Friday, February 19, 2010

* మేధస్సు ఎలా పని చేస్తుంది

మేధస్సు ఎలా పని చేస్తుంది :- ఆలోచనలతో మేధస్సు ఎలా పని చేస్తుంది -
మూడు ఆలోచనలు ఒకేసారి పధ్ధతి ప్రకారంగా పని చేస్తాయి -
ఒకే క్షణానికి మూడు ఆలోచనలు అలా ప్రతి క్షణము పని చేస్తూనే ఉంటాయి -
మూడు ఆలోచనలు క్రమముగా/వరుసగా పనిచేస్తేనే అర్థం లేదా సందేహముగా -
-----
మొదటి ఆలోచన ముందుకు వెళ్లి పోతుంటుంది ఏం జరుగుతుందో తెలుసుకుంటూ (ముందుకు వెళ్ళిపోతుంది) -
రెండవ ఆలోచన జరిగిన దానిని మరిచిపోతుంటుంది (మరచిపోతుంది) -
మూడవ ఆలోచన మరిచిపోతున్న దానిని గుర్తు పెట్టుకుంటుంది కొంత కాలం వరకు (గుర్తు పెట్టుకుంటుంది) -
-----
ఈ మూడు ఆలోచనలు క్షణానికి లేదా క్షణముకన్నా తక్కువ సమయంలో పని చేస్తుంటాయి -
ప్రతి పనిని ఈ మూడు ఆలోచనలు క్రమముగా పని చేస్తేనే మనకు ఏదైనా అర్థం అవుతుంది లేదంటే అర్థం కాక జరిగిందేదో గుర్తుకురాక మరిచిపోతుంటాం -
దేనినైతే అర్థం చేసుకుంటామో అది గుర్తుండిపోయి మనకు జ్ఞానంగా మన మేధస్సు "ఎరుక" ను గ్రహిస్తుంది -
ఎరుక ఎన్నిటినో అర్థం చేసుకుంటూ ఎన్నిటినో గుర్తు పెట్టుకుంటూ మేధస్సును విజ్ఞానవంతంగా వివేకంగా చేసుకుంటుంది -
ఎరుక ద్వారా మనం చాలా కాలంగా ఎన్నిటినో గుర్తు పెట్టుకుంటాం మరచిపోకుండా -
ఒక క్షణానికి మనలో కొన్ని వేల పనులు ఆలోచనలుగా జరిగిపోతూనే ఉంటాయి -
మనకు అర్థమైనవి గుర్తుండిపోయేవి తెలిసినవి గ్రహించేవి అన్ని ఎరుకగా పైన తెలిపిన మూడు ఆలోచనల క్రమం ద్వారానే -
మరచి పోయే వాటిని కొన్నింటిని మనం అర్థమయ్యే వరకు మరల ఆలోచిస్తూనే ఉంటాం ఈ మూడు ఆలోచనల క్రమం విధానం ద్వారానే -
ఈ మూడు ఆలోచనల వరుస క్రమం పనితీరు ఎకాగ్రతతోనే జరుగుతుంది (ఏకాగ్రతకు కూడా : సాధన ద్వారా) -
ఏవైతే ఎక్కువ సార్లు జ్ఞాపకం తెచ్చుకుంటామో అవి చాలా కాలంగా గుర్తుండిపోతాయి -
ఎరుక అంటే మూడు ఆలోచనల క్రమాన్ని వేగంగా సమర్ధవంతంగా పని చేయించడం (పని అంటే ఆలోచించడమే ) -
ప్రతి పనికి మూడు ఆలోచనల క్రమాన్ని ఎరుకయే కలిగిస్తుంది : యిలా చేస్తేనే మేధస్సు ఉత్తేజంగా ఉంటుంది -
క్షణానికి మనలో కలిగే లక్ష ఆలోచనలలో కొన్ని వేల ఆలోచనలను ఎరుక గ్రహించి పని చేయించగలుగుతుంది (వివిధ రకాల పనులను) -
