Tuesday, November 12, 2024

రూపమే శివుడు స్వరూపమే శివుడు

రూపమే శివుడు స్వరూపమే శివుడు 
ఆకారమే శివుడు ఆధారమే శివుడు 

ఓంకారమే శివుడు శ్రీకారమే శివుడు 
స్వీకారమే శివుడు సహకారమే శివుడు 

ఆకాశమే శివుడు అంతరిక్షమే శివుడు 
అభయమే శివుడు అజాతమే శివుడు 

అమృతమే శివుడు హాలాహలమే శివుడు 
అమరత్వమే శివుడు హరిహరుడే శివుడు 

జీవమే శివుడు జీర్ణమే శివుడు 
జ్ఞానమే శివుడు జ్ఞాపకమే శివుడు 

నాదమే శివుడు నాళమే శివుడు 
వేదమే శివుడు వేగమే శివుడు 

వాయువే శివుడు వాక్పతే శివుడు 
వర్ణమే శివుడు విధమే శివుడు 

శ్వాసే శివుడు ధ్యాసే శివుడు 
యాసే శివుడు భాషే శివుడు 

కాలమే శివుడు కార్యమే శివుడు 
కర్తయే శివుడు కర్మయే శివుడు 

విశ్వమే శివుడు విశ్వాసమే శివుడు 
జగమే శివుడు జగపతే శివుడు 

విశాలమే శివుడు వివరణే శివుడు 
విజయమే శివుడు విజాతమే శివుడు 

విజ్ఞానమే శివుడు విభిన్నమే శివుడు 
విశుద్ధమే శివుడు విభాగమే శివుడు 

సంభూతమే శివుడు స్వయంభువే శివుడు 
సాగరమే శివుడు స్వాగతమే శివుడు 

సాహిత్యమే శివుడు సాంగత్యమే శివుడు 
పండితుడే శివుడు పాండిత్యమే శివుడు 

గురువే శివుడు గురియే శివుడు 
గిరియే శివుడు గనియే శివుడు 

ఘనమే శివుడు ఘంటయే శివుడు 
గజమే శివుడు గజయే శివుడు 

సమయమే శివుడు సందర్భమే శివుడు 
సంధానమే శివుడు సంస్కారమే శివుడు 

ఉపయోగమే శివుడు ప్రయోజనమే శివుడు 
ఉపకారమే శివుడు ఉపచరణయే శివుడు 

ప్రయాణమే శివుడు ప్రయత్నమే శివుడు 
ప్రకంపనమే శివుడు ప్రభంజనమే శివుడు 

పరిశుద్ధమే శివుడు పరిపూర్ణమే శివుడు 
ప్రభాతమే శివుడు ప్రభాకరమే శివుడు 

సూర్యుడే శివుడు చంద్రుడే శివుడు 
గ్రహమే శివుడు తారయే శివుడు 

జలమే శివుడు జనమే శివుడు 
జన్మయే శివుడు జాతమే శివుడు 

ప్రకృతియే శివుడు జాగృతియే శివుడు 
శ్రీపతియే శివుడు శ్రీమతియే శివుడు 

అనంతమే శివుడు అంతమే శివుడు 
అసంఖ్యమే శివుడు అస్కన్నమే శివుడు


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment