Friday, November 10, 2017

జీవము నీదే దేహము నీదే

జీవము నీదే దేహము నీదే
రూపము నీదే వర్ణము నీదే

మేధస్సు నీదే మనస్సు నీదే
ఆయుస్సు నీదే వయస్సు నీదే   || జీవము ||

శ్వాసతోనే ధ్యాసను గమనించేది నీవే
భాషతోనే స్వభావాన్ని ఆర్జించేది నీవే 

ఉచ్చ్వాసతో జీవాన్ని తపించేది నీవే
సాధనతో కార్యాన్ని నడిపించేది నీవే

శ్వాసపై ధ్యాసతోనే ధ్యానిస్తూ ఆయుస్సును పెంచేది నీవే
భాషపై జిజ్ఞాసతోనే పరిశోధిస్తూ వయస్సును కీర్తించేది నీవే   || జీవము ||

రూపం ఏదైనా ఆలోచన కార్యం ఏదైనా చేసేది నీవే
వర్ణం ఏదైనా సుగుణ తత్వం ఏదైనా తలచేది నీవే

మనస్సు ఎలా ఉన్నా ఆలోచనలో అర్థానికి భావం నీవే
వయస్సు ఎలా ఉన్నా భావనలో పరమార్థ తత్వం నీవే

మేధస్సుతోనే సర్వ భావాలను సమర్థించుట నీవే
మేధస్సుతోనే సర్వ తత్వాలను సమర్జించుట నీవే   || జీవము || 

No comments:

Post a Comment