Thursday, June 19, 2025

ప్రతి రోజు ఒక్కటే ప్రతి రోజు ఒకే విధంగా ఉదయిస్తున్నానని సూర్యోదయం తెలుపుతున్నది

ప్రతి రోజు ఒక్కటే ప్రతి రోజు ఒకే విధంగా ఉదయిస్తున్నానని సూర్యోదయం తెలుపుతున్నది 
సూర్యుడు ఉదయించుటలో ఏ విభేదం లేదు ప్రతి రోజు సాగే సమయంలో ఏ మార్పు లేదు   

కాలంతో వచ్చే ఋతువులే మన భావ తత్వాలలో మార్పులను కలిగిస్తూ జీవితంలో ఎన్నో కార్యాలు ఎన్నో విధాలా ప్రతి రోజు వివిధ రకాలుగా సాగిస్తాయి సాగిపోతాయి సాగుతూనే ఉంటాయి 

ఋతువులు కాలంతో వచ్చే మార్పులే కాదు అనుభవాలను అందించే మహా విజ్ఞాన ప్రబోధాలు 

ఋతువుల ద్వారా మన మేధాశక్తి విధానం మారుతుంది వివిధ అనుభవాల ద్వారా మన శక్తి సామర్థ్యాలు మన జీవన విధానాలు అన్నీ మారిపోతాయి 

వర్షం నుండి ఆహారం కలుగుతుంది , ఎండ [సూర్య రష్మి] నుండి శరీర నిరోధక శక్తి కలుగుతుంది, చలి నుండి శరీరం వివిధ స్థితి స్థాయిని మార్చుకుంటుంది, గాలి నుండి రక్షణకై వసతి నిర్మాణం మారుతుంది - ఇలా ఎన్నో మార్పులు కలుగుతూనే మానవుడు అన్నింటిని గ్రహిస్తూ విజ్ఞానంతో అనుభవాలను ఎదుర్కొంటూ అభివృద్ధిని సాధించేందుకు సాధన చేస్తూ జీవిస్తాడు   

కాలంతో పాటు ఋతువులే కాకుండా విశ్వంలో సహజమైన అలజడులు [భూప్రకంపనాలు, వరదలు, తుఫానులు, అగ్ని పర్వతాలు, సుడిగుండాలు, మొదలైనవి] అప్పుడప్పుడు కలుగుతుంటాయి  

-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment