉచ్చ్వాసపై గమనమే నిచ్చ్వాసపై చలనమే సర్వ కార్యాలకు సాగించుమా 

సమయమా సమయ కాలమా జీవుల జీవమే నీ సమయ సాధనతో అనంత కార్యాలకై [తో] నిత్యం జీవించునా  
సమయమా సమయ కాలమా జీవుల జీవమే నీ సమయ సహనతో అనంత కార్యాలకై [తో] నిత్యం జీవించునా


-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, December 25, 2024

ప్రతి ఉచ్చ్వాసపై గమనం ప్రతి నిచ్చ్వాసపై చలనం

ప్రతి ఉచ్చ్వాసపై గమనం ప్రతి నిచ్చ్వాసపై చలనం సాగుతూ ఉండేలా ప్రతి కార్యాన్ని ఆరోగ్యవంతమైన శ్వాసతో పరిశుద్ధమైన జీవంతో సాగించాలి  

ఎక్కడ గమనం లేకున్నా ఎప్పుడు చలనం లేకున్నా అనారోగ్యంతో మరణావస్థలో అస్తవ్యవస్థతతో దేహం తల్లడిల్లపోతుంది 


-- వివరణ ఇంకా ఉంది!

మరణాన్ని నీవు నిర్ణయించుకోవద్దు కాలమే నిర్ణయిస్తుంది

మరణాన్ని నీవు నిర్ణయించుకోవద్దు కాలమే నిర్ణయిస్తుంది 

మరణం ఆరోగ్యంగా ధీర్గాయుస్సుతో ప్రశాంతంగా నిద్రించు సమయంలో జరిగిపోవాలి  

మరణాన్ని ఆరోగ్యంతో వదిలించుకుంటూ ఆయుస్సును పెంచుకుంటూ కుటుంబ అభివృద్ధితో సాగిపోవాలి 


-- వివరణ ఇంకా ఉంది!

Tuesday, December 24, 2024

మరణించుటచే మేధస్సులోని జ్ఞానం మర్మమైనను ఎక్కడికి చేరునో తెలుసుకో

మరణించుటచే మేధస్సులోని జ్ఞానం మర్మమైనను ఎక్కడికి చేరునో తెలుసుకో 
మరణంతో మేధస్సులో జ్ఞానం లేకున్నను వివేకవంతమైన పరిశోధన నిత్యం ఎలా సాగించాలో తెలుసుకో  

నిత్యం విజ్ఞాన సేకరణ పరిశోధన ప్రయోగం శాస్త్రీయ సిద్ధాంతంతో ఎలా సాగించాలో ప్రకృతితో తెలుసుకో 

విశ్వ కాల మేధస్సులో అనంత ప్రకృతి పరిశోధన శాస్త్రీయ సిద్ధాంతాలు ఎలా నిత్యం సాగుతున్నాయో తెలుసుకో 

ప్రతి జీవి మేధస్సులోని విజ్ఞానాలు విశ్వ కాల మేధసులో ఎలా చేరుతున్నాయో అపారమైన ప్రశాంతమైన ప్రకృతి ఏకాగ్రత ధ్యానంతో తెలుసుకో 


-- వివరణ ఇంకా ఉంది!

ఎక్కడ ఉన్నానో తెలుసుకో ఎలా ఉన్నానో తెలుపుకో

ఎక్కడ ఉన్నానో తెలుసుకో ఎలా ఉన్నానో తెలుపుకో 
ఏం చేస్తున్నానో తలుచుకో ఏమై ఉన్నానో తపించుకో

ఎవరినో పరిశోధించుకో ఎక్కడి వాడినో పరీక్షించుకో 
ఎంతటి వాడినో పలకరించుకో ఎలాంటి వాడినో ప్రయత్నించుకో 

ఏనాటి వాడినో సంభాషించుకో ఎంత వరకో స్మరించుకో 
ఎవరికై ఉంటానో పరామర్శించుకో ఎందరికై ఉంటానో ప్రస్తావించుకో 


-- వివరణ ఇంకా ఉంది!

