మరణించవా మహమ్మారి అంతరించవా మాయల మారి
శరణించవా మహమ్మారి శూన్యతించవా మాయల మారి
అలసిపోవా మహాచోరి చాలించవా మహాగురి
విరమించవా మహాచోరి దహించవా మహాగురి
నీ ప్రదేశ ప్రాంతాలను చేరుకొని పరిపూర్ణంగా శూన్యించవా
నీ స్వదేశ విదేశాలను తప్పుకొని పరిశుద్ధంగా శరణించవా
భయంకర భయాలను అధిగమించేలా ఘోరాన్ని సృష్టించేందుకు నీవే జన్మించావా
శాంతి ప్రశాంతతలను రక్షించేందుకు ధైర్యాన్ని సమర్థించేందుకు నీవే మరణించవా || మరణించవా ||
సంవత్సరాలుగా సాగే నీ ప్రభంజనం నిత్య పరిశుద్ధతను సమకూర్చి అంతరించెదవా
సంవత్సరాలుగా సాగే నీ ప్రకంపనం సర్వ పరిపూర్ణతను సమర్పించి అస్తమించెదవా
సంవత్సరాలుగా సాగే నీ ప్రయాణం మహా ప్రవర్తనను కలిగించి అగోచరించెదవా
సంవత్సరాలుగా సాగే నీ ప్రభావం నవ ప్రతిష్టతను కరుణించి అదృశ్యతించెదవా || మరణించవా ||
సంవత్సరాలుగా సాగే నీ ప్రత్యామ్నాయం మరో పూర్వర్తనమై ప్రకృతిని పర్యావరణించెదవా
సంవత్సరాలుగా సాగే నీ ప్రతాపనం మరో ప్రజ్ఞానవంతమై ప్రకృతిని పత్రహరితమించెదవా
సంవత్సరాలుగా సాగే నీ ప్రచారణం మరో పూర్వోదయమై ప్రదేశాన్ని పవిత్రతించెదవా
సంవత్సరాలుగా సాగే నీ ప్రజాదరణం మరో మహోదయమై ప్రాంతాన్ని పరిశుద్దించెదవా || మరణించవా ||
No comments:
Post a Comment