Saturday, February 6, 2010

ఆలోచించి ఆలోచించరా

ఆలోచించి ఆలోచించరా లేదంటే ఆలోచనలోని అర్థాన్ని గ్రహించలేవురా లేదంటే మనకు తోచిన ఆలోచనలకు అర్థాలు ఉండవురా -
ఆలోచించి ఆలోచించడమంటే ధ్యాసతో ఆలోచనలను గ్రహిస్తూ సమయాలోచనలుగా మనకు ఆ క్షణం కావలసిన ఆలోచనలని -
ఆలోచనలను కూడా ఆలోచింప జేసే ఆలోచనలే మనలో కలుగుటవలన మన మేధస్సు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది -
ఆలోచనలను అర్థం చేసుకునే సామర్థ్యం ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుండి మన మేధస్సు జ్ఞానవంతగా ఎదుగుతూ వస్తుంది -
అర్థంకాని ఆలోచనలను కూడా సరైన జ్ఞానంగల వారితో చర్చిస్తే విజ్ఞానంతో పాటు అనుభవం కూడా కలుగుటకు ఉపయోగపడుతుంది -
ఆలోచనలను గూర్చి నేను కొన్ని యుగాలుగా చెప్పగలను ఇక ఆలోచించి ఆలోచనలను గమనించు అద్భుతాలకు ఆలోచనలేనని -
ఆలోచన లేకపోతే శూన్యం ఆలోచించకపోతే అజ్ఞానం ఆలోచనలే లేకపోతే నిర్జీవం ఆలోచనలు అర్థం కాకపోతే వ్యర్థం ఆలోచనలలోనే సర్వం -

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete