విశ్వమంతా విరామమా
జగమంతా విశ్రాంతమా
లోకమంతా అప్రమత్తమా
ప్రదేశమంతా అపాయమా
ప్రకృతిలో ప్రాణవాయువే విషవాయువుగా మారుతున్నదా
ప్రకృతిలో పరిశోధనమే విషాదముగా సాగుతున్నదా || విశ్వమంతా ||
ఆచార ఆదరణ భావ బంధాల నియమాలు పరిశుభ్రంగా మారుతున్నాయా
ఆదేశ హెచ్చరిక జ్ఞాన తత్వాల సిద్ధాంతాలు పరిశుద్ధంగా మారుతున్నాయా
ఆరోగ్య ఆహార పోషణ సామగ్రి వ్యవహారాలు పుష్కలంగా మారుతున్నాయా
అపూర్వ ఆనంద అభిజ్ఞ అనేక కార్యక్రమాలు ప్రశాంతంగా మారుతున్నాయా || విశ్వమంతా ||
వేద విజ్ఞాన వైద్య బృందాల శాస్త్రీయాలు పరిశోధనగా మారుతున్నాయా
జీవ ప్రజ్ఞాన ధ్యాన సంఘాల సూత్రములు ప్రదర్శనగా మారుతున్నాయా
విద్య వైజ్ఞాన ఆరోగ్య సమాజ శిక్షణలు పరిపూర్ణంగా మారుతున్నాయా
దివ్య యోగ్య ఆహార ఆవశ్య సూచనలు ప్రాకృతంగా మారుతున్నాయా || విశ్వమంతా ||

No comments:
Post a Comment