Wednesday, November 22, 2017

నీకు తెలిసిన వేదం ఎవరికి తెలియదా

నీకు తెలిసిన వేదం ఎవరికి తెలియదా
నీకు తెలిసిన జ్ఞానం ఎవరికి తెలియదా

నీకు తెలిసిన భావన ఎవరికి తెలియదా
నీకు తెలిసిన తత్వన ఎవరికి తెలియదా  || నీకు ||

జీవించడమే వేదం ఎదుగుటయే జ్ఞానం
పరమార్థమే భావం పరమాత్మమే తత్వం

పరిశోధనలో తెలిసినదే మహా వేదం
పరిశుద్ధంలో తలిచినదే మహా జ్ఞానం

కార్యాలోచనలోనే కనిపిస్తున్నది వేదాంత భావం
దేహాంతరశుద్ధిలోనే వినిపిస్తున్నది విజ్ఞాన తత్వం  || నీకు ||

హితమైన భావాలే వేదం
శుభమైన తత్వాలే జ్ఞానం

రూపం లేనిదే భావనగా తెలిసిన దైవం
ఆకారం లేనిదే తత్వనగా తెలిసిన ధర్మం

శ్వాసలోనే ఉన్నది జీవం భావం
ధ్యాసలోనే ఉన్నది దైవం తత్వం  || నీకు || 

No comments:

Post a Comment