సూర్యుడే ఉదయిస్తున్నాడు చిరంజీవిగా
చంద్రుడే జన్మిస్తున్నాడు చిరకాలజీవిగా
ఆకాశమే అవతరిస్తున్నది అమర జీవిగా
ధరణీయే అధిరోహిస్తున్నది ప్రకృతి జీవిగా || సూర్యుడే ||
లోకమే మన రూప నిలయం
ధరణియే మన సర్వ ఆధారం
ఆకాశమే మన దివ్య మందిరం
ప్రకృతియే మన నిత్య ఆహారం
జగమే మన జీవ శాంతాలయం || సూర్యుడే ||
సూర్యుని గమనమే మన కార్యం
ధరణి స్వభావమే మన సామర్థ్యం
జగతి ఆద్యంతమే మన దైవత్వం
ఆకాశ ప్రభావమే మన నిర్వాహణం
చంద్రుని సమయమే మన విరామం || సూర్యుడే ||
చంద్రుడే జన్మిస్తున్నాడు చిరకాలజీవిగా
ఆకాశమే అవతరిస్తున్నది అమర జీవిగా
ధరణీయే అధిరోహిస్తున్నది ప్రకృతి జీవిగా || సూర్యుడే ||
లోకమే మన రూప నిలయం
ధరణియే మన సర్వ ఆధారం
ఆకాశమే మన దివ్య మందిరం
ప్రకృతియే మన నిత్య ఆహారం
జగమే మన జీవ శాంతాలయం || సూర్యుడే ||
సూర్యుని గమనమే మన కార్యం
ధరణి స్వభావమే మన సామర్థ్యం
జగతి ఆద్యంతమే మన దైవత్వం
ఆకాశ ప్రభావమే మన నిర్వాహణం
చంద్రుని సమయమే మన విరామం || సూర్యుడే ||
No comments:
Post a Comment