తల్లీ నీ శ్వాసనే గమనిస్తున్నా
తల్లీ నీ ధ్యాసనే స్మరణిస్తున్నా
తల్లీ నీ భావాన్నే ఆదరిస్తున్నా
తల్లీ నీ తత్వాన్నే ఆచరిస్తున్నా
తల్లీ నీ రూపాన్నే పూజిస్తున్నా
తల్లీ నీ నాదాన్నే ప్రార్థిస్తున్నా
తల్లీ నీ వేదాన్నే పఠిస్తున్నా
తల్లీ నీ గాత్రాన్నే బోధిస్తున్నా
జీవించు నా శ్వాసలో నీ ధ్యానమే
జ్ఞానించు నా ధ్యాసలో నీ రాగమే
నిత్యం నీ భావ తత్త్వాలు నాలో జీవించే సూర్య కిరణ తేజస్సులే
నిత్యం నీ శ్వాస ధ్యాసలు నాలో జ్ఞానించే సూర్య చరణ ఛందస్సులే
No comments:
Post a Comment