Tuesday, October 4, 2011

ఓం నమో శివ రుద్రాయ

ఓం నమో శివ రుద్రాయ - ఓం నమో శివ రౌద్రాయ - ఓం నమో హర నాగాభరణాయ
ఓం నమో శివ దేవాయ - ఓం నమో శివ కంఠాయ - ఓం నమో హర వీరభద్రాయ

శివానంద యోగ శివ కైలాసవాస
విశ్వానంద యోగ విశ్వ వేదవ్యాస
భావా చరణ బహురూప విశ్వ విధాత
భవ్యా కరణ స్వరూప బ్రంహానంద ధాత
మేధస్సులో ఇంద్రధనస్సునే ధరించినా సూర్య తేజస్సువు నీవే
శిరస్సుపై గంగా ధరిణినే ధరించినా జటానంద భూపతివి నీవే
పంచ భూతాల విశ్వ స్థితిలో ధ్యానించే జగాధిపతివి నీవే
విశ్వ భూతాల ఆత్మ స్థితిలో జీవించే హరి చంద్రుడు నీవే

ఓం నమో శివ రుద్రాయ - ఓం నమో శివ రౌద్రాయ - ఓం నమో హర నాగాభరణాయ
ఓం నమో శివ దేవాయ - ఓం నమో శివ కంఠాయ - ఓం నమో హర వీరభద్రాయ

దయానంద యోగ దివ్య దైవేశ్వరా
కరుణానంద యోగ కార్య కరుణేశ్వరా
అనంత ముఖ వర్ణాయ అవతార మూర్తి శివాయ
ప్రత్యక్ష రూప తేజాయ ప్రమోదూత హరి ద్వారాయ
జగతినే త్రినేత్రంతో దర్శించే అభ్యుదయ రూప కారుడవు నీవే
విశ్వ కార్యాలనే కర్త కర్మ క్రియలుగా నడిపించే కాల రుద్రుడు నీవే
యుగాలనే ప్రళయాలుగా సృష్టించే అరవీర భయంకరుడు నీవే
లోకాలనే దిక్కులుగా మార్చే ద్వీపాలకు కాల యుక్తివి నీవే

ఓం నమో శివ రుద్రాయ - ఓం నమో శివ రౌద్రాయ - ఓం నమో హర నాగాభరణాయ
ఓం నమో శివ దేవాయ - ఓం నమో శివ కంఠాయ - ఓం నమో హర వీరభద్రాయ

No comments:

Post a Comment