విశ్వంలో రుచికర ఆహారం లేదా లేక నాలుక రుచించుట లేదా
విశ్వంలో రుచికరమైన ఆహార పదార్థాలేవి లేవా తెలియవా అన్వేషించండి
ఎన్నో రకాల ఆహార పదార్థాలున్నా దురలవాట్ల పదార్థాలే రుచించునా
తేనీయం చెరకు కొబ్బరి నీరు పండ్లు ఫలాలు ఎన్నో అద్భుతమైనవి
పని చేసే వేళలలో కూడా దురలవాట్లను సేకరిస్తే పని చేయుట ఎందుకో
ప్రయాణించే వేళలలో దురలవాట్లతో ప్రయాణికులకు ఎంతో ఇబ్బందిగా
దురలవాట్లతో మనిషి మాట్లాడే ప్రవర్తన తీరు ఎదుటివారికి చాలా ఇబ్బందిగానే
నేటి సమాజం అసభ్యకరంగా అశుభ్రతగా దురలవాట్లతో రోగాలతో సాగిపోతున్నది
నేడు దురలవాట్లే ఆహారంగా మారుతూ కొందరికి నిత్య జీవ హారంగా ఉన్నది
సమాజాన్ని బాగు చేసే విశ్వ వీరుడు ఇంకా జన్మించ లేదా అంతటి విజ్ఞాని లేడా
దురలవాట్ల పదార్థాలను మద్యాన్ని ఆపే శక్తి ఏ విశ్వ జీవికి సాధ్యం కాదా
నా దృష్టిలో ఉప గ్రహాన్ని సృష్టించడం కంటే దురలవాట్లను మాన్పించడమే గొప్ప
నీ మేధస్సును ఆలోచన లేని వాటికి కల్పించి యంత్రాన్ని సృస్టించగలవు
నీ మేధస్సుకు సరితూగే ఆలోచన గల విచక్షణ జ్ఞానికి విజ్ఞానాన్ని అందించలేవు
విజ్ఞానమంటే జీవనం కోసం పని కల్పించడం కాదు గుణ ప్రవర్తనను అందించాలి
No comments:
Post a Comment