Wednesday, September 6, 2023

మరణం తెలిసేనా ...

మరణం తెలిసేనా ... 
మరణం తెలిసిందా ... 

నీ ధ్యాసకు ... ఆలోచనల భావాలకు ... జీవ తత్త్వాలకు ... 
ఈ క్షణం ఈ క్షణాన తెలియునా ... తెలిపేనా ... ఆలోచనగా అసాధారణగా ... 

నీ మేధస్సులో ... నీ దేహస్సులో ... నీ మనస్సులో ... మరణ భావాల తత్త్వ స్థితి ఒక క్షణమై గ్రహించునా (ఆ పరమాత్మ పిలుపుతో) ... 

ఒక క్షణమే మరణమైతే జీవితం క్షణాల సమయమై (నీ జీవం) ఎంత వరకు సాగునో తెలియునా తెలుపునా (నీ మరణం)  || మరణం || 

క్షణమంతా ఆలోచించుటలో జీవితం (ఒక) క్షణమైతే మరణం ఏ భావంతో జీవించునో 
క్షణమంతా జీవించుటలో (ఒక) ఆలోచన క్షణమైతే మరణం ఏ తత్త్వంతో జీవించునో 

క్షణమెంతో తెలియుటకైనా ఎన్ని క్షణాలు సాగిపోవునో ఎంత వరకు నీవు గ్రహించెదవో 
క్షణమెంతో తెలుపుటకైనా ఎన్ని క్షణాలు సాగిపోవునో ఎంత మేరకు నీవు గుర్తించెదవో 

క్షణంలో జన్మించే జీవం ఏ క్షణం వరకు జీవిస్తుందో ఏ విజ్ఞాన శాస్త్రానికి తెలియునో 
క్షణంలో జన్మించే జీవం ఏ క్షణం వరకు జీవిస్తుందో ఏ ప్రజ్ఞాన సూత్రానికి తెలుసునో 

క్షణాలతో సాగే సమయం జీవితాన్ని ఎంత వరకు సాగించునో ఏ ఆలోచన నీకు తోచనివ్వదే 
క్షణాలతో సాగే జీవితం సమయాన్ని ఎంత వరకు సాగించునో ఏ ఆలోచన నీకు తోచనివ్వదే  || మరణం ||

మరణించే క్షణమైనా బహు బంధాల నీ జీవితం దివ్యత్వ విజ్ఞాన సత్యాన్ని గుర్తించునా    
మరణించే క్షణమైనా బహు విధాల నీ జీవితం అద్విత ప్రజ్ఞాన బంధాన్ని మెప్పించునా  

మరణించే క్షణాలైనా నీ అనుభవం ప్రయోజనమై జీవిత విజ్ఞానాన్ని దివ్యంగా అందించగలవా 
మరణించే క్షణాలైనా నీ అనుగ్రహం ప్రయోగాత్మమై జీవన ఫలితాన్ని భవ్యంగా రుచించగలవా  

మరణించే క్షణాలకైనా హిత భావాలతో మిత్ర తత్త్వాలతో నీ జీవనాన్ని సత్యంగా మార్చుకోగలవా 
మరణించే క్షణాలకైనా సర్వ బంధాలతో నిత్య శాస్త్రాలతో నీ జీవితాన్ని ధర్మంగా నడ్చుకోగలవా 

మరణించే క్షణం నీ అంతరాత్మలో ఏ భావ తత్త్వమో నీ మేధస్సులో ఏ జీవ గమనమో నీకే ఎరుకనా  
మరణించే క్షణం నీ అంతర్యాణలో ఏ జ్ఞాన గమ్యమో నీ దేహస్సులో ఏ క్రియ చలనమో నీకే ఎరుకనా  || మరణం ||

No comments:

Post a Comment