Friday, November 15, 2024

మానవుడైన నీవే జీవించలేకపోతే ఇక సూక్ష్మ జీవి నుండి మహా జీవి వరకు ఎలా జీవిస్తున్నాయి

మానవుడైన నీవే జీవించలేకపోతే ఇక సూక్ష్మ జీవి నుండి మహా జీవి వరకు ఎలా జీవిస్తున్నాయి 

విశాలమైన విశ్వంలో సూక్ష్మ అణువు నుండి మహా అణువు వరకు వివిధ రకాల జీవులు జన్మిస్తూ ఎదుగుతున్నాయి
విశాలమైన విశ్వంలో తమ భావ తత్త్వాల విజ్ఞానంతో వివిధ రూపాలతో ఎలా జీవిస్తున్నాయో మానవుడే గ్రహించాలి 

ప్రతి జీవి నుండి ఎన్నో రకాల అనుభవాలను గ్రహించి మన కార్యాలను విజ్ఞానవంతంగా జాగ్రత్తగా సాగిస్తూ దేనినైనా పరిశుద్ధంగా పరిపూర్ణంగా సాధించుకోవాలి 

మానవుడైన నీవు దేనినైనా తెలుసుకోవచ్చు అర్థాన్ని గ్రహించవచ్చు సాధించవచ్చు ఏ వస్తువున్నైనా సృష్టించవచ్చు 

మానవ రూపం అన్నీ కార్యాలకు వీలుగా వివిధ సౌకర్యాలకు అనుగుణంగా విచక్షణ విజ్ఞానంతో అపురూపంగా సృష్టించబడింది 

ప్రతి జీవి సహజమైన కార్యాలతోనే జీవిస్తుంది మానవుడే వివిధ రకాల కార్యాలతో ఎన్నో రకాలుగా ఉన్నవాడు లేనివాడుగా జీవిస్తున్నాడు 

ప్రతి జీవి సమాన స్థాయిలో ఆలోచిస్తూ భావ తత్త్వాలతో ఎదుగుతూ జీవిస్తుంది 
మానవుడే వివిధ రకాలుగా హెచ్చు తగ్గులతో ఒకరికి ఒకరు విభిన్నంగా జీవిస్తున్నారు 

మానవుడు ఎంత విజ్ఞానం నేర్చినా మరో మానవుడితో సరితూగలేడు 

మానవుడు ఎవరికీ వారు విభిన్నమైన మేధావి వివిధ ఆలోచనల భావ తత్త్వాలుగల అపర జీవి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment