Sunday, September 24, 2023

మరణమా నీవు మృదువైన మృదంగమై నాయందే ఝం

మరణమా నీవు మృదువైన మృదంగమై నాయందే ఝం  ... ~ ... ~ ... అంటూ మ్రోగుతున్నావా  
మరణమా నీవు సదృశ్యమైన స్వరూపమై నాయందే ఓం   ... ~ ... ~ ....  అంటూ మోదుతున్నావా 

మహదేశ్వరుడే మహారూపమై పంచభూతాల పరమాత్మమై ఓం   ... ~ ... ~ ... అంటూ ఇహలోక పరలోకాలకు పిలుస్తున్నాడే  
పరమేశ్వరుడే పరరూపమై సహ మృత భావాల పరతత్త్వమై ఓం   ... ~ ... ~ ... అంటూ ఇహలోక పరలోకాలకు ఆహ్వానిస్తున్నాడే 

సర్వేశ్వరుడు నాలోనే ఏకమై శూన్యంతో ఐక్యమై ఆత్మలో లీనమై బంధాలతో బాహ్యమై తెలియని తత్త్వాలతో తోచని భావాలతో ఏమౌతున్నాడో .. . ~ ... ~ ....    || మరణమా || 

ఉచ్చ్వాస నిచ్చ్వాసాలపై ఈశ్వరుడే గమనమై హృదయ చలనాలపై ఆదేశ్వరుడే తత్వనమై 
ఆత్మ జీవ భావాలకు పరమాత్ముడే సదృశ్యమై రూప నాద బంధాలకు సర్వేశ్వరుడే పావనమై 

నిశ్శబ్దమైన శూన్యమై ప్రశాంతమైన ప్రశుద్ధమై పరిపూర్ణమైన పర్యావరణమై పరలోకాన పరిశోధిస్తున్నాడే 
 

No comments:

Post a Comment