నీ కార్యములను నీవు చేసుకొనుటకు నీవు లేవూ
నీ కార్యములను నీవు చూసుకొనుటకు నీవు లేవూ
నీ జ్ఞాపకాలకై చేసే కార్యాలలో నీవు ఎన్నటికీ లేవూ
నీ స్వరూపాలకై చేసే కార్యాలలో నీవు ఎప్పటికీ లేవూ
నీ మరణమే నీవు లేని కార్యతనం అదే నీ కార్యాక్రమం
నీ మరణమే నీవు లేని కార్యకాలం అదే నీ కార్యాక్రియం
నీవు లేని నీ కార్యములెన్నో నీకై చేసే కార్యములెన్నెన్నో || నీ కార్యములను ||
నీ దీవెనలే ఇంటికి వెలుగులా నీ జ్ఞాపకాలే నీ వారికి సంతోషంలా
నీ బోధనలే కంటికి శోధనలా నీ స్వరూపాలే నీ వారికి సమృద్ధిలా
No comments:
Post a Comment