భాష లేని భాషను తెలుసుకోగలవా
ధ్యాస లేని ధ్యాసను గ్రహించగలవా
భావమే లేని భాష తత్త్వమే లేని ధ్యాస తెలుసుకునే జ్ఞానం ఏ భాష భావ తత్త్వాలలో లభించునో
నాదమే లేని భాష వాద్యమే లేని ధ్యాస గ్రహించుకునే జ్ఞాతం ఏ భాష భావ తత్త్వాలలో గోచరించునో
నిరంతరం శ్రమించుటచే నిర్భయం ఆలోచించుటచే నిరంకుశం ప్రయత్నంచే అన్వేషణ పరిశోధన సాగించవా
విజ్ఞానం అత్యంతం గమనం అతీతం ప్రయోగం అమోఘం చలనం అభేధం సమయం అసంఖ్యం
సాధనం అఖర్వం శ్రమణం అఖండం శోధనం అఖిలం ఆలోచనం అలోకం ప్రయాసం అనుభవం || భాష లేని ||
No comments:
Post a Comment