ప్రకృతిలో ఆకృతిగా ఉదయించెదవా
ఆకృతిలో సంస్కృతిగా వికసించెదవా
సంస్కృతిలో సుమతిగా స్వరించెదవా
సుమతిలో జయంతిగా స్మరించెదవా
జయంతిలో స్రవంతిగా వరించెదవా
స్రవంతిలో సాహితిగా సాగించెదవా
సాహితిలో సమ్మతిగా సహించెదవా
సమ్మతిలో సంపతిగా ధరించెదవా
సంపతిలో ఉన్నతిగా తరించెదవా
ఉన్నతిలో సౌఖ్యతగా ఊహించెదవా
సౌఖ్యతలో శ్రీమతిగా శాంతించెదవా
శ్రీమతిలో శ్రీపతిగా అందించెదవా
No comments:
Post a Comment