నీవు ఎంతటి ఆరోగ్యంతో ఉన్నా ఎంతటి అనారోగ్యంతో ఉన్నా నీ అవయవాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసా
నీ అవయవాలు ఎంతగా శ్రమిస్తున్నాయో ఎంతగా విశ్రాంతి చెందుతున్నాయో ఎంతగా సతమతమౌతున్నాయో గమనించావా
నీ అవయవాలు ఆరోగ్యంగా ఉండేందుకు నీ శ్వాస ప్రయాసాల ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను ప్రశాంతంగా పది నిమిషాలు గమనించాలి
ప్రతి రోజు జ్ఞానేంద్రియాలను నవ రంధ్రాలను అవయవాలను పరిశుద్ధం చేసుకోవాలి ఆరోగ్యంగా ఉంచుకోవాలి ప్రతి రోజు పది నిమిషాలు ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను ప్రశాంతంగా గమనించాలి
శరీరంలోని ప్రతి కణం ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి రోజు పది నిమిషాలు ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను ప్రశాంతంగా గమనించాలి [యోగ లేదా ధ్యానం లేదా గమనం లేదా ధ్యాస లేదా ఆలోచన లేదా స్మరణ (మొదలైనవి) శ్వాసపై ఉండాలి]
ప్రకృతిలో సహజంగా ఎదిగిన నాణ్యత గల తాజాగా ఉన్న ఆహార పదార్థాలను [పరిశుద్ధమైన వివిధ వంటలతో] భుజించాలి
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment