Monday, November 20, 2017

వినిపించినా వినలేవు విశ్వ వేదన

వినిపించినా వినలేవు విశ్వ వేదన
కనిపించినా కానరాదు విశ్వ భావన
తోచినా తపించలేవు విశ్వ తత్వన  || వినిపించినా ||

మేధస్సులోనే వినిపిస్తుంది విశ్వ వేదన ఒక ధ్యాసగా
దేహములోనే కనిపిస్తుంది విశ్వ భావన ఒక శ్వాసగా
ఆలోచనలోనే తపిస్తుంది విశ్వ తత్వన ఒక జ్ఞానిగా   || వినిపించినా ||

జీవంలోనే సర్వం వేదాంత భావాల తత్వం మిళితమైనది
ఆత్మంలోనే నిత్యం విజ్ఞాన స్వభావ స్పందనం ఇమిడినది 
పరమాత్మంలోనే అనంతం సుగుణ వర్ణాల తేజం కలిసినది  || వినిపించినా || 

No comments:

Post a Comment