నేను లేని దేశమే నీవు జీవించే ప్రదేశమై ప్రపంచమంతా నా వారు జీవించునా
నేను లేని స్థానమే నీవు ఎదిగే ప్రస్థానమై పర్యాటకమంతా నా వారు వృద్దించునా
నేను లేని క్షణమే మీరు జీవించే విశ్వమై విజ్ఞానమంతా మీకు నేనుగా భావమై అందించునా
నేను లేని కాలమే మీరు సాగించే జగమై ప్రజ్ఞానమంతా మీకు నేనుగా తత్త్వమై ఆవహించునా
యోగాల భావాలకే యుగాల తత్త్వాలకే అతీతమైన నా దేహం జీవించుటలో శూన్యమై ప్రయాణించునా
యుగాల దైవాలకే యోగుల దేహాలకే అతీంద్రియమైన నా రూపం జ్ఞానించుటలో శాంతమై ప్రశోధించునా
మేధస్సులోని భావాలు మనస్సులోని తత్త్వాలు అఖండ దేహాన్ని ఏనాడు ఎలా ఎందుకు ఎవరితో విడిచి పోవునో
వయస్సులోని వేదాలు శిరస్సులోని నాదాలు అపూర్వ దైవాన్ని ఏనాడు ఎలా ఎందుకు ఎవరితో కలిసి పోవునో
జన్మలోనే తెలిసిన సిద్ధాంతం జీవించుటలో సాగించే సూత్రధారి దర్శనం మరణంలోనే యదార్థం ప్రశాంతం అదృశ్యం
No comments:
Post a Comment