మరణమే నా కోసం మరణమే నా జీవితం మరణమే నా మహా ఆశయం
మరణం కోసమే జీవిస్తున్నా మరణం కోసమే ఎదుగుతున్నా నిత్యమూ
మరణంతో జన్మించాను మరణంతో జీవించాను మరణంతో మరణించాను
రోగమే నా స్నేహం రోగమే నా మరణం రోగమే నా జీవిత మార్గం
రోగంతో మరణిస్తానని నాతో నీడగా జీవిస్తూ నన్నే మరణింపజేస్తుంది
రోగం లేని జీవితం ఎవరికి లేదని మరణమే సాక్షిగా తెలుపుతుంది
కాలంతో ఎలా జీవించినా ఎవరి జీవితమైనా చివరికి మరణమే నిదర్శనం
No comments:
Post a Comment