Wednesday, June 4, 2025

మానవుడు మరుపు జీవి - మానవుని మరుపు అనంతం విజ్ఞానం అల్పం

మానవుడు మరుపు జీవి 
మానవుని మరుపు  [అజ్ఞానం] అనంతం విజ్ఞానం [ఎరుక, జ్ఞాపకం] అల్పం 

ఏది నేర్చుకున్న ఎంత నేర్చుకున్నా జ్ఞాపకం అల్పం 
ఏ కార్యాన్ని చేసినా ఎన్ని కార్యాలు చేసినా జ్ఞాపకం అల్పం అనుభవం అల్పం నైపుణ్యం అల్పం 

ఎంత గొప్పవాడయినా ఎంతగా అభివృద్ధి [ఆర్థికంగా] చెందుతున్నా జ్ఞాపకం అల్పం 
ఎంత వయస్సు వున్నా ఎంతగా ఎదుగుతున్నా ఎంతటి వారైనా తమ జ్ఞాపకం అల్పం 
 
ఎంత మేధావిగా ఎదుగుతున్నా ఎంత మహాత్ముడుగా ఎదుగుతున్నా ఎంతటి మహర్షుడికైనా జ్ఞాపకం అల్పం 
ఎంత ప్రయాణం చేసినా ఎన్ని కొత్త విధానాలు నేర్చినా ఎన్నో విధాల అనుభవం పొందినా తన జ్ఞాపకం అల్పం

ఏ ప్రాంతంలో ఉన్నా ఎన్ని ప్రదేశాలు తిరిగినా జ్ఞాపకం అల్పం 
ఎందరితో ఉన్నా ఒక్కడిగా ఉన్నా తనలో దాచుకున్న జ్ఞాపకం అల్పం 

ఎంత సాధన చేసినా ఎన్ని సార్లు పునర్విమర్శ [గమనం] చేసుకున్నా జ్ఞాపకం అల్పం 
ఎంత కాలం జీవించినా ఎన్ని విజయాలు సాధించినా తనలోని నిలిచే జ్ఞాపకం అల్పం 

ఇంటి [గృహం] నుండి బయటకు ఏ కార్యానికైనా ఏ ప్రయాణానికైనా బయలు దేరితే ఎన్నో లేదా ఎదో మరచిపోతుంటాము [మరచిపోయినవి ఎప్పుడు గుర్తుకు వస్తాయో తెలియదు ఎలా పరిష్కారించాలో తెలియదు - వీటి వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయో తెలియదు] [కొన్ని సంధర్భాలలో చేసిన తనిఖీనే పలుసార్లు చేస్తుంటాం ఎందుకంటే వాటిని మరచిపోకూడదు - ఉదాహరణకు: నీరు, పొయ్యి / కుంపటి, వంటచెరకు, వ్యర్థ పదార్ధం,  విద్యుత్తు, తాళం]

ముఖ్యమైన కార్యాలలో కూడా ఎన్నో మరచిపోతాం [ఉదాహరణకు: పరీక్షలకు వెళ్ళేటప్పుడు పరీక్షలు వ్రాసేటప్పుడు, వైద్యశాలలో ఔషధాలు, చికిత్సకు సంబంధించినవి, ఉద్యోగ రిత్యా, వ్యాపార రిత్యా లేదా వివిధ కార్యాలకు వివిధ కార్యాలయాలకు వెళ్ళేటప్పుడు]

వస్తువునే మరచి పోవచ్చు సమాచారాన్నే మరచిపోవచ్చు వ్యక్తులనే మరచిపోవచ్చు 
సమాధానం తెలుసుకోవడం లేదా ఉత్తరవును రాబట్టడం లేదా ప్రశ్నించుట లేదా పరిష్కారాన్ని కనుగొనడం/ఇతరుల నుండి లేదా నీ నుండి రాబట్టుకోవడం మరచిపోవచ్చు 

ఏ వస్తువును ఎలా వాడాలి ఎక్కడ ఉంచాలి ఎవరు వాడాలి ఎప్పుడు వాడాలి ఎందుకు వాడాలి తెలుసుకోవాలి [వస్తువుల ఉపయోగాలు అలాగే నష్టాలు తెలుసుకోవాలి]
ఏ సమాచారాన్ని ఎలా గ్రహించాలి ఎవరు గ్రహించాలి ఎక్కడ గ్రహించాలి ఎలా ఉపయోగించాలి ఎవరితో ఎలా  సంభాషించాలి అన్నీ తెలుసుకోవాలి 

తీసుకోవడం మరచిపోవచ్చు ఇవ్వడం మరచిపోవచ్చు వెళ్ళడం మరచిపోవచ్చు అవసరం లేకున్నా ఎక్కడికో వెళ్ళిపోవచ్చు 

ప్రతి రోజు మనం చేయవలసిన కార్యాలను వ్రాసుకొని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటే ఏమి చేయాలో తెలుస్తాయి ఏవి మరచిపోరాదో తెలుస్తాయి అలాగే ఆ కార్యాలను జ్ఞాపకంతో సక్రమంగా ముగించుకుంటాము 

అవగాహన ప్రణాళిక సమయస్పందన కార్యాచరణ కార్యాక్రమణ కార్యాకారణ సిద్ధాంతం కార్యసిద్ధి కార్యసామగ్రి సమాచార ప్రసారం వ్యాఖ్యానం సార్థకమైన సంభాషణ ఇంద్రియ విచక్షణ కాల ఋతువుల స్థితి మార్పుల గ్రహణ అలాగే చుట్టూ జరిగే వాటిపై నిఘా గమన హిత భావన ప్రశాంత తత్వన అనుభవం విజ్ఞానం నైపుణ్యం ఎరుక జ్ఞాపకశక్తి ఇలా అన్నీ ప్రతి రోజు అన్ని వేళలా అన్ని కార్యాలకు ఉండాలి  - వీటికి కావాలి అనంతమైన జ్ఞాపకశక్తి 

ఆరోగ్య రక్షణ ప్రకృతి ఆహారాల [ఔషధాలు] అభివృద్ధి పరిశుద్ధమైన విశ్వ వాతావరణం విజ్ఞానవంతమైన సమాజం ఇలా ఎన్నో ప్రతి మానవునికి ప్రతి క్షణం ప్రతి రోజు అవసరం - వీటికి కావాలి అనంతమైన జ్ఞాపకశక్తి 

మానవుని జీవన విధానం తెలుసుకోవడం సులభం కాని విశ్వ విజ్ఞానంతో పరిపూర్ణవంతంగా పరమాత్మ తత్వంతో దివ్యమైన ప్రకృతి భావాలతో ఆచరించడం అసాధారణం 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment