జీవించే జీవమా జననంతో జన్మించావా
జీర్ణించే జీవమా జగమంతా జీవించేవా
జన్మించే జీవమా జపనంతో జీవిస్తున్నావా
జ్వలించే జీవమా జన్మతంతో జీర్ణిస్తున్నావా
జ్ఞానంతో జపించే జీవమా జీవన జాజిలిలో జీవోన్నతమై జీవిస్తున్నావే
జ్ఞాతంతో జనించే జీవమా జీవిత జావళితో జీవోత్సర్గమై జనిస్తున్నావే
జీవులకే జీవోన్మతమై జీవనోపాధివై జీవనోపాయంతో జీవితమంతా జీవిస్తున్నావా || జీవించే ||
జీవనమంతా జ్యోతిర్మయమై జీవులకు జీవనధారవై జీవిస్తున్నావే
జీవితమంతా జ్యోతిర్మతమై జీవులకు జీవనధాత్రివై జీర్ణిస్తున్నావే
జగమంతా జనతాయుతవై జీవులకు జీవనశైలివై జాగృతమౌతున్నావా
జలమంతా జనతాప్రియవై జీవులకు జీవనశీలివై జాబితమౌతున్నావా
జనమంతా జ్ఞాతవ్యమై జీవులకు జ్ఞాపకాల జనితవై జాతీయతవైనావా
జపమంతా జ్ఞాతిత్వమై జీవులకు జ్ఞానలీల జపితవై జ్వాలాకృతవైనావా
జీవులలో జీవించే జీవమా జీవితాన్ని జ్ఞానేంద్రియాలతో జ్ఞానోదయమై జ్ఞానిస్తున్నావే
జీవులలో జీవించే జీవమా జీవనాన్ని జ్ఞాననేత్రాలతో జ్ఞానోపాయమై జ్ఞాతృస్తున్నావే || జీవించే ||
జ్ఞానమంతా జనప్రియమై జీవులకు జన్మంతా జ్ఞానపీఠమై జ్ఞానించెదవే
జ్ఞాతమంతా జనశ్రుతమై జీవులకు జన్మంతా జ్ఞానవేదమై జ్ఞానించెదవే
జ్ఞాతవ్యమంతా జ్ఞాపకమై జీవులకు జ్ఞానేంద్రియమై జిహ్వతో జ్ఞానోదయమైనావా
జ్ఞాపకమంతా జాతవ్యమై జీవులకు జ్ఞానత్రయమై జైత్రతో జనోధ్యాయమైనావా
జ్ఞానగమ్యమంతా జ్ఞాతసిద్ధాంతమై జీవులకు జ్ఞాననేత్రమై జ్ఞానోపదేశమైనావా
జ్ఞానకృతమంతా జ్ఞాతశాస్త్రీయమై జీవులకు జ్ఞానక్షేత్రమై జ్ఞానోపచార్యమైనావా
జీవులలో జనించే జీవమా జీవితాన్ని జ్ఞానభావాలతో జగతిలో జనాచారమై జాగృతమైనావే
జీవులలో జనించే జీవమా జీవనాన్ని జ్ఞానతత్త్వాలతో జగతిలో జనాధారమై జాకృతమైనావే || జీవించే ||
No comments:
Post a Comment