ఏనాడో కలిగిన భావం
ఎప్పుడో తలిచిన తత్త్వం
ఈనాటికి గుర్తించిన కార్యాల గమనం
మేధస్సే గ్రహించిన భావం
దేహస్సే వరించిన తత్త్వం
ఈనాటికి గుర్తించిన కార్యాల చలనం
కాలమే మార్చిన విధానం
కార్యమే తేల్చిన వైవిధ్యం [సమానార్థం]
ఎప్పటికీ జీవంలో ఒదిగే భావాల తత్త్వం దేహ మేధస్సులలో దాగే కార్యాచరణం
విజ్ఞానంలో మహా విజ్ఞానం ప్రజ్ఞానమైతే సూక్ష్మమైన సుదీర్ఘమైన మేధస్సులో సుస్థిరం
వినయంలో మహా వినయం ప్రావీణ్యమైతే తేజస్సైనా తమస్సైనా దేహస్సులో సుస్థానం
No comments:
Post a Comment