పెళ్లి చేసుకునే వారినుండి ముసలివారి వరకు ప్రతి పురుషునికి ఒక ప్రత్యేక గృహము కావలెనని తపన -
ప్రతి పురుషునికి ఒక గృహము కావలసివస్తే నేటి సమాజమున ఎందరికో ఎన్ని గృహములు కావాలో -
పురుషుడు సంపాదించే ధనంతో ఒక సొంత గృహము నిర్మించుకోవాలనుకుంటే నేడు భూమి వేల ఎంతవరకో -
సంపాదనలో జీతములే తక్కువగా ఉంటె ఇక సొంత గృహము లేక భూ స్థలాన్ని కొనలేక ఇబ్బందిగానే -
భూ స్థలాన్ని కొనలేని జీత భత్యములు జీవించుటకె సరిపోతే సొంత గృహములేని వారికి పెళ్లి ఇబ్బందులే -
జీతములు ఎక్కువగా ఉన్నను భూ స్థలాన్ని కొనగల్గితే ఎంతవరకు ఎందరు కొనగలరు పేదవారికి ఎలా -
భూప్రదేశాన గృహములే ఎక్కువైతే చెరువులు ఉధ్యానవనములు ఆటస్థల రంగములు వ్యవసాయ భూములు ఎలా -
ఒక తండ్రికి ఎంత పెద్ద గృహమున్నను తన కుమారులకు మరొక ప్రత్యేక గృహములు కావలసివస్తే ఎలా -
కుమారుడు ఒక్కరైనను తండ్రి విడిపోతే ఒక గ్రామముననే ఇద్దరికి ప్రత్యేక గృహములు అవసరమా -
కొందరి గృహములు విశాలములేక ఇక్కట్లుగా ఉంటె కొందరి గృహములు విశాలమైనా ఒక్కరే -
ఎందరో శాస్త్రవేతలు మేధావులు మహాత్ములు ఉన్నను సరైన ప్రణాళిక లేకపోతే సమాజమే లేదే -
అద్దె గృహములకు జీతములు సరిపోక పోతే తన జీవిత సమస్యలు తీరేదెలా సాధించే ప్రగతి ఎన్నటికి -
సరిపోని జీతముగల వృత్తిలో ఎదుటి వారి ధనమున ఆశతో అతిశయోక్తిగా తప్పులెన్నో దేశ విదేశాలలో సాగే -
చిన్న చిన్న రహదారులలో చిన్న చిన్న గృహాలు అంతస్తులుగా నిర్మిస్తే శుభ్రత లేక రోగములే గతి -
జానాభ సమస్యను తగించగల్గితే చిన్న కుటుంభాలుగా చట్టాన్ని అమలుపరిస్తే గాని గృహ సమస్య తీరదు -
ఎలాంటి సమస్య కైనా జనాభాను తగ్గించ గల్గితేగాని అబివృద్ధి సాధ్యం కాదు ఏ వ్యకికైనా గృహమునైనా సమాజమునైనా -
Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //
ReplyDelete