జగతి ఎంత సత్యమో నీ జననం తెలుపునా
విశ్వతి ఎంత శూన్యమో నీ మరణం తెలుపునా
జగతి ఎంత నిత్యమో నీ జననం తెలుపునా
విశ్వతి ఎంత సర్వమో నీ మరణం తెలుపునా
ప్రకృతి ఎంత భావమో నీ జీవం తెలుపునా
ఆకృతి ఎంత తత్త్వమో నీ రూపం తెలుపునా
జననం ఎంత సహజమో మరణం అంతటి సాధారణమే
జననం ఎంత సంభవమో మరణం అంతటి పరిష్కారమే
జీవించుటలో జీవనం ఎంత కాలమో మరణమే నిశ్చయించునా
శ్రమించుటలో జీవితం ఎంత కాలమో మరణమే నిర్ణయించునా
జీవం జన్మించుటలో నిర్ణయించు సమయ భావం ఎవరిదో గమనించవా
జీవం మరణించుటలో నిశ్చయించు సమయ తత్త్వం ఎవరిదో గ్రహించవా || జగతి ||
రూపంతో జీవించు జీవం అనంత భావాలతో ఎంతవరకు సాగునో తెలుసుకోవా
నాదంతో జీవించు జీవం అనంత తత్త్వాలతో ఎంతవరకు సాగునో తెలుపుకోవా
సూర్య చంద్రుల సమయ కాలంతో సాగే జీవనం ఎంతవరకు సాగునో చూసుకోవా
సూర్య చంద్రుల సమయ కాలంతో సాగే జీవితం ఎంతవరకు సాగునో చూపుకోవా
తేజస్సు తమస్సుల జీవ భావాలతో సాగే జీవం ఎంతవరకు నిలుచునో స్మరించుకోవా
తేజస్సు తమస్సుల జీవ తత్త్వాలతో సాగే జీవం ఎంతవరకు నిలుపునో సహించుకోవా || జగతి ||
జీవించుటలో జగతిపై ప్రయాణాన్ని సాగిస్తూ శ్రమతో ఎదుగుతున్నా సారాంశాన్ని తెలుసుకోలేవా
దీవించుటలో విశ్వతిలో సంయానాన్ని సాగిస్తూ భ్రమతో ఒదుగుతున్నా పరమార్థాన్ని తెలుపుకోలేవా
జన్మించు జీవములన్నీ ప్రయాణించుటలో సాగే మార్గాలే ప్రమాదాలై మరణింపునా మహానుభావా
జన్మించు దేహములన్నీ ప్రయాణించుటలో సాగే విధానాలే అపాయమై మరణింపునా మహాదేవా
శ్వాస ధ్యాసగల నీ జీవం జ్ఞానించుటలో శ్రమతో ఎంతటి కాలాన్ని సాగించినా ఆఖరి విజయం మరణమే జీవా
వ్యాస భాషగల నీ దేహం జీర్ణించుటలో క్రియతో ఎంతటి కాలాన్ని సాగించినా వైఖరి ప్రభావం మరణమే దేవా || జగతి ||
No comments:
Post a Comment