   

Wednesday, December 18, 2024

కష్టం వచ్చినప్పుడు కష్టపడితేనే సుఖం కలిగినపుడు సుఖించగలవు

కష్టం వచ్చినప్పుడు కష్టపడితేనే సుఖం కలిగినపుడు సుఖించగలవు 
కష్టం వచ్చినప్పుడు కష్టపడితే కష్టాలు తొలగిపోయి కొత్త ధనాన్ని చూడగలరు 

కష్టం వచ్చినప్పుడు కష్టపడకపోతే సుఖం కలుగుతున్నప్పుడు మిగిలిన కష్టాలను తలుచుకుంటూ సుఖించలేరు 

కష్టాలతో కష్టపడీతే నష్టాలు వెళ్ళిపోయి లాభాలతో సుఖించగలరు 

సుఖించుటకు [కష్ట పడుతూ] కాస్త సమయం ఓర్పు సహనం ప్రశాంతమైన ఆలోచన కలిగివుండాలి 
కష్టాలను ఎదురుకొనుటకు కాస్త నైపుణ్యం విజ్ఞానం జాగ్రత్త వహిస్తూ ఆరోగ్యంతో సాగాలి 


-- వివరణ ఇంకా ఉంది!

సైనికుడా రక్షకుడా శ్వాసపై గమనం ఉంచుతూ నీ ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను ప్రశాంతంగా సాగించవా

సైనికుడా రక్షకుడా శ్వాసపై గమనం ఉంచుతూ నీ ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను ప్రశాంతంగా సాగించవా  
సైనికుడా రక్షకుడా శ్వాసపై గమనం పెడుతూ నీ ధ్యాస యాసలను పరిపూర్ణంగా కొనసాగించవా 

సైనికుడా రక్షకుడా శ్వాసపై గమనం తెలుసుకుంటూ నీ నిత్య లక్ష్యమును సాధనతో సహించుకోవా  
సైనికుడా రక్షకుడా శ్వాసపై గమనం తెలుపుకుంటూ నీ  జాగ్రత జ్ఞానంతో ధైర్యంతో లక్ష్యాన్ని సాహసించవా 

సైనికుడా రక్షకుడా శ్వాసపై గమనం పరిశోధిస్తూ నీ అపార సామర్త్యాన్ని ప్రజ్ఞానంతో అభివృద్ధి చేసుకోవా 
సైనికుడా రక్షకుడా శ్వాసపై గమనం గ్రహిస్తూ నీ అపూర్వ జీవన ఆయుస్సును అందరికై పెంచుకోవా 


-- వివరణ ఇంకా ఉంది!


శరీరం శూన్యమౌతుంది మేధస్సు మాయమౌతుంది

శరీరం శూన్యమౌతుంది మేధస్సు మాయమౌతుంది 
దేహం దైవమౌతుంది మనస్సు మర్మమౌతుంది  

జీవం జీవించ లేక ఆకాశమౌతుంది 
జ్ఞానం జ్ఞాపకాలు లేక విలీనమౌతుంది 


మరణం మహా తత్త్వమౌతుంది జీవితం జీవులకు నిలయమౌతుంది 



-- వివరణ ఇంకా ఉంది!

ధరలను తరచుగా చూడని వారు ఎక్కువ ఖర్చు చేయగలుగుతారు

ధరలను తరచుగా చూడని వారు ఎక్కువ ఖర్చు చేయగలుగుతారు [మోసపోగలరు ]
ధరలను తరచుగా చూసేటి వారు తక్కువ ఖర్చు చేయగలుగుతారు 

ధరలు ఆకాశాన్ని దాటి వెళుతున్నా ఖర్చులు చేసేవారు ఎందరో ఉన్నారు 

వస్తువు యొక్క ఉత్త్పతి తయారి విధానం కన్నా ఎన్నో రెట్లుగా ధరలు సాగుతున్నాయి అలాగే ఎందరో కొంటున్నారు 

ఆహార పదార్థాలు వృధా అవుతున్నా వ్యర్థమౌతున్నా ధరలను తగ్గించని వ్యాపారం చేస్తున్నారు 

ధరలు తగ్గితే ఎటువంటి పదార్థాలు [అణువైనను] వృధా వ్యర్థం కావు [మిగలవు] - ఎందరో ఆరోగ్యాంగా పరిశుద్ధంగా అభివృద్ధితో దీర్ఘ కాలంతో శతాబ్దాలుగా జీవించగలరు 

నేటి వ్యాపారంలో ఆహార పదార్థాలు  యాభై శాతం వరకు  నాణ్యత లేని విధానంగా వృధాగా వ్యర్థమై పోతున్నాయి 

యాభై శాతం - [వృధాగా, వ్యర్థంగా, నాణ్యత లేక, అందరు తిన్న తరువాత పారవేసే మిగులు పదార్ధం]

వృధాగా - పంపిణి చేసేటప్పుడు, అందరు ఆహారం తిన్న తరువాత మిగిలిన ఆహారాన్ని పారవేయడం   
వ్యర్థంగా - తక్కువ ధరలకు అమ్మలేక ఎక్కువ సమయం వ్యాపారంలో ఉంచుకోవడంతో చెడిపోవడం  
నాణ్యత లేక - దాచుకున్న దానిని అప్పుడప్పుడు చూసుకోలేక లేదా తరచుగా అమ్మలేక పోవడం 

తక్కువ ధరలకు అమ్మితే అణువైనను మిగలదు అంతా ఆహారంగా మారుతుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ప్రకృతి పరిశుద్ధతతో అభివృద్ధి చెందుతుంది స్వచ్ఛమైన ప్రాణ వాయువును అందిస్తుంది
[ఎటువంటి దురలవాట్లు ఉండవు, కలగవు]

పరిశోధన పరిశుద్ధతకై సాగిపోవాలి - విజ్ఞాన ధర్మం 

వ్యాపారంలో ఏది వృధా కాకూడదు [అణువైనను ] - ప్రకృతి ధర్మం 


-- వివరణ ఇంకా ఉంది!

అణువుల మనస్తత్త్వాన్ని తెలుసుకుంటే వస్తువులపై జాగ్రత్త వహించే సుగుణ లక్షణం మేధస్సులో అలవర్చుకుంటుంది

అణువుల మనస్తత్త్వాన్ని తెలుసుకుంటే వస్తువులపై జాగ్రత్త వహించే సుగుణ లక్షణం మేధస్సులో అలవర్చుకుంటుంది  

వివిధ అణువులు వివిధ రకాలుగా వివిధ వస్తువులుగా పదార్థాలుగా ఇలా ఎన్నో స్వభావ తత్త్వాలతో తమ రూపాలను వివిధ కాల సమయంతో కలిగి ఉంటాయి 

ప్రతి అణువు అమృతమే ప్రతి అణువు ప్రకృతి సృష్టించినదే ప్రతి అణువు అమూల్యమైనదే 

ఒక్కొక్క జీవి ఒక్కొక్క సిద్ధాంతంతో జీవన విధానాన్ని సాగిస్తూ జీవిస్తుంది

ఒక్కొక్క జీవి ఒక్కొక్క సిద్ధాంతంతో జీవన విధానాన్ని సాగిస్తూ జీవిస్తుంది  
ప్రతి జీవి మేధస్సులో ఒక్కొక్క ప్రత్యకత ఒక్కొక్క విధంగా దాగి ఉంటుంది 

ప్రతి జీవి వివిధ జీవన విధానాలను అనుసరించి వివిధ రకాల ప్రత్యేకతలతో మేధాశక్తిని గ్రహిస్తూ సాధన చేస్తుంది  



-- వివరణ ఇంకా ఉంది!

Monday, December 9, 2024

ఒక మనిషి తనకు తానుగా ఎదుగుతూ స్వతహాగా శ్రమిస్తూ జీతాన్ని లేదా ఆదాయాన్ని ఆర్జించేంత వరకు మరో మనిషి పోషించాలి

ఒక మనిషి తనకు తానుగా ఎదుగుతూ స్వతహాగా శ్రమిస్తూ జీతాన్ని లేదా ఆదాయాన్ని ఆర్జించేంత వరకు మరో మనిషి పోషించాలి  

ఒక జీవి తనకు తానుగా ఎదుగుతూ స్వతహాగా ఆహారాన్ని సంపాదించుకునేంత వరకు మరో జీవి పోషించాలి 

ఎప్పుడైతే తనకు తానుగా శ్రమిస్తూ అవసమైన దాన్ని సంపాదించుకుంటాడో అప్పటి నుండి జీవన విధానం తెలుస్తూ అనుభవాలతో ముందుకు సాగిపోతాడు 

జీవన విధానంలోనే మరో మనిషికి జన్మను అందిస్తూ ఎదిగే వరకు విజ్ఞానం ఆహారం ప్రవర్తన నియమ నిబంధన జాగ్రత్తలను నేర్పుతూ పోషిస్తాడు 


-- వివరణ ఇంకా ఉంది!

జీవించుటలో నీవు ఏ శాస్త్రీయ ప్రకృతి సిద్ధాంత విజ్ఞానాన్ని తెలుసుకున్నావో నీ మేధస్సుకు తెలిసినదా

జీవించుటలో నీవు ఏ శాస్త్రీయ ప్రకృతి సిద్ధాంత విజ్ఞానాన్ని తెలుసుకున్నావో నీ మేధస్సుకు తెలిసినదా 

అనంత జీవులకు ఎటువంటి జీవన విధానం కలుగుతున్నదో ఏనాడైనా ఆలోచనకు ఆర్భాటమై తోచినదా 

ఎందరో మానవుల మేధస్సులలో భవిష్య విజ్ఞానం ఎంతటి పరిశుద్ధమై సహజ ప్రకృతి జీవన విధానంతో సాగుతున్నది 

కలుషితం లేని పంచభూతములను ఏనాడైనా భుజించావా 
కలుషితం లేని పంచభూతములను ఏనాడైనా శ్వాసించావా 

కలుషితం లేని పంచభూతములను ఏనాడైనా అభివృద్ధి చేయగలిగావా 
కలుషితం లేని పంచభూతములను ఏనాడైనా ప్రశాంతంగా ఆశ్వాదించావా 

తరతరాల వారికి నీవు కల్పించే పంచభూతాలు పరిశుద్ధమైనవిగా సాగుతున్నాయో ఆలోచించుకో నీ వారికి తెలుపుకో నీ జీవన విధానాన్ని సహజమైన వనరుల నాణ్యతగా మార్చుకో 

సహజమైన ఆరోగ్యం ప్రశాంతమైన సంలయం [నిద్ర] పరిశుద్ధమైన అభివృద్ధి నాణ్యతమైన ఆహారం విశాలమైన ప్రకృతి వాతావరణం శతాబ్దాల ఆయుస్సుగల జీవన విధానం 


-- వివరణ ఇంకా ఉంది!

ఏ భావన విశ్వమంతా ప్రసిద్ధమై ప్రపంచానికే విజ్ఞానమై జగతికే పరిశుద్ధమైన ప్రకృతిని అందించునో

ఏ భావన విశ్వమంతా ప్రసిద్ధమై ప్రపంచానికే విజ్ఞానమై జగతికే పరిశుద్ధమైన ప్రకృతిని అందించునో 
ఏ తత్త్వన జగమంతా ప్రఖ్యాతమై ప్రపంచానికే ప్రజ్ఞానమై విశ్వతికే పరిపూర్ణమైన ప్రాణవాయువును వెదజల్లునో 

ఏ ఆలోచన భావ తత్త్వాల గమనమై లోకానికే సుజ్ఞానమై ప్రశాంతమైన వాతావరణ రుతుపవనాలను సకాలంలో సమకూర్చునో 
ఏ ఆగమన జీవ ప్రయాసాల ప్రయాణమై లోకానికే సుదీర్ఘమైన సుస్థిరమైన పత్రహరిత వృక్షముల అభివృద్ధితో  వ్యాపించునో 


-- వివరణ ఇంకా ఉంది!

ఏ భావంతో ఆగిపోతున్నా ఏ తత్త్వంతో నిలిచిపోతున్నా మరణమే

ఏ భావంతో ఆగిపోతున్నా ఏ తత్త్వంతో నిలిచిపోతున్నా మరణమే లేదని ఆత్మ పరమాత్మతో తెలుపుతూ ప్రశుద్దమైన ప్రశాంతతో ప్రయాణిస్తూ ఏనాటికి నిర్బంధం లేకుండా పంచభూతాలకు అతీంద్రియమై జీవిస్తున్నది  


-- వివరణ ఇంకా ఉంది!

అంతస్తులలో జీవిస్తున్నా ఆస్తులు లేని జీవన విధానాలు అవధులు లేని ఆదాయ వ్యయములు

అంతస్తులలో జీవిస్తున్నా ఆస్తులు లేని జీవన విధానాలు అవధులు లేని ఆదాయ వ్యయములు  

నేలపై నిలిచేందుకు అవకాశం లేనట్లు భవన నిర్మాణ అంతస్తులు అనుకూలత లేకుండానే ఎదిగిపోతున్నాయి 

నేలను తాకని జీవన శైలి నేలను చూడని ప్రయాణ వైఖరి నేల ప్రయోజనం తెలియని జీవిత పరిష్టితి వివిధ రకాలుగా సాగిపోతున్నాయి 

ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో కలిసిపోతూ పూర్వ ప్రజ్ఞాన సహజ ప్రకృతి పర్యావరణ పత్రహరితాన్ని మరచిపోతున్నారు 


-- వివరణ ఇంకా ఉంది!

నేను జీవించే ప్రదేశాన్ని పరిశుద్ధం ప్రశాంతం చేయవా ప్రభుదేవా

నేను జీవించే ప్రదేశాన్ని పరిశుద్ధం ప్రశాంతం చేయవా ప్రభుదేవా 
నేను ధ్యానించే ప్రదేశాన్ని పరిశోధనం పరిపూర్ణం చేయవా మహాదేవా 

నేను ప్రయాణించే ప్రదేశాన్ని ప్రజ్ఞానం ప్రభాతం చేయవా సూర్యదేవా 
నేను పరిశోధించే ప్రదేశాన్ని పర్యావరణం పరమానందం చేయవా గురుదేవా   

  
నేను విశ్వసించే ప్రదేశాన్ని ప్రసిద్ధితం ప్రపంచనం చేయవా విశ్వదేవా
నేను సాహసించే ప్రదేశాన్ని ప్రజాదరణం ప్రణామం చేయవా సహదేవా 

నేను స్మరించే ప్రదేశాన్ని ప్రదాతృత్వం ప్రభూతం చేయవా గుణదేవా 
నేను శృతించే ప్రదేశాన్ని ప్రయోజనం పత్రహరితం చేయవా ప్రాణదేవా 



-- వివరణ  ఇంకా ఉంది!

స్వరంలోనే స్వరాలెన్నో సముదాయమై సమయానికి గీతములే సంగీతమై పోవునే

స్వరంలోనే స్వరాలెన్నో సముదాయమై సమయానికి గీతములే సంగీతమై స్వర పదాలు వివిధ గమనాలతో సరిగమలుగా పదనిసలుగా సాగుతూ సరిగమ పదనిసలుగా ఎన్నో పాటల పాండిత్యం స్వరాభిషేకమై ధ్వని రాగంతో  శృతించిపోతున్నది 

స్వర పదాల నిశ్శబ్దమైన గమనాలే సరిగమలుగా వివిధ గీతాలతో స్వర భావాలతో మహా తత్త్వాలతో సమయానికి సంగీతమై ధ్వని రాగం దేహ సృజన జీవమై జీవిస్తూ ఉద్భవంతో శృతించిపోతున్నది 



-- వివరణ ఇంకా ఉంది!

Sunday, December 8, 2024

వ్యాపారంలో కల్తీ లేకపోయినా వివిధ విభాగాల అధికారులు ఏం చేస్తున్నారో తెలుసా

వ్యాపారంలో కల్తీ లేకపోయినా వివిధ విభాగాల అధికారులుగా ఉండేవారు సరికొత్త నిబంధనలతో క్రింది స్థాయి కార్మికులకు జీతాలను తగ్గించే విధంగా ఆలోచిస్తూ ఎన్నో విధాలుగా మోసం ద్రోహం వంచన చేస్తున్నారు 

వ్యాపార సంస్థ ప్రపంచానికే పేరు తెచ్చినా కార్మికులకు మాత్రం జీతం తగ్గించే విధానాలను నియమ నిబంధనాలను ఎందుకు సృష్టిస్తారో వారి విభాగాల ఆలోచనలను ఎవరికీ [సంచాలక పీఠము / నిర్దేశక మండలి] తెలియకుండా అమలుచేస్తున్నారు  

విభాగాల అధికారులకు ఉన్నతమైన భోగ భాగ్యాలను అనుభవించే జీతాలు వివిధ బహుమానాలు పదోన్నతి స్థానాలను కల్పించుకునే అవిధమైన నియమాలు 

కాలం సాగే కొద్దీ జీతాలు పెరగాలి కానీ కొందరి విభాగాల అధికారుల ఆలోచనల వల్ల జీతాలు తగ్గిపోతున్నాయి 
జీవితంలో ఎన్నో కోల్పోతున్నా సరైన జీతాలు లేక సరైన కుటుంబ సంబంధాలు స్నేహితులు లేక సాధారణంగానైనా జీవించలేక కనీస అవసరాలు తీరకుండానే ఆనారోగ్యంతో అందరికి భారమై కుటుంబ గౌరవం లేక మరణిస్తున్నారు 

ఏ అధికారి ఐనా క్రింద ఉన్నవారు ఎలా పనిచేస్తున్నారో తెలుసుకోవడం కంటే ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవడం ఉన్నతం ప్రదానం అవసరం ఆలోచనం సద్గుణం సాంప్రదాయం 

కార్మికులు ఎటువంటి ఇబ్బందులు తెలిపినా విభాగాల అధికారులు పదోన్నతి స్థానాల నిర్దేశక మండలికి తెలుపలేక వాటిని అలాగే కొనసాగిస్తున్నారు 


-- వివరణ ఇంకా ఉంది!

ఎవరితో ఏ బంధమో ఏ సమయం ఎంత వరకో ఎన్ని బంధాలను కలుపుతాయో

ఎవరితో ఏ బంధమో ఏ సమయం ఎంత వరకో ఎన్ని బంధాలను కలుపుతాయో సంబంధాలుగా జీవితాలు సాగుతూ విజ్ఞానంతో సుఖదుఃఖాలతో ఎన్నో విధాలుగా కష్ట నష్టాలను అనుభవిస్తూ ప్రయాణిస్తున్నాము 

వెళ్ళిన వారి విజ్ఞానంతో మన విజ్ఞాన్నాన్ని అభివృద్ధి చేసుకుంటూ పరిశుద్ధమైన ప్రకృతితో సహజంగా సాగిపోవడమే జీవ బంధాల సమ భావం తరతరాల జీవన తత్త్వం పరిమళమైన కుటుంబం నిర్మలలమైన సామాజం నాణ్యతగల ఆహారం ఆరోగ్యం అనుబంధం 


-- వివరణ ఇంకా ఉంది!

ఓ మహాదేవా! నీ విశ్వ స్వరూపాన్ని దర్శించుటకు ఇక నేను ప్రయాణించలేను

ఓ మహాదేవా! నీ విశ్వ స్వరూపాన్ని దర్శించుటకు ఇక నేను ప్రయాణించలేను 
మనలోని విజ్ఞాన తేజస్సుతోనే నీ దివ్య స్వరూపంతో విశ్వమంతా దర్శనమిస్తున్నది 

పరిశుద్ధమైన ప్రకృతి స్వచ్ఛమైన మానవత్వం నిర్మలమైన వాతావరణం కల్మషంలేని జీవితం అందరిలో సాగిపోతుంటే విశ్వమంతా మీ దివ్య స్వరూపంతోపరమార్థ పరమాత్మమై దర్శనమిస్తున్నది 

నాలోని విజ్ఞానాన్ని నీవే నిరంతరం సాగించేలా ప్రకృతిలో భావ తత్త్వాలను ఉద్భవించేలా సూర్యోదయ ప్రభాతమై కార్యాలను క్రమక్రమంగా సాగించవా 

అంతులేని పూర్వపర విజ్ఞానం అవధులు లేని సహృదయ అనుభవం అన్వేషించలేని ఆలోచన గమనం అందుకోలేని భావ తత్త్వాల పరమార్థం అంతం లేని అనంత అద్భుత ప్రయాణం సమయానికే తెలియని కాలాతీత ప్రభావితములు 


-- వివరణ ఇంకా ఉంది!

Saturday, December 7, 2024

ప్రతి జీవిలో జీవించే ఆత్మ సమానమైన [ఒకే రీతిలో] జీవంతో ప్రాముఖ్యతతో విశుద్ధమై విశ్వమందు జీవిస్తున్నది

ప్రతి జీవిలో జీవించే ఆత్మ సమానమైన [ఒకే రీతిలో] జీవంతో ప్రాముఖ్యతతో విశుద్ధమై విశ్వమందు జీవిస్తున్నది  

ప్రతి అణువులో ప్రతి జీవిలో జీవం ఒక్కటే 
జీవం కనిపించే ప్రతి రూపం ఒక్కటే ఆకార జీవన విధానం వివిధ రకాలుగా సాగిపోతున్నది 

జీవించే జీవిలో విచక్షణ విజ్ఞానం భావ తత్త్వాలన్నీ భవిష్యత్ కోసం జీవిస్తున్నది తరతరాలుగా సాగిస్తున్నది 



-- వివరణ ఇంకా ఉంది! 

ఆత్మ యోగి [పరమాత్మ] వివిధ రూపాలలో విశ్వమంతా జీవిస్తున్నట్లు ఎవరికైనా తెలుస్తున్నదా

ఆత్మ యోగి [పరమాత్మ] వివిధ రూపాలలో విశ్వమంతా జీవిస్తున్నట్లు ఎవరికైనా తెలుస్తున్నదా  

పరమాత్మ లేనిదే అణువైనను విశ్వమందు ఎటువంటి రూపంతో జీవించదు 

పర ఆత్మ రూపమే దర్శనీయం నేత్రానికి సదృశ్య స్వరూపం 

ప్రతి అణువులో ప్రతి జీవిలో పర ఆత్మమే పర రూప దర్శనం జీవ స్వరూపం 



-- వివరణ ఇంకా ఉంది!

మనిషి జీవించుటలో ఎదుగుటకు వివిధ ప్రాముఖ్యమైన కార్యాలకు కాల సమయాల సుగుణ ముహూర్తాలను నిర్ణయించుకోవాలి

మనిషి జీవించుటలో ఎదుగుటకు వివిధ ప్రాముఖ్యమైన కార్యాలకు కాల సమయాల సుగుణ ముహూర్తాలను నిర్ణయించుకోవాలి   

సమయ ముహూర్తాలు ప్రత్యేకమైన కార్యాలను మహోన్నతంగా మనోహరంగా ఆనందంగా ఆరోగ్యాంగా సంతోషంగా సమర్థవంతంగా సాగించాలి 

ప్రత్యేకమైన కార్యాలకు సమయ నిర్ణయాల ముహూర్తాలకు అన్ని వర్గాల బంధు స్నేహ కుటుంబ జనం వివిధ ప్రదేశాల నుండి ప్రయాణిస్తూ ఒకే ప్రదేశంలో కలుసుకుంటూ సుఖంగా కలిసిపోతూ ఆనందంగా సాగిపోవాలి 



-- వివరణ ఇంకా ఉంది!

యవ్వనమే విజ్ఞానం యవ్వనమే పరిశుద్ధం

యవ్వనమే విజ్ఞానం యవ్వనమే పరిశుద్ధం 
యవ్వనమే సామర్థ్యం యవ్వనమే పరిపూర్ణం 

యవ్వనమే సాహసం  యవ్వనమే అధికారం 
యవ్వనమే నిర్మాణం యవ్వనమే ప్రయోజనం 

యవ్వనమే ప్రయత్నం యవ్వనమే ప్రతిఫలం 
యవ్వనమే ప్రభూతం యవ్వనమే ప్రఖ్యాతం 

యవ్వనమే ప్రధానం యవ్వనమే ప్రభాతం 
యవ్వనమే సమయం యవ్వనమే సంపూర్ణం 

యవ్వనమే జీవితం యవ్వనమే జీవనం 
యవ్వనమే జ్ఞాపకం యవ్వనమే జ్ఞాతవ్యం 

యవ్వనమే అమృతం యవ్వనమే అమరం 
యవ్వనమే అద్భుతం యవ్వనమే ఆశ్చర్యం 

యవ్వనమే పరిశోధనం యవ్వనమే పరీక్షణం 
యవ్వనమే ప్రయాణం యవ్వనమే ప్రాముఖ్యం 

యవ్వనమే ఉత్తేజం యవ్వనమే ఉల్లాసం 
యవ్వనమే ఉద్యోగం యవ్వనమే ఉత్పన్నం 

యవ్వనమే రక్షణం యవ్వనమే రూపణం 
యవ్వనమే ఐశ్వర్యం యవ్వనమే ఆరోగ్యం 




-- వివరణ ఇంకా ఉంది!