అదృష్టం ఎప్పటికైనా దురదృష్టంగా మారవచ్చు
దురదృష్టం ఏనాటికి అదృష్టంగా మారకపోవచ్చు
అదృష్టాన్ని వదులుకోవద్దు దురదృష్టాన్ని అందుకోవద్దు
అదృష్టాన్ని వదులుకుంటే దురదృష్టం అందుకుంటుంది (స్వతస్సిద్ధంగా)
అదృష్టాన్ని వదులుకోవడమే దురదృష్టాన్ని ఎన్నుకోవడం (నిష్ప్రయోజనం)
అదృష్టం అయోమయాన్ని సృష్టిస్తుంది దురదృష్టం పరిష్కారంగా చూపిస్తుంది
అదృష్టాన్ని వదులుకుంటే ఎంత శ్రమించినా విజయాన్ని సాధించలేకపోవచ్చు
దురదృష్టాన్ని వదులుకోవాలన్నా వదలని పట్టులా అల్లుకొని అంటుకొనిపోవచ్చు
అదృష్టంతో కూడిన శ్రమ ప్రయోజనం విజయం సంతోషం అభివృద్ధికరం
దురదృష్టంతో కూడిన శ్రమ నిష్ప్రయోజనం అశాంతం అనారోగ్యం అనర్థకం
అదృష్టాన్ని ఎంచుకోవడంలో సమయం తక్కువగా కనిపిస్తుంది
దురదృష్టాన్ని ఎంచుకోవడంలో సమయం లేనట్లుగా గోచరిస్తుంది
అదృష్టాన్ని ఆరోగ్యంతో సాగిస్తూ సహనంతో విజయాన్ని సాధించు
దురదృష్టాన్ని ఆరోగ్యంతో సాగిస్తూ సహనంతో విజయాన్ని సాధించు (దురదృష్టం వదిలిపోవచ్చు - అదృష్టం తిరిగిరావచ్చు)
No comments:
Post a Comment