ఖరీదైన కాలాన్ని చూస్తూ మరణించాను ఏనాడో
అద్భుతమైన ప్రణాళికలెన్నో నాతోనే క్షీణించాయి
విశ్వాన్ని దిక్కులుగా చూస్తున్నా దిక్కు తోచదే
కాలం ఖరీదుతో జీవితాలెన్నో కరిగిపోతున్నాయి
చిగురించే జీవితాలు ఖరీదుతోనే కఠినమయ్యాయి
ఖరీదైన కాలానికి తీరని సమస్యలు ఊహాకృతమే
అద్భుతమైన మేధస్సులెన్నో ఖరీదుకై మరణమే
ఖరీదైన జీవితాలు ఏ సమాజానికి అవసరం లేదు
No comments:
Post a Comment