కలం ఆయుధం కాదు విద్యను అభ్యసించే [చదువుకునే] వారికి ఒక సాధన పరికరము
కలం వ్రాత పూర్వకంగా జ్ఞానాన్ని అర్థవంతంగా క్రమక్రమంగా వివరించే సాధన పరికరము
కలంతో కాలాన్ని తెలుపవచ్చు దేనినైనా వ్రాత పూర్వకంగా విజ్ఞాన అనుభవాలతో రచించవచ్చు
కలంతో కాలంతో సాగే సమయాల కార్యక్రమాలను వ్రాస్తూ గ్రంథ పుస్తక రూపంలో లిఖించవచ్చు
కలంతో పూర్వ వర్తమాన ప్రస్తుత భవిష్య విజ్ఞానాన్ని వ్రాత పూర్వకంగా ఎంతైనా తెలుపవచ్చు
కలంతో ఎన్నో పుస్తకాలను వ్రాసుకోవచ్చు వ్రాసిన పుస్తకాలను ముద్రించుకోవచ్చు పంపిణి చేయవచ్చు
విజ్ఞానాన్ని తెలుపుటకు అభ్యసించుటకు కలమే మూలాధారం
కలంతో వ్రాయడం ఆరంభిస్తే అక్షరం నుండి అంతరిక్షం గూర్చి వివరిస్తూ తెలుపుకుంటూ సాగవచ్చు
కలంతో సాధారణ జ్ఞానం నుండి సాంకేతిక విజ్ఞానాన్నైనా తెలుపుకుంటూ సాగవచ్చు
చదివిన దాన్ని గుర్తుకు లేదా జ్ఞాపకానికి అందకపోతే కలంతో వ్రాసిన దాన్ని మళ్ళీ మళ్ళీ చదువుతూ జ్ఞాపకం చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు
కలంతో ముఖ్యాంశాలను కూడా వ్రాసుకోవచ్చు అలాగే ఉపయోగపడే రహస్యాలను కూడా వ్రాసి ఉంచుకోవచ్చు లేదా దాచుకోవచ్చు
కలంతో ఎన్ని ఉపయోగాలో ఎన్ని జీవితాలను మార్చునో సమాజానికి ఎలా ఎటువంటి సమాచారం అందించునో కాలమే వివిధ రకాలుగా తెలుపుతూ సాగించును
చదివినది చెప్పడంలో మారుతుందేమో గాని వ్రాసినది చదవడంలో ఎప్పటికి ఎవరికీ మారదు
కలంతో వ్రాయడమే కాదు ఎన్నో చిత్రాలను ఎన్నో విధాలుగా కూడా నైపుణ్యంతో రూపొందించవచ్చు
కలంతో ఏ భాషలో నైనా వ్రాసుకోవచ్చు దేనినైనా వివరిస్తూ ఏ ఆలోచనల జ్ఞానాన్నైనా తెలుపవచ్చు
కలంతో జరిగినది జరుగుతున్నది జరగబోయేది ఉన్నది లేనిది ఊహల కథలుగా ఎన్నింటినో తెలుపుకోవచ్చు
కలంతో ఎంత వ్రాసుకుంటే అంతటి విజ్ఞానం ఏది వ్రాసుకుంటే అంతటి అవసరం ఉపయోగం ఎలాగ వ్రాసుకుంటే అంతటి అర్థవంతం ఎప్పుడు వ్రాసుకుంటే అంతటి అప్పటి ప్రయోజనం
నేర్చుకునే వాడు కలం పట్టాలి చదివేవాడు పుస్తకం పట్టాలి విద్యను విజ్ఞానాన్ని అభ్యసించే వాడు కలం పుస్తకం రెండిటిని పట్టుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి అనుభవాన్ని పొందాలి ఉత్తీర్ణత సాధించాలి విజయాన్ని చేరుకోవాలి జీవితాన్ని విజ్ఞానంగా పరమార్థంగా సాగించుకోవాలి
కలంతో వ్రాసుకుంటూ పరిశోధన చేసుకో అది పుస్తకమై నీకు బోధిస్తూ మహా విజయాన్ని అందిస్తుంది ఎందరికో తరతరాలుగా ఎన్నో రకాలుగా వివిధ మార్గాలలో ఉపయోగపడుతుంది
కలంతో కాలాన్ని మరో విధమైన జీవితాలుగా మార్చవచ్చు చరిత్రను సృష్టించవచ్చు రాజ్యాంగాన్ని మార్చవచ్చు
కలంతో సంపాదన చేయవచ్చు జీవితాన్ని మలుచుకోవచ్చు సరైన విధంగా సవరించవచ్చు
కలం ఎందరికో జీవితం మరెందరికో ఐశ్వర్యం మరెందరికో ప్రయోజనం
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment