కనిపించే కాలమేదో వినిపించే కాలానికైనా తెలుసా
వినిపించే కాలమేదో కనిపించే కాలానికైనా తెలుసా
కనిపిస్తూ వినిపించే కాలం జీవితమని నీకైనా తెలుసా
కాలం కనిపించదు వినిపించదు ఐనా నీ జీవితాన్ని సాగిస్తున్నది
సాగిపోయే కాలంతోనే జన్మించి జీవిస్తూ మరణిస్తున్నావని తెలుసుకో
మరలా రాని జీవితం మన కోసమే సాగే కాలమే జీవనం
ఎంతో నేర్చుకోవాలనే కాలమే నీకు విజ్ఞాన అనుభవం
మనస్సులో ఉన్నది మరోసారి ఆలోచిస్తే మేధస్సే తెలుపును
వయసులో ఉన్నది మరోసారి ఆలోచిస్తే విజ్ఞానమే తెలియును
ఆలోచనగా సాగించే భావాలలో విజ్ఞానాన్ని అన్వేషించు
ఆలోచనతో సాగే కాలంతో విజ్ఞాన అర్థాన్ని గ్రహించు
No comments:
Post a Comment