Monday, November 20, 2017

ప్రతి జీవికి కలిగేనా సర్వ భావాల విజ్ఞానం

ప్రతి జీవికి కలిగేనా సర్వ భావాల విజ్ఞానం
ప్రతి జీవికి కలిగేనా సర్వ భోగాల సంయోగం 

ప్రతి అణువులో ఉన్నాయా సర్వ భావాల సంపూర్ణం
ప్రతి పరమాణువులో ఉన్నాయా సర్వ భోగాల స్పందనం  || ప్రతి జీవికి ||

ప్రతి జీవి తన జీవిత కాలాన తలిచేనా సర్వ భావాల అనుకరణం
ప్రతి జీవి తన జీవిత కాలాన వహించేనా సర్వ భోగాల అనుచరణం

ప్రతి అణువులో ఏ భావమున్నదో ఆత్మ అనుసంధానానికి తెలియాలి
ప్రతి పరమాణువులో ఏ తత్వమున్నదో పరమాత్మ అనుగ్రహానికి తోచాలి  || ప్రతి జీవికి ||

ప్రతి జీవి జననం ఏ భావమో ఏనాటి వరకు ఎన్ని బంధాలో కాలమే నిర్ణయించేనా
ప్రతి జీవి మరణం ఏ తత్వమో ఆనాటి నుండి ఎన్ని కార్యాలో కాలమే విశదించేనా

జీవించుటలో కలిగే భావ భోగాల సంయోగ తత్వాల అనుబంధం ఏనాటిదో
జీవించుటలో తోచే వేద విజ్ఞాన పరిశుద్ధ సుగుణాల సంబంధం ఎప్పటిదో    || ప్రతి జీవికి || 

No comments:

Post a Comment