Saturday, February 20, 2010

* ఆహారం ఎందుకు?

శిశువుగా తల్లి కడుపున తొమ్మిది నెలల తర్వాత అన్ని అవయవాల భాగాలతో శరీరం పూర్తి నిర్మాణమైన తర్వాతనే తల్లి శ్వాస ద్వారా విశ్వశక్తి శిశువుకు చేరుతుంది -
తల్లి ఆత్మ ధ్యాసలో(తెలియని ధ్యాన స్థితిలో) ఉన్నప్పుడే విశ్వశక్తి మరో ఆత్మగా శిశువులో చేరి శ్వాసగా జీవమై శరీరానికి చలనం కలుగుతుంది -
విశ్వశక్తి అనేది పరమాత్మ యొక్క "రూపం లేని వాయుశక్తి" /"ప్రాణ వాయువు" -
తల్లి శ్వాసతో శిశువు ఆత్మకు ఎరుక కలిగినప్పుడే శ్వాస నాభి స్థానము నుండి నాసికము వరకు మొదలవుతుంది ప్రాణవాయువులా -
మొదటి శ్వాసతో అన్ని భాగాలకు స్పర్శతో చలనం ఏర్పడి అవయవాలు పని చేయడం ప్రారంభిస్తాయి -
అవయవాలు శ్వాస ఉన్నంతవరకు పని చేస్తూనే ఉంటాయి -
ఎప్పుడైతే శరీరం ఎక్కువగా కదులుతుందో ఆ సమయాన శరీరంలో శక్తి తగ్గి ఆకలి వేస్తుంది కనుక ఆహరం అవసరం అలాగే ఎక్కువగా కదలడానికి ఎదగడానికి పని చేయడానికి రోజు తినవలసి వస్తుంది -
ఎప్పుడైతే ఆహారం తీసుకోలేకపోతామో శరీరం శక్తి లేక ఉత్తేజము లేక మేధస్సు సరిగా పని చేయక క్రమంగా లీనమై నశిస్తూ అనారోగ్యంగా మారుతుంది -
ప్రతి రోజు అవసరమైన పరిణామంలో సరైనా సమయాలలో ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉల్లాసంగా పనులు చేసుకుంటూ జీవించగల్గుతాం -

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete