నా వాక్యం ఒక కావ్యం నా పదం ఒక భావం
నా అర్థం ఒక గేయం నా వేదం ఒక తత్వం
నా అక్షరం ఒక అంకుశం నా సమాసం ఒక సామర్థ్యం
నా పఠనం ఒక వేదాంతం నా అధ్యాయం ఒక విజ్ఞానం || నా వాక్యం ||
నా వాక్యమునే అడిగెదను పదముల వరుస అర్థమగునని
నా పదములనే కలిపెదను స్వభావాల మధ్యస తెలుసునని
నా అక్షరమునే చేర్చెదను పదముగా పధ్ధతి తెలియునని
నా కావ్యమునే పలికెదను వేదముగా జాగృతి తెలుపునని || నా వాక్యం ||
నా గేయమునే కోరెదను వాక్యముగా లక్ష్యం తోచునని
నా పాఠమునే చదివెదను కథముగా న్యాయం చేయునని
నా నిఘంటువునే అన్వేషించెదను పదాల అర్థాలు తెలిసేనని
నా సంపుటమునే పఠించెదను గ్రంధాల పరమార్థాలు కలుగునని || నా వాక్యం ||