మన శరీరంలో ప్రతి అణువు కణం అవయవాల పని తీరు మరియు మనం ఆలోచించే ఆలోచనలను సైతం ఎరుకయే క్షణానికి వేల పనులుగా -
మనం ఒక పనిని ఆలోచించేటప్పుడు మన చుట్టూ జరిగిన సంఘటనల ద్వారా మన ధ్యాస వాటి మీద మరలి మళ్ళీ మనం చేసే పనిపైననే -
ఇక్కడ చేసే పని మీద మూడు ఆలోచనలు మళ్ళీ ఇతర సంఘటన ద్వారా ధ్యాస మరలిన వాటి మీద మూడు ఆలోచనలు గా ప్రతి పని మీద -
ప్రతి పని మీద మూడు ఆలోచనలుగానే ఆలోచిస్తూ ప్రతీది అర్థం చేసుకొనుటకు ప్రయత్నిస్తూ క్షణానికి ఎన్ని ఆలోచనలో ఎరుకకు -
ఎరుక పని తీరు పైననే మన మేధాశక్తి జ్ఞాన విజ్ఞానం ఆధారపడివుంటుంది అలాగే ఎంత కాలమైనా తెలుసుకుంటూనే ఎంతైనా ఎంతటిదైనా -
ఉదాహరణ : ఒక విద్యార్ధి తన తరగతి గదిలో ఎలా ఎన్ని ఆలోచనలతో తన మేధస్సును మెరుగు పరుచుకోగలడు -
వినడం చదవడం చూడడం అర్థం చేసుకోవడం గుర్తు పెట్టుకోవడం వ్రాసుకోవడం వీటితోపాటు చుట్టూ జరిగే వాటిని గమనించడం -
చూట్టూ జరిగే వాటిపైన గమనమనగా బయట గంట మ్రోగిన తెలుసుకోవడం ఇలా అన్నిటిని మూడు ఆలోచనలతోనే ఎరుకతో వేగంగా ఆలోచింపచేసుకోవడం -
ఏ ఒక్క దాని మీద మూడు ఆలోచనల క్రమం లేకున్నా అర్థం కాకపోవడం సమస్యగా ఎన్నో మన మేధస్సులోనే -
మరో ఉదాహరణ : "వినాయక" ను అక్షరాలుగా పదాన్ని చదవండి -
"వి" అని మొదటి ఆలోచనతో చదివి మరిచిపోయిన తర్వాతనే "నా" అనే అక్షరాన్ని చదవగలం -
"వి" ని రెండవ ఆలోచనగా మరిచిపోతాం కనుకనే మూడవ ఆలోచనతో గుర్తుపెట్టుకోగాలుగుతాం -
అలా "నా" ను చదివి అదేవిధంగా "యక" చదవగలం లేదంటే మొదటి అక్షరంలోనే ఉంటాం -
ఈ విధానం ఒక క్షణంలోనే జరుగుతుంది కనుక మీరు సరిగా ఈ మూడు ఆలోచనల క్రమాన్ని గుర్తించలేకపోవచ్చు -
ఈ విధానాన్ని గుర్తించగల్గితే నే తెలిపిన దానిలో సందేహము లేదు -
సూచన : ఒక చిన్న పాప జన్మించిన తర్వాత మేధస్సు విధానమున ఎరుక ను గ్రహించుటకు ఒక సంవత్సరం పట్టవచ్చు -
మూడు ఆలోచనల క్రమ విధానాన్ని ఆలోచనలుగా అర్థం చేసుకుంటూ మననం చేసుకుంటూ ఎరుకను గ్రహించాలి -
ఆలోచనల క్రమవిధానం లేకపోతే ఏది అర్థం కాదు : మనం పలికిన వాటినే పలుకుతూ గుర్తు పెట్టుకుంటూ జ్ఞానంగా ఎదగగల్గుతారు -

